Search
  • Follow NativePlanet
Share
» »రివర్ రాఫ్టింగ్‌కి వెళ్తున్నారా.. అయితే ఈ ప్ర‌దేశాలు ఎంతో ఉత్త‌మం..

రివర్ రాఫ్టింగ్‌కి వెళ్తున్నారా.. అయితే ఈ ప్ర‌దేశాలు ఎంతో ఉత్త‌మం..

భార‌త‌దేశం అనేక నదుల సంగ‌మం. ఇక్క‌డ అనేక నదులు ఉన్నందున రివ‌ర్ రాఫ్టింగ్ కూడా ప్ర‌సిద్ధిచెందింది. చాలామంది ఈ సీజ‌న్‌లో రివ‌ర్ రాఫ్టింగ్ చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇండియాలో ఇటీవ‌ల‌ వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతుంది. వాట‌ర్ స్పోర్ట్స్ వంటి కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదించేందుకు వేసవి సీజన్ ఎంతో అనువుగా ఉంటుంది.

ముఖ్యంగా ఎగసిపడే అలలతో కూడిన నదులు, కాలువల్లో రివర్ రాఫ్టింగ్ చేయడం ప‌ర్యాట‌కుల‌కు థ్రిలింగ్ అనుభూతిని పంచుతుంది. రివర్ రాఫ్టింగ్ థ్రిల్‌ను అనుభూతిని పొందాల‌నుకుంటే మాత్రం దేశంలోని ఈ ప్రదేశాలకు త‌ప్ప‌కుండా వెళ్లాల్సిందే..

riverraftingrishikesh

రిషికేష్

గంగా నది తీరాన ఉన్న రిషికేశ్‌ వాటర్ రాఫ్టింగ్‌కు ఎంతో అనువైన ప్రదేశం. ఉత్త‌రాఖండ్‌లోని ఈ ప్రాంతం యోగా రాజధానిగా ప్ర‌సిద్ధిచెందింది. బ్రహ్మపురి నుండి రిషికేశ్ స్ట్రెచ్ (9 కిలోమీట‌ర్ల‌), శివపురి నుండి రిషికేశ్ స్ట్రెచ్ (16 కిలోమీట‌ర్లు), మెరైన్ డ్రైవ్ నుండి రిషికేశ్ (24 కిలోమీట‌ర్లు) అలాగే కౌడియాల నుండి రిషికేశ్ స్ట్రెచ్ (36 కిలోమీట‌ర్లు) నదిలో రివర్ రాఫ్టింగ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అడ్వంచ‌ర్ ట్రిప్ చేయాల‌నుకునేవారికి ఇది ఓ చ‌క్కని అవ‌కాశమ‌నే చెప్పుకోవాలి.

riverraftingriver

తీస్తా నది

సిక్కింలో ప్రవహించే తీస్తా న‌ది రివ‌ర్ రాఫ్టింగ్‌కు ఎంతో అనువైన ప్ర‌దేశం. దీనిని హిమాలయాల నుండి జన్మించిన న‌దిగా అభివ‌ర్ణిస్తారు. ఈ నది ఎన్నో ప్రకృతి అందాల మధ్య పారుతూ ఉంటుంది. ఇక్కడ చేసే రివర్ రాఫ్టింగ్ ఎంతో సాహ‌సంతో కూడుకున్న‌ద‌నే చెప్పుకోవాలి. ఇక్క‌డి చుట్టుపక్కల సహజ సౌందర్యాలతో పచ్చని చెట్లు ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉంటాయి. వాటి మధ్య చేసే రివర్ రాఫ్టింగ్ ప‌ర్యాట‌కులు ఓ అద్భుతమైన అనుభూతిని క‌లిగిస్తుంది.

జంస్కర్ నది

జంస్కర్ నది లడక్ ప్రాంతంలో వెల‌సింది. ఈ ప్ర‌దేశం రివర్ రాఫ్టింగ్ ఎంతో అనుకూల‌మైన‌ద‌నే చెప్పుకోవాలి. పాదుమ్ ప్రాంతం నుండి నిమ్మో వరకు రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. ఇంకా ఇక్క‌డ అనేక సాహస క్రీడలు కూడా చేయొచ్చు. ఇక్క‌డ ఏ సీజ‌ల్‌నైనా నీళ్లు చ‌ల్ల‌గానే ఉంటాయి. ఇక్క‌డ రివ‌ర్ రాఫ్టింగ్ చేయాలంటే పర్వత లోయల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతో అనుభూతిని క‌లిగిస్తుంది. దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణంలో గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రమే ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి.

riverraftinginriver

బియాస్ నది

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది రివర్ రాఫ్టింగ్ చేసేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశం. ఇక్క‌డ రివ‌ర్ రాఫ్టింగ్ చేసేవారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. బియాస్ న‌ది కులూ లోయ నుంచి ప్ర‌వ‌హిస్తుంది. ఇక్క‌డ రివర్ రాఫ్టింగ్ చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. గ్రేడ్ 1 గ్రేడ్ 3 లెవెల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వివిధ దశల్లో మొత్తం 14 కిలోమీటర్ల మేర ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు.

కాళీ నది

కాళీ న‌ది కర్ణాటకలోని దట్టమైన అడవుల్లో మధ్య సాగే నది. ప్ర‌కృతి అందాల‌ను ద‌గ్గ‌రి నుంచి వీక్షించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ న‌ది దగ్గ‌ర‌కు రావాల్సిందే. ఇక్కడ చేసే రివర్ రాఫ్టింగ్ మీకు మంచి అనుభూతిని క‌లిగిస్తుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+