తెలంగాణ టూరిజం ఇటీవల పర్యాటకుల కోసం సరికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు వీకెండ్ టూర్ ట్రిప్‌లు, నగరంలోని ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు మరెన్నో. అయితే, తెలంగాణలో పర్యటించేందుకు మరెన్నో ప్రదేశాలు ఉన్నాయి. అందులో దక్షిణ తెలంగాణలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునేవారికి తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని 18 శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ ఆలయంతో పాటు బీచ్ పల్లి ఆలయాలను కూడా వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీ వీకెండ్‌లో భాగంగా తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది. ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.
తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్యాకేజీ 'BEECHPALLI-ALAMPUR TEMPLES & BACK' పేరుతో ఆపరేట్ కానుంది. ఈ ప్యాకేజీ ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ఒక్కరోజులో ముగుస్తోంది.

టూర్ షెడ్యూల్ ఇదే..
తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్యాకేజీ ఒకే ఒక్క రోజులోనే ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉదయం 11. 30 గంటలకు దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధిచెందిన హనుమంతుని ఆలయం బీచ్ పల్లికి చేరుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరుతారు. ఇక ఈ ప్రాంతంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కృష్ణానది పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కృష్ణానదిపై వంతెన దాటుతున్నప్పుడు ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న కృష్ణా నది దాటిగా ప్రవహిస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు దేశంలోని 18 శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటుంది. అనంతరం స్థానికంగా ఉన్న పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షిస్తారు. ఆ తర్వాత హారిత హోటల్ లో మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇక, సాయంత్రం కూడా ఇక్కడే స్నాక్స్ ఇస్తారు. 04.30 PM నిమిషాలకు అలంపూర్ నుంచి హైదరాబాద్ కు తిరగు ప్రయాణమవుతారు. రాత్రి 08.00 PM గంటల సమయంలో హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టిక్కెట్ ధరలు..
తెలంగాణ అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా టిక్కెట్ ధరలను ఒకసారి పరిశీలిస్తే పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. అదే పిల్లలకయితే రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ - జోగులాంబ - బీచ్ పల్లి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకునేవారు లేదా ఇతర పూర్తి సమాచారం కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/ ను సంప్రదించగలరు. మరెందుకాలస్యం మీరుకూడా తెలంగాణ టూరిజం అందిస్తోన్న ప్యాకేజీనీ బుక్ చేసేయండి మరి..



Click it and Unblock the Notifications













