Search
  • Follow NativePlanet
Share
» »అర‌కు వెళ్లే ప‌ర్యాట‌కుల‌కు శుభ‌వార్త‌...పండుగ వేళ ప్ర‌త్యేక స‌ర్వీసులు...

అర‌కు వెళ్లే ప‌ర్యాట‌కుల‌కు శుభ‌వార్త‌...పండుగ వేళ ప్ర‌త్యేక స‌ర్వీసులు...

ఓవైపు వ‌ర్షాల సీజ‌న్ ముగుస్తోంది. మ‌రోవైపు పండ‌గ‌ల సీజ‌న్ స‌మీపిస్తోంది. వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది. ఈ క్ర‌మంలో దసరా సెలవుల సీజన్‌ను పురస్కరించుకొని, పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అక్టోబర్ 5వ‌తేది నుండి 15వ తేది వరకు, అరకు వాలీ పర్యాటక రైలును ప‌ర్యాట‌కుల కోసం ప్రత్యేకంగా నడిపేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈట్రైన్ ప్ర‌తిరోజు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది ఈ ట్రైన్‌. అర‌కు చేరేసేరికి సుమారు 11:30 గంటలకు సమయం పడుతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే ట్రైన్ తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు అరకు నుంచి బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు విశాఖ చేరుకుంటుంద‌ని రైల్వేశాఖ అధికారులు ఓ ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు.

మొత్తం 11 పర్యాయాలు ఈ స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుద‌న్నారు. ఈ సీజన్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వేశాఖ అంచనా భావిస్తోంది. ఈ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ప‌ర్యాట‌కుల‌కు మ‌రింత సౌకర్యం కల్పించాలనే ఉద్ధేశంతో ఈ స్పెష‌ల్ సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

Good news for the tourists

ద‌స‌రా పండుగ సీజన్‌..

ఈ స్పెష‌ల్ ట్రైన్ విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరుతాయి. అక్క‌డి నుంచి సింహాచలం, కొత్తవలస, శృంగవరపుకోటలలో ప్ర‌యాణికుల కోసం ఆగుతాయి. కంపోజిషన్ 2 వ ఏసి 1, 3 వ ఏసీ 1, స్లీపర్ క్లాస్ 10, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు 4, సెకండ్ క్లాస్‌కమ్ లగేజ్ బ్రేక్ వాన్ దివ్యాంగన్ ఫ్రెండ్లీ 2 బోగీలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు మాట్లాడుతూ..

ద‌స‌రా పండుగ సీజన్‌లో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ స్పెష‌ల్ సేవలను ప్రయాణీకుల‌కు అందించే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. దస‌రా పండగ పురస్కరించుకుని దీపావళి పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం నుంచి షాలిమార్ మధ్య స్పెష‌ల్ రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వివ‌రించారు.

విశాఖపట్నం టు షాలిమార్..

ఈ స్పెష‌ల్ స‌ర్వీసులు విశాఖపట్నం టు షాలిమార్ న‌డ‌వ‌నున్నాయి. ఈ ట్రైన్స్ విశాఖపట్నం నుంచి వ‌చ్చే నెల 1వ తేదిన, నవంబర్ 26 వ‌తేదిన‌ 11.20 గంటల స‌మ‌యానికి బయలుదేరుతుందని అధికారులు వివ‌రించారు. ఈ ట్రైన్ సింహాచలం నుంచి 11.36 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఆ మరుస‌టి రోజు (బుధవారం) షాలిమార్ చేరుకుంటుందని అధికారులు వివ‌రించారు.

ఈ స్పెష‌ల్ ట్రైన్ మొత్తం 9 పర్యాయాలు ప‌ర్యాట‌కుల కోసం తిరుగుతుందన్నారు. ఈ ట్రైన్ తిరుగు ప్ర‌యాణంలో షాలిమార్ టు విశాఖపట్నం స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 2, నవంబర్ 27 నుంచి బుధవారాల్లో 5 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ శ్రీకాకుళం రోడ్‌కి గురువారం 20.50 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్ర‌యాణంలో కూడా 9 పర్యాయాలు ఈ ట్రైన్ నడుస్తుందన్నారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+