Search
  • Follow NativePlanet
Share
» »February Travel Destination: ఫిబ్రవరిలో సంద‌ర్శించేందుకు రాజ‌స్థాన్‌లోని బెస్ట్ ప్లేసెస్‌..

February Travel Destination: ఫిబ్రవరిలో సంద‌ర్శించేందుకు రాజ‌స్థాన్‌లోని బెస్ట్ ప్లేసెస్‌..

ఫిబ్రవరి నుంచి శీతాకాలం తీవ్రత కొద్దిగా తగ్గడం మొద‌ల‌వుతుంది. ఈ సీజన్ ప్రయాణానికి ఎంతో ఉత్తమమైనది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు రాజస్థాన్ సందర్శించడానికి ఉత్తమమైన సీజన్. ఎందుకంటే అప్పటి నుండి ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరిలో విహారానికి వెళ్లాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా రాజ‌స్థాన్‌ను సంద‌ర్శించండి. రాజ‌స్థాన్‌లో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. రాజ‌స్థాన్‌లోని అందమైన నగరం బికనీర్‌. ఈ ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఈ ప్రాంతాన్ని వీక్షించేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోండి. దీనికి రెండు మూడు రోజుల సమయం సరిపోతుంది. ఢిల్లీలో నివసించే వార‌యితే త‌ప్ప‌కుండా వీకెండ్‌లో ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. వారాంతాల్లో అన్వేషించడానికి ఇది గొప్ప గమ్యస్థానం. మ‌రెందుకాల‌స్యం ఈ ప్రాంతాల‌ను చుట్టేయండి.

రాజస్థాన్‌లోని బికనీర్ చాలా అందమైన నగరం. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున, ఏడాది పొడవునా పర్యాటకుల రద్దీ ఇక్క‌డ ఎక్కువగా ఉంటుంది. బంగారు ఇసుక తిన్నెల కారణంగా ఈ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.

bikanerjunagadhfort1

జునాగఢ్ కోట

బికనీర్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా జునాగఢ్ కోటను వీక్షించాల్సిందే. లేదంటే ప్రయాణం అసంపూర్తిగా ఉంటుంది. ఈ కోట యొక్క ప్రారంభ నిర్మాణాన్ని మహారాజ్ రావ్ బికా 1478 AD లో నిర్మించిన‌ట్లు చ‌రిత్ర చెబుతుంది. జునాగఢ్ కోటను స్వాధీనం చేసుకునేందుకు, అనేక మంది రాజులు దానిపై దాడి చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.

lalgarhpalace

లాల్‌ఘర్ ప్యాలెస్

బికనీర్‌లోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌లో లాల్‌ఘర్ ప్యాలెస్ ఒక‌టి. ఈ ప్యాలెస్ అందాల‌ను చూస్తూ ప‌ర్యాట‌కులు త‌మ‌ను తామే మ‌ర్చిపోతారు. ఈ కోట 20వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ప్యాలెస్‌ని రాజ్‌పుతానా ప్యాలెస్ అని కూడా అంటారు. అయితే, ఇప్పుడు ఈ ప్యాలెస్ హెరిటేజ్ హోటల్, మ్యూజియంగా మార్చబడింది.

karnimatatemple1

కర్ణి మాత ఆలయం

బికనీర్‌లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌తో పాటు ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కర్ణి మాత ఆలయం. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది, అయితే ఈ ఆలయం బికనీర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ నగరంలో ఉంది. ఈ ఆల‌యం ఎలుక‌ల‌కు ప్ర‌సిద్ధిచెందింది. ఆల‌యం అంటే దేవ‌త‌ల‌కు ప్ర‌సిద్ధిచెంది ఉంటుంది. కానీ, ఎలుక‌లకేంటీ అనుకుంటున్నారా? ఈ ఆలయంలో 25,000 కంటే ఎక్కువ ఎలుకలు ఉన్నాయి. ఈ ఆలయంలో భక్తులకు ఎలుకల ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇదే ఇక్క‌డి ఆచారం. ఈ ఆచారాన్ని ఇక్క‌డివారు ఎన్నోయేళ్లుగా పాటిస్తున్నారు. నవరాత్రి సందర్భంగా కర్ణిమాత ఆలయంలో పెద్ద జాతర నిర్వహిస్తారు. ఈ జాత‌ర‌ను చూసేందుకు కూడా ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు.

వివిధ ర‌కాల వంట‌కాలు ల‌భ్యం..

నిజానికి, రాజస్థాన్‌లోని ప్రతి నగరం దాని ఆహారానికి ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. దాదాపు ప్రతి నగరంలో ప‌ర్యాట‌కులు ఆనందించగల కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తక్కువ డబ్బుతో అనేక వంటకాలను ఇక్క‌డ రుచి చూడొచ్చు. బికనీర్‌ను సంద‌ర్శిస్తే రాజ్-కచోడి, ఘేవర్, కేసర్ ఫిని, బికనేరి భుజియా, గట్టే కి సబ్జీ రుచి ఆస్వాదించ‌డం అస్స‌లు మర్చిపోకండి. బికనీర్‌లోని కంజి బడా చాలా ప్రసిద్ధి చెందింది.

చేరుకోవడం ఎలా?

ఢిల్లీ నుండి బికనీర్ సులభంగా చేరుకోవచ్చు. ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి బికనీర్‌కు నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్క‌డ ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులు కూడా నడుస్తాయి. బికనీర్ చేరుకోవడానికి చాలా రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. విమానంలో ఇక్కడికి రావాలని ఆలోచిస్తుంటే మాత్రం జోధ్‌పూర్ సమీపంలోని విమానాశ్రయం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+