Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌రవాసుల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌ధాని చేతుల మీదుగా కొత్త రైల్వే టెర్మిన‌ల్‌

భాగ్య‌న‌గ‌రవాసుల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌ధాని చేతుల మీదుగా కొత్త రైల్వే టెర్మిన‌ల్‌

భాగ్య‌న‌గ‌రవాసుల‌కు సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పంది. న‌గ‌రంలో మ‌రో కొత్త రైల్వే టెర్మిన‌ల్ ప్ర‌యాణికుల కోసం అందుబాటులోకి రానుంది. అధికారిక స‌మాచారం మేర‌కు కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న‌ ఈ స్టేషన్ నుంచి సుమారుగా 25 రైళ్లు ప‌రుగులు తీయ‌నున్నాయి. 2024 మార్చి నెల మొద‌టి వారం నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులోకి రానునాన్న‌యి. ఈ టెర్మిన‌ల్‌ను మార్చి ఫ‌స్ట్ వీక్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స్వ‌యంగా ప్రారంభించ‌న‌నున్నారు. దీంతో భాగ్య‌న‌గరంలోని ప్రయాణికుల ట్రాఫిక్ స‌మ‌స్య‌లు తీర‌నున్నాయి.

తెలంగాణ‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ పేరు చెబితే ప్ర‌యాణీకుల ర‌ద్దీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా చెబుతారు. ఈ స్టేష‌న్‌ వ‌చ్చీపోయే ప్రయాణీకుల‌తో 24 గంట‌లూ క‌టికిట‌లాడుతూనే ఉంటుంది. నిజానికి ఈ రైల్వే స్టేష‌న్‌లో ప‌ది రైలు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అయితే, ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు ఇక్క‌డ ఇత‌ర రైళ్లు ఆగేందుకు ఖాళీ లేదు.

దీంతో వేల కిలోమీట‌ర్ల నుంచి వ‌చ్చిన ట్రైన్స్‌, ఎక్స్‌ప్రెస్‌లు భాగ్య‌న‌గరంలోని శివార్ల‌లో ఆపాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఈ స‌మ‌స్య‌ను అధిగమించేందుకు రైల్వే శాఖ వినూత్న ఆలోచ‌న‌కు తెర‌లేపింది. ఓ కొత్త టెర్మిన‌ల్ హైద‌రాబాద్‌లోని చ‌ర్లప‌ల్లిలో కొత్త‌గా నిర్మించ‌నున్నారు. కొత్త‌గా ప్రారంభ‌మ‌వుతున్న ఈ రైల్వే టెర్మిన‌ల్ ద్వారా ప్ర‌యాణికుల ట్రాఫిక్ క‌ష్టాల‌కు ప‌రిష్కారం ల‌భించ‌నుంద‌ని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

bhagyanagarcentralrailway

నేరుగా చ‌ర్ల‌ప‌ల్లికి..

చర్లపల్లిలోని ఈ కొత్త రైల్వే టెర్మిన‌ల్ నుంచి సుమారుగా 25 ట్రైన్స్ ప్ర‌యాణించ‌నున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. లింగంపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆగ‌కుండా నేరుగా సనత్‌నగర్‌ -మౌలాలి మీదుగా చర్లపల్లికి చేరుకునేలా అధికారులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. దీంతో అటు సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ర‌ద్దీ త‌గ్గ‌డంతోపాటు ప్ర‌యాణీకుల స‌మ‌యం ఆదా అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

కొత్త‌గా నిర్మిత‌మ‌వుతున్న ఈ చర్లపల్లి స్టేషన్‌లో మెుత్తంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆరు ప్లాట్ ఫామ్‌ల‌లో రెండింటిని ఎంఎంటీఎస్‌లకు కేటాయించనున్న‌ట్లు స‌మాచారం. ఈ స్టేషన్‌కు ఎంఎంటీఎస్‌లు చేరుకునేలా ఏర్పాట్లు కూడా చేయ‌డం జ‌రిగింది. రోజువారీ ప్ర‌యాణం సాగించేవారికి ఇది ఎంతో ఊర‌ట క‌లిగించే విష‌య‌మ‌నే చెప్పాలి.

bhagyanagarrailwaystation

ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా...

నిజానికి, న‌గ‌రంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అర కిలోమీటరు దూరంలోనే కొత్త రైల్వే టెర్మిన‌ల్ చర్లపల్లి స్టేషన్‌ ఉంది. దీంతో న‌గ‌రంలోని ప్ర‌యాణికులంతా ఎక్కువ‌శాతం ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా ప్ర‌యాణాలు చేస్తున్నారు. కొత్త టెర్మిన‌ల్‌తో సికింద్రాబాద్‌ - చర్లపల్లి మధ్య తిరిగే MMTS ట్రైన్లతో ప్రయాణికులు నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కితే.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రయాణికులు ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా వారి గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చు.

అంతేకాదు, మౌలాలి నుంచి చర్లపల్లి వరకు మొత్తం నాలుగు రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్న‌ట్లు అధికారులు తెలపారు. వ‌చ్చే నెల మెుదటి వారంలో ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ఈ రైల్వే స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రుగుతుందని, భాగ్య‌న‌గ‌ర వాసుల ట్రాఫిక్ క‌ష్టాలు చాలా వ‌ర‌కూ తీరిన‌ట్లేన‌ని భావిస్తున్నారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+