Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ నుంచి శ్రీలంక ఐదురోజుల‌ ఎయిర్ టూర్ ప్యాకేజీ..!

హైదరాబాద్ నుంచి శ్రీలంక ఐదురోజుల‌ ఎయిర్ టూర్ ప్యాకేజీ..!

శ్రీ‌లంక టూర్ వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే..! ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీలంకకు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఇది మొత్తం ఐదు రోజుల టూర్ ప్లాన్‌. ఈ ప్ర‌యాణంలో శ్రీలంకలోని ప్ర‌సిద్ధిచెందిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను వీక్షించొచ్చు. ఈ స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో క‌లిసి సర‌దాగా విహ‌రించాల‌నుకుంటున్నారా..? అయితే, ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీని అస్స‌లు మిస్ చేసుకోకండి. ఐఆర్‌సిటిసి శ్రీలంక రామాయణ యాత్ర పేరుతో శ్రీలంక ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ యాత్ర‌లో భాగంగా హైదరాబాద్ నుంచి మీ జ‌ర్నీ ప్రారంభ‌మవుతుంది. ఇది మొత్తం ఐదురోజుల టూర్ ప్యాకేజీ. ఐఆర్‌సిటిసి శంకరీ దేవి శక్తి పీఠం ఐదు రోజుల‌ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది.

ఈ టూర్ ప్యాకేజీ రూ.49,930 ప్రారంభ ధరతో మొద‌ల‌వుతుంది. మొత్తం ఐదురోజుల ఈ జ‌ర్నీలో కొలంబో, దంబుల్లా, కాండీ, నువరేలియా ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ జూన్ 1న ప్రారంభ‌మ‌వుతుంది.

nuriliya

ఐదు రోజుల టూర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి...

మొద‌టి రోజు ఉదయం 06:30 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బ‌య‌లుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి విమానంలో బయలుదేరుతాం. ముందుగా శ్రీలంక‌ను చేరుకోవాలి. మ‌ధ్యాహ్నం 12:10 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు ప్ర‌యాణం ఉంటుంది. మార్గంమధ్యలో చిలావ్‌లోని మునీశ్వరం ఆలయాన్ని ద‌ర్శించుకుంటారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి మనవేరి ఆలయానికి చేరుకుంటారు. అనంత‌రం దంబుల్లాకు చేరుకుంటారు. దంబుల్లాలో దిగి హోట‌ల్‌లో చెక్ ఇన్ అయ్యి రాత్రి అక్క‌డే బ‌స చేస్తారు. మొద‌టి ప్ర‌యాణ‌మంతా కొలంబో, దంబుల్లాలోనే ఉంటుంది.

ఇక రెండో రోజు అదే హోట‌ల్‌లో టిఫిన్ చేసి చెక్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. అక్క‌డినుండి ట్రింకో మ‌ళ్లీకి బ‌య‌లుదేరాలి. ఉదయం ఏడు గంటలకు ట్రింకోమలీకి చేరుకుని, అక్క‌డ ఉన్న‌ తిరుకోణేశ్వర్, లక్ష్మీ నారాయణ ఆలయ ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆ త‌ర్వాత కాండీకి వెళ్తారు. ఆ రోజంతా కాండీ నగర పర్యటన ఉంటుంది. కాండీ ప్ర‌దేశం విలువైన రాళ్లకు ప్రసిద్ధి చెందింది. కాండీ ప్రాంతం శ్రీలంకలోని అతిపెద్ద హిల్ స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్క‌డ జెమ్స్ ఫ్యాక్టరీ / బాటిక్ ఫ్యాక్టరీ వంటివాటిని చూడొచ్చు. ఇక్క‌డ అత్యంత ప్ర‌సిద్ధిగాంచిన మ‌రో పుణ్యక్షేత్రం ఉంది. అదే టూత్ టెంపుల్. ఇది గౌతమ బుద్ధుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. ఆ నైటంతా కాండీలోనే బ‌స చేయాలి.

sanchistupa

ఇక మూడోరోజు టిఫిన్ చేశాక నువారెలియా టూర్ ఉంటుంది. ఈ మార్గంలో రాంబోడాలోని భక్త హనుమాన్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్క‌డ అనేక ఆల‌యాలు వెల‌సాయి. అందులో ముఖ్యంగా సీత అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక సందర్శిన‌కు అనువైన‌వ‌నే చెప్పుకోవాలి. ఆ తర్వాత తిరిగి కాండీకి చేరుకుంటారు. కాండీ (Kandy)లో హోటల్లో రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

నాలుగో రోజు అల్పాహారం పూర్త‌య్యాక హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్క‌డినుండి నెగంబో సంద‌ర్శ‌న ఉంటుంది. పిన్నవాలా ఎలిఫెంట్ అనాథాశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కొలంబో పయమవుతారు. మార్గంలో మధ్యాహ్న భోజనం ముగించుకుని, పంచముగ ఆంజనేయర్ ఆలయం, కెలనియా బుద్ధ దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్క‌డ క్లాక్ టవర్, గాల్ ఫేస్, కొలంబో హార్బర్, బైరా లేక్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మ్యూజియం, నేలమ్ పోకునా థియేటర్, టౌన్ హాల్‌తో సహా లైట్‌హౌస్‌, కొలంబో నగర పర్యటన చేస్తారు. ఆ త‌ర్వాత సాయంత్రం కొలంబోలోకూడా చేయ‌వ‌చ్చు. ఇక‌, అక్కడి నుంచి హోటల్‌కి వెళ్తారు. ఆ నైటంతా నెగొంబోలోనే బస చేస్తారు. ఇక‌, ఐదో రోజు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కోసం 04:00 AMకి విమానాశ్రయానికి వెళ్తారు. ఉదయం 07:25 గంటలకు UL 177 విమానం బయలుదేరి 09:20 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తోంది.

ప్యాకేజీ వివ‌రాలు ఇలా ఉన్నాయి...

సింగిల్ షేరింగ్ అయితే రూ.62660 చెల్లించాలి. డబుల్ షేరింగ్ అయితే రూ.51500 ఉంటుంది. ఇక‌, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.49930 గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.39440 చెల్లించాలి. చైల్డ్ విత్ అవుట్ బెడ్ రూ.37430 ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం మీ శ్రీ‌లంక ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రీ.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+