పచ్చని ప్రకృతి అందాలకు నిలయం.. తెలంగాణలోని గొట్టంగుట్ట..
వీకెండ్స్‌లో సరాదాగా ఫ్రెండ్స్‌తో గడపాలనుకుంటున్నారా?దానికోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా? అయితే, ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్లడం ఎందుకు, మనదేశంలోనే సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అది కూడా తెలంగాణలోనే. అందమైన జలపాతాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు తెలంగాణ పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల పర్యాటకులను ఆకర్షించే అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఎత్తయిన కొండలు, చుట్టూ అడవి.. కనుచూపుమేరంతా పచ్చదనంతో నిండిన ప్రదేశాలు ఇక్కడ బోలేడన్నిఉన్నాయి. సరాదాగా కుటుంబసభ్యులతో కలిసి ఈ ప్రాంతాలను సందర్శించొచ్చు. రోడ్డు జర్నీ, ట్రక్కింగ్, క్యాంపింగ్ వంటివి చేయాలనుకునేవారికి తెలంగాణలోని గొట్టంగుట్ట ఎంతో ఫేమస్. ఈ ప్రదేశమంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. రండి..గొట్టంగుట్ట ప్రయాణాన్ని మొదలెడతాం.

తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి..
ఇక్కడి అందమైన అడవులు, ఎత్తు నుంచి జాలువారే జలపాతాలు, ఇక్కడికొచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడి సహజసిద్ధమైన అందాలతో గొట్టంగుట్ట తెలంగాణ ఊటిగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఊటిగా పేరొందిన ఈ ప్రదేశం ఈ సీజన్‌లో సందర్శించే ప్రదేశాలలో ఉత్తమమైనది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే, రోడ్డు జర్నీ చేయాల్సి ఉంటుంది.
ఎలా చేరుకోవాలి..
హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి సుమారు రెండు గంట ప్రయాణం ఉంటుంది. గొట్టంగుట్టకు చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు ఎన్నో మధురానుభూతులను కలిగిస్తుంది. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రదేశానికి వెళ్లొచ్చు. అయితే ఇక్కడే స్టే చేయాలనుకునేవారికోస మాత్రం కర్నాటకలోని గుల్బారాలో హోటల్స్, రిస్టార్స్ అందుబాటులో ఉంటాయి. ఇక హైదరాబాద్ నుంచి అయితే దగ్గర్లోని జహీరాబాద్‌లో బస చేసేందుకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశం తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉంది. సొంతవాహానాలతో కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. బైక్ జర్నీ, కారు ప్రయాణం కూడా సౌకర్యవంతంగానే ఉంటుంది.

క్యాంపింగ్, ట్రెక్కింగ్‌కు అనువైనది..
గొట్టంగుట్ట కర్ణాటకలో ప్రవహించే భీమ నదిలో ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో ఒక రిజర్వాయర్ కూడా ఉంది. పర్యాటకులు ఈ రిజర్వాయర్‌ను కూడా సందర్శించొచ్చు. ఈ రిజర్వాయర్ చంద్రపల్లి అనే గ్రామంలో ఉంది. గొట్టంగుట్టలో ప్రసిద్ధి చెందిన జలపాతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి పది కిలోమీటర్ల దూరంలో ఉండే జాడి మాల్కాపూర్ దగ్గరలో ఉండే జలపాతం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే జలపాతాపు సవ్వడులు ఇక్కడికి వచ్చే చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోనే వైల్డ్‌లైఫ్ శాంక్చురీ కూడా ఉంది. ఈ ప్రదేశంలో ఎన్నో అడవి జంతువులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రదేశం క్యాంపింగ్, ట్రెక్కింగ్ వంటివాటికి కూడా అనువైనది.

ఈ దేవాలయంలోని జాతర ప్రత్యేకత..
ప్రకృతి అందాలు తప్ప మరో ప్రపంచం ఇక్కడ కనిపించదు. దారి పొడవునా చించోలి అభయారణ్యంతో పాటు చిన్న చిన్న ఆలయాలు, శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవానీ మాత గుడి ఉన్నాయి. శ్రీ గురు గంగాధర బక్క ప్రభు దేవాలయం అక్కడ ఉంది. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలతో పాటు ఒక జాతరను కూడా నిర్వహిస్తారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు పెద్దఎత్తున ఇక్కడికి వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో దీనిని రెండవ శ్రీశైలంగా కూడా అభివర్ణించారు. ఇక్కడి కొండలపై నుంచి ప్రవహించే జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. చంద్రపల్లి ఆనకట్ట చుట్టూ ఉన్న ప్రాంతంలో పర్యాటకులకు సౌకర్యవంతమైన బసను అందించే అనేక హోటళ్లు, రిసార్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వసతి ఎంపికలు వివిధ ధరల పరిధిలో పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications













