భారతదేశంలోని అత్యంత రాయల్ ట్రైన్ సెప్టెంబరు 25వ తేది నుండి ప్రారంభమవుతుంది. రాజస్థాన్ గర్వించదగిన ప్యాలెస్ ఆన్ వీల్స్ నేటి నుండి మరోసారి ట్రాక్‌లపై పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉంది. రూ. 2 కోట్లకు పైగా వ్యయంతో పునర్నిర్మించిన ఈ ట్రైన్ ప్రయాణికులకు విలాసవంతమైన పర్యటనను అందిస్తోంది. ఈ లగ్జరీ ట్రైన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం పదండి.
ప్యాలెస్ ఆన్ వీల్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రాయల్ ట్రైన్‌గా పరిగణించబడుతుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్ నేటి నుండి 18 నగరాలకు తన ప్రయాణాన్నిప్రారంబించనుంది. ఈ ట్రైన్ జైపూర్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తోంది. ఈ రాయల్ ట్రైన్‌లో ప్రయాణించేందుకు ఇప్పటికే సుమారు 400 మందికి పైగా బుకింగ్స్ చేసుకున్నారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ట్రైన్ లోపలి భాగం వెనీర్డ్ కలప, మెక్సికన్ ఫాబ్రిక్, గోల్డెన్-మిర్రర్ వర్క్‌తో అలంకరించబడి ఉంటుంది. ఇది గతంలో కంటే మరింత అందంగా, విలాసవంతంగా ఉంటుంది. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు విభిన్నమైన రాయల్ లుక్‌తో పాటు ఒక్కో టూరిస్ట్ స్పాట్ థీమ్‌పై ప్రత్యేక అలంకరణలు చేశారు.

ఢిల్లీ టు ఆగ్రా (తాజ్ మహల్)
ప్యాలెస్ ఆన్ వీల్స్ ఈ సీజన్‌లో 32 రౌండ్లు ప్రయాణిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైన్ జైపూర్, సవాయి మాధోపూర్, చిత్తోర్‌గఢ్, ఉదయ్‌పూర్, అజ్మీర్, జైసల్మేర్, జోధ్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రాలోని తాజ్ మహల్‌లకు చేరుకుంటుంది. ప్రయాణీకులు ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కూడిన గదులతోపాటు రాజ కుటుంబంలో ఉండే అనుభూతిని పొందుతారు. ఈ ట్రైన్‌లో ప్రతి నగరాన్ని సందర్శించేందుకు వోల్వో కోచ్‌లు, గైడ్‌ల సౌకర్యం నిత్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

8 నగరాల పర్యటన..
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతిని అందించేందుకు గతేడాది రూ.6 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ద్వారా, ఏడు రోజుల్లో 8 నగరాల పర్యటన చేయొచ్చు. ఇతర ఖర్చులన్నీ ఈ ప్యాకేజీలో చేర్చబడతాయి. ఈ ట్రైన్‌లో ఓ గది రెంట్‌కు కావాలంటే రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. ఈ ట్రైన్‌లో రాజస్థాన్, ఆగ్రాలోని తాజ్ మహల్‌ను 20 రోజులకు బదులుగా కేవలం ఏడు రోజుల్లో సందర్శించే అవకాశం ఉంటుంది. ఈసారి ఈ ట్రైన్ కొత్త రూపు సంతరించుకుంది. రాజ్‌పుతానా, గుజరాత్, హైదరాబాద్ నిజాంల శైలిలో అలంకరించారు. ఈ ట్రైన్ లోపల వెనీర్ వుడ్ వర్క్‌తో పాటు, కారిడార్లు, అల్మారాలు, బెడ్‌లపై మెక్సికన్, బాంబే డైయింగ్ ఫాబ్రిక్‌ను ఉపయోగించారు.
విలాసవంతమైన సౌకర్యాలకు ప్రసిద్ధి..
ప్యాలెస్ ఆన్ వీల్స్ దేశంలోనే విలాసవంతమైన సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన ట్రైన్. ఇది రాజ వంటకాలతో పాటు సౌకర్యవంతమైన వసతి రెండింటినీ పర్యాటకులకు అందిస్తుంది. ఈసారి రాచరిక అనుభవానికి ఎటువంటి లోటు రాకుండా ట్రైన్‌లోనే మహారాజా, మహారాణి అనే రెండు రెస్టారెంట్లను రీడిజైన్ చేశారు.



Click it and Unblock the Notifications













