Search
  • Follow NativePlanet
Share
» »రైలు ప్ర‌యాణికుల‌కు శుభవార్త‌.. వందేభార‌త్ స్లీప‌ర్ ట్రైన్ వ‌చ్చేస్తున్నాయ్‌...

రైలు ప్ర‌యాణికుల‌కు శుభవార్త‌.. వందేభార‌త్ స్లీప‌ర్ ట్రైన్ వ‌చ్చేస్తున్నాయ్‌...

భార‌త‌దేశంలో ఎక్కువ‌మంది ప్ర‌యాణికులు ఎంచుకునే ఏకైక మార్గం రైలు మార్గం. ఎందుకంటే రైలు ప్ర‌యాణికులు ఎంతో సౌక‌ర్య‌వంత‌మైనవి.. అతి త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. ప్ర‌యాణికులు సూదూర ప్రాంతాల‌కు వెళ్లేందుకు ఈ రైలు మార్గాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అందుకే చాలామంది మ‌న‌దేశంలో రైలు ప్ర‌యాణాల‌ను ఎంపిక చేసుకుంటారు. గత కొన్నేళ్లలో భారతీయ రైల్వేల్లో సరికొత్త మార్పులను మ‌నం చూస్తూనే ఉన్నాం.

టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో రైల్వే స్టేషన్లతోపాటు అత్యాధునిక రైళ్లతో ఇండియన్ రైల్వే స‌రికొత్త రూపురేఖలు దిద్దుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పటికే పట్టాలెక్కిన వందే భారత్ రైళ్లకు ప్ర‌యాణికుల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలో రైలు ప్ర‌యాణికుల‌కు రైల్వేశాఖ ఓ శుభ‌వార్త అందించింది. త్వ‌ర‌లోనే వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్ ట్రైన్స్ ప‌ట్టాలెక్క‌నున్నాయి. ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ కోచ్​ రైళ్లను త్వరలోనే అందుబాటులోకి రానున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్ల ట్రయల్‌ రన్‌ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఇటీవ‌లే తెలిపారు. ఆగస్టు 15 నాటికి ట్రయల్‌ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు వివరించారు.

vandebharatsleepertrainc1

మ‌రిన్ని ఆధునిక సౌక‌ర్యాల‌తో..

దేశంలో వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. వందేభారత్ ఎక్స్​ప్రెస్ స్లీపర్ ట్రైన్​ ట్రయల్​ రన్​ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పటాలెక్కనుంది. దీంతో ఇప్పటివరకు వందేభార‌త్ ట్రైన్స్ కూర్చొని ప్రయాణించేందుకు వీలుగా ఉండేది. ఈ వందేభారత్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనుంది. మిగతా ట్రైన్స్‌తో పోలిస్తే ఈ ప్రీమియం ట్రైన్‌లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కేంద్రమంత్రి అశ్విణి వైష్ణవ్ తెలిపారు.

దాదాపు 200 కిలోమీట‌ర్ల‌ వేగంతో ప్రయాణించేలా ఈ స్లీపర్ రైళ్లను రూపొందించ‌డం జ‌రిగింది. ఇందులో ఏసీ ఫస్ట్ క్లాస్ 1, టూ - టైర్ ఏసీ 4, త్రీ టైర్ ఏసీ 11 కంపార్ట్​మెంట్​లతో మొత్తం 16 బోగీలతో ఈ రైళ్లను తయారు చేశార‌ని అశ్విణి వైష్ణవ్ వివ‌రించారు. మ‌రో రెండు మాసాల్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపైకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) వారు తయారు చేస్తున్నారు. ప్రయాణికులకు ఆత్యాధునిక మెరుగైన సౌక్యరాలతో ఈ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి.

vandebharatsleepertrain

అరుదైన ఘ‌నత..

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్రయాణికుల కోసం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. ఇక‌, ఈ ట్రైన్స్ ఎక్కేందుకు ప్రయాణికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు మాత్రమే అందుబాటులోకి రాగా, తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను కూడా పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ముమ్మురం చేస్తోంది.

మరిన్ని మెరుగైన సదుపాయలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా, భార‌తీయ రైల్వే వ్య‌వ‌స్థ అరుదైన ఘ‌న‌తను సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ సర్వీస్ ఈవెంట్​గా 'లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్​'లో చోటు సంపాదించుకోవ‌డం విశేషం..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+