Search
  • Follow NativePlanet
Share
» »వారంతంలో విహారించాలంటే ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి..

వారంతంలో విహారించాలంటే ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి..

ఉద్యోగం చేసేవారు వారంలో సెల‌వులు ఎప్పుడూ వ‌స్తాయా? అని ఎదురు చూస్తుంటారు. ఈ డిసెంబ‌ర్ నెల‌లో వీకెండ్ సెల‌వులు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఢిల్లీ వాసుల‌యితే త‌ప్ప‌కుండా ఈ వీకెండ్‌లో ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి. ఒంట‌రిగా ప్ర‌యాణించాల‌నుకునేవారికి ఈ ప్ర‌దేశాలు ఎంతో ఫేమ‌స్‌. ఈ ప్రాంతాలు ఢిల్లీ నుంచి కేవ‌లం ఐదు కిలోమీట‌ర్ల‌దూరంలోనే ఉంటాయి. కాబ‌ట్టి ఎక్కువ దూరం ప్ర‌యాణించాల‌న్న విసుగు ఉండ‌దు. ఇక్క‌డ నివ‌సించే చాలామంది ప‌ర్యాట‌కులు వీకెండ్ రాగానే ఎక్కువ‌శాతం ఉత్త‌రాఖండ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ వంటి ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు బ‌యలుదేరుతుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఢిల్లీకి అతి ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. కాబట్టి ఈ జాబితాలో ఏయే ప్రదేశాలు చేర్చబడ్డాయో వాటి గురించి తెలుసుకుందాం.

bharatpur , delhi

భరత్పూర్

భరత్పూర్ రాజస్థాన్‌లో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం. ఇది అనేక కారణాల వల్ల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. భరత్‌పూర్‌ను 1733లో మహారాజా సూరజ్ మల్ జాట్ స్థాపించారు. ఇక్క‌డ సంద‌ర్శించేంద‌కు అనేక ప్ర‌దేశాలున్నాయి. ఢిల్లీ నుండి అతి తక్కువ దూరంలో ఉంది భరత్‌పూర్. ఈ అందమైన ప్రదేశానికి కేవలం 4 నుండి 5 గంట‌ల్లో చేరుకోవ‌చ్చు. ఈ నగరాన్ని రాజస్థాన్ తూర్పు ద్వారం అని కూడా పిలుస్తారు. భరత్‌పూర్ ప్రకృతి అందాలతో నిండి ఉన్న ప్ర‌దేశం. ఇక్కడి కియోలాడియో నేషనల్ పార్క్‌కి రావడం వ‌ల్ల ప‌ర్యాట‌కులు అనేక జంతువులు, పక్షులను చూడొచ్చు.

చలికాలంలో ఇక్కడికి వ‌ల‌స వ‌చ్చే సైబీరియన్ కొంగల‌ను, ఇంకా కొన్ని అరుదైన ప‌క్షి జాతుల‌ను చూసే అవ‌కాశం ఉంటుంది. అంతే కాదు, ఇక్క‌డ ఇంకా లోహగర్ కోట, గంగా టెంపుల్‌, భరత్‌పూర్ ప్యాలెస్ కూడా ప‌ర్యాట‌కులు చూడదగ్గ ప్రదేశాలే. కియోలాడియో నేషనల్ పార్క్ ఇక్క‌డ అత్యంత ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం. ఇది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ పక్షి అభయారణ్యం. దీనిని గతంలో భరత్‌పూర్ పక్షుల అభయారణ్యం అని పిలిచేవారు. ఇందులో వేలాది ర‌కాల అరుదైన, అంతరించిపోయిన జాతుల పక్షులు ప‌ర్యాట‌కుల‌కు కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశంలోని నేషనల్ పార్క్‌లో 200 కంటే ఎక్కువ జాతుల పక్షులు తమ నివాసాలను ఏర్పరచుకున్నాయి. ఈ నేషనల్ పార్క్ సుమారు 29 చద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 1956లో అభయారణ్యంగా ప్రకటించబడింది. 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చబడింది.

roorkee, Uttarakhand

రూర్కీ

ఢిల్లీకి సమీపంలో ఉన్న ప్రదేశాల జాబితాలో ఉత్తరాఖండ్ రెండవ స్థానంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ప్రదేశం ఎంతో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. వాటితో పాటు అందంతో కూడా నిండి ఉంది. ఈ ప్ర‌దేశాన్ని చేరుకునేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. ఈ ప్రదేశం శీతాకాలంలో సందర్శించడానికి ఎంతో ఉత్తమమైనది. పచ్చదనం, పర్వతాలు, దేవదారు చెట్లతో చుట్టుముట్టబడిన దృశ్యాలు ఇక్కడ ప‌ర్యాట‌కులకు క‌నువిందు చేస్తాయి. రూర్కీకి వచ్చినట్లయితే, గంగా కెనాల్, సోలానీ పార్క్ మరియు IIT రూర్కీ వంటి ప్రదేశాలను త‌ప్ప‌కుండా సంద‌ర్శించండి.

jaspur , Rajasthan

జస్పూర్

ఉత్తరాఖండ్‌లోని మరొక అంద‌మైన ప్ర‌దేశం జ‌స్పూర్‌. ఇది భారతదేశంలోని ఉత్తర రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది కాశీపూర్‌కు ఆగ్నేయంగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పట్టణం చుట్టూ పచ్చని పొలాలు మరియు సున్నితమైన కొండలు విస్తరించి ఉంటాయి. దూరంలో ఉన్న శివాలిక్ శ్రేణి దృశ్యాలు ప‌ర్యాట‌కులను మంత్రముగ్దులను చేస్తాయి. చిన్న, పెద్ద మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, పెద్ద దేవదారు చెట్లు ఈ ప్రదేశానికి అందాన్ని ఇస్తాయి. ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. ఢిల్లీ నుండి జస్పూర్ చేరుకోవడానికి కేవలం 5 గంటల సమయం మాత్ర‌మే పడుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+