Search
  • Follow NativePlanet
Share
» »ఉత్త‌రాఖండ్‌లోని గరుడ దేవాల‌యం ఎంతో పురాత‌న‌మైన‌ది..

ఉత్త‌రాఖండ్‌లోని గరుడ దేవాల‌యం ఎంతో పురాత‌న‌మైన‌ది..

భారతదేశం ప్రసిద్ధ దేవాలయాలకు సంప్రదాయాలకు నిలయం. దేశంలో ఎన్నో పురాత‌న దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొ దేవాల‌యం ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని దేవుళ్ల‌ను మొక్కుకుంటారు అలాగే వారి కోరికలు తీరాక స్వామి వారికీ మొక్కులు కూడా చెల్లించుకుంటారు. భార‌త్‌లోని ఈ ఆలయాలు వెలకట్టలేని సంపదగా నిలుస్తూ, నలుదిశలా ఆధ్యాత్మికతను విస్తరింపజేస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో కూడా ఎన్నో పురాతన దేవాలయాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి దేవాలయానికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు వాటి ప్రాముఖ్యతల‌ను కూడా సంత‌రించుకున్నాయి. అందుకే ప్ర‌తి ఏటా ఇక్క‌డికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భ‌క్తులు, ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఇక్క‌డి ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తుంటారు. ఇక‌, ఇక్కడ రిషికేష్‌కు స‌మీపంలో ఒక ప్ర‌త్యేక‌మైన, ఎంతో పురాత‌న‌మైన ఆల‌యం ఒక‌టి ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

garudatemple

పౌరీలోని పురాత‌న ఆల‌యం..

ఉత్త‌రాఖండ్‌లోని రిషికేష్‌కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో నీలకంఠ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆల‌యానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో పౌరీ జిల్లాలో ఒక పురాతన గరుడ ఆలయం ఉంది. ఇది ఉత్త‌రాఖండ్‌లోని ఏకైక గ‌రుడ దేవాల‌యంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఆల‌యానికి మ‌రో పేరు కూడా ఉంది. అదే గరుడ చత్తి.. ఈ ఆల‌య విశేష‌తలు తెలుసుకుందాం.

కాలస‌ర్పం దోషం తొలిగే ఆల‌యం...

ఈ ఆల‌యం స‌మీపంలో చుట్లూ చెట్ల‌తో ప‌చ్చ‌ద‌నం భ‌క్తుల‌ను, ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ ప్ర‌దేశం. ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండడంతో ఇక్క‌డికి ఎక్కువ మంది ప‌ర్యాట‌కులు రావడానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ ఆల‌యంలో ఉండే ఒక చెరువు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఈ చెరువులో ఎన్నో ర‌కాల రంగురంగుల చేప‌లు నివ‌సిస్తున్నాయి. ఈ గ‌రుడు ఆల‌యాన్ని సంద‌ర్శించిన వారికి కాల‌స‌ర్ప దోషం తొల‌గిపోతుందని ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల న‌మ్మ‌కం..ఉత్త‌రాఖండ్‌లోని ఏకైక గ‌రుడ దేవాల‌యంగా ఈ ఆలయం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది.

garudatemple

ఈ చెరువు స్వ‌ర్వ రోగ నివారిణి...

అయితే ఈ ఆల‌యంలోని చెరువు సాధార‌ణ చెరువు కాద‌ని ఎంతో పురాత‌న‌మైన చ‌రిత్ర ఈ ఆల‌యానికి ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ చెరువు గ‌రుణ్ గంగ‌తో నేరుగా సంబంధం క‌లిగి ఉంద‌ని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల విశ్వాసం.. ఈ చెరువు నీటిలో ఒక్క‌సారి మునిగితే అన్నీ రోగాల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతార‌ని ఇక్క‌డికొచ్చే భ‌క్తుల న‌మ్మకం. ఈ చెరువు స్వ‌ర్వ రోగ నివారిణిగా కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఇందులో మునిగి వారిని పాప‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ చెరువులోని ర‌క‌ర‌కాల చేప‌ల‌కు పిండిమాత్ర‌లు, పేడా వంటి ఆహార ప‌దార్థాల‌ను తినిపిస్తారు. దీనివ‌ల్ల రాహువు లోపం తొల‌గిపోతుంద‌ని భ‌క్తుల భావ‌న‌..అందుకే ఇక్క‌డికొచ్చే వేలాది మంది భ‌క్తులు ఈ చెరువులో త‌ప్ప‌క స్నాన‌మాచ‌రిస్తారు. అంతేకాకుండా చెరువులోని చేప‌ల‌కు ఆహారాన్ని కూడా అంద‌జేస్తారు.

నీలకంఠ మహాదేవ్ ఆలయం.

ఇక్క‌డి మ‌రో దేవాల‌యం నీలకంఠ మహాదేవ్ ఆలయం. ఈ ఆల‌యం రిషికేష్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన, ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆల‌యం 1330 మీటర్ల ఎత్తులో కొండపై నెల‌కొని ఉంది. ఇది నార్ నారాయణ్ పర్వత శ్రేణికి ఆనుకుని స్వర్గాశ్రమం పైన ఉంది. ఈ ఆల‌యం చుట్టూ మ‌ణికూట్‌, బ్ర‌హ్మ‌కూట్‌, విష్ణ‌కూట్ అనే మూడు లోయ‌లు ఉన్నాయి. ఈ ఆల‌యం చుట్టూ ద‌ట్టమైన అడవితో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. ఈ ఆల‌యాన్ని చేరుకోవాంటే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

More News

    Read more about: pauri rishikesh uttarakhand
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+