Search
  • Follow NativePlanet
Share
» »Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాత‌న హ‌నుమాన్ దేవాల‌యాల‌ను చూడాల్సిందే..!

Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాత‌న హ‌నుమాన్ దేవాల‌యాల‌ను చూడాల్సిందే..!

హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగ ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం వ‌చ్చింది. చాలామంది హ‌నుమాన్ భ‌క్తులు హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా దేవాల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని ప్లాన్ చేస్తుంటారు. అటువంటి వారు త‌ప్ప‌కుండా ఢిల్లీలోని ఈ ఆల‌యాల‌ను సంద‌ర్శించాల్సిందే. ఇవి దేశ రాజ‌ధాని ఢిల్లీలోని అతిపురాత‌న‌మైన హ‌నుమంతుని ఆల‌యాలు. రండీ వీటి ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసుకుందాం.

ప్రచీన్ హనుమాన్ మందిర్, కన్నాట్ ప్లేస్

ఢిల్లీకి గుండెకాయగా పిలువబడే కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఈ హనుమాన్ దేవాలయం ఎంతో పురాత‌న‌మైన‌ది, ప్ర‌త్య‌క‌మైన‌ది కూడా. ఈ దేశాల‌యం రూపంలో అనేక మార్పులు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రతిష్టించిన హనుమంతుడి విగ్రహం మహాభారత కాలం నాటిదని చ‌రిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆల‌యానికి అంత విశిష్ట‌త ఏర్ప‌డింది. పాండవులు ఈ ఆలయాన్ని స్థాపించారని ఇక్క‌డివారు చెబుతుంటారు. హ‌నుమాన్ జ‌యంతి నాడు త‌ప్ప‌కుండా ఈ దేవాల‌యాన్ని సంద‌ర్శించాల్సిందే.

karolbagh hanuman temple

హనుమాన్ దేవాలయం, కరోల్ బాగ్

ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఉన్న హనుమాన్ జీ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఇక్కడ ఉన్న హనుమంతుని విగ్రహం దాదాపు 108 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్ర‌హం చాలా సినిమాల్లోనూ, అనేక టీవీ సీరియ‌ల్స్‌లోనూ మ‌న‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇది ఢీల్లీలోని కరోల్ బాగ్ మరియు ఝండేవాలన్ స‌మీపంలో ఉంటుంది. గుండా వెళుతున్నప్పుడు లేదా అనేక టీవీ సీరియల్స్ దృశ్యాలలో ఈ విగ్రహాన్ని తప్పక చూసి ఉంటారు. ఈ గొప్ప ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఎప్పుడూ వ‌స్తుంటారు. ఇక‌, హనుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఇక్క‌డ భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంటుంది. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఢీల్లీలోని ఈ ఆలయాన్ని సంద‌ర్శించండి.

margatwalebaba temple

మార్గత్ వాలే బాబా, యమునా బజార్

ఢిల్లీలోని యమునా బజార్‌లో నిర్మించిన మార్గత్ వాలే బాబా ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి మంగళ, శనివారాల్లో ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. యమునా నది ఒడ్డున వెల‌సిన ఈ హ‌నుమాన్ ఆలయంలో, హనుమాన్ జీ విగ్రహం భూమి నుండి 10 అడుగుల దిగువన ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు ఈ ఆల‌యాన్ని సందర్శించడం ద్వారా భ‌క్తులు మానసిక ప్రశాంతతను పొంద‌డ‌మే కాకుండా వారు అనుకున్న‌వ‌న్నీ నెర‌వేర్చుకోగ‌లరని చాలామంది ఇక్క‌డికి వ‌చ్చిన వారి న‌మ్మ‌కం. అందుకే ప్ర‌తి ఏటా ఇక్క‌డ భ‌క్తుల ర‌ద్దీ అత్య‌ధికంగా ఉంటుంది. రామాయణ కాలంలో, హనుమాన్ లక్ష్మణుడి కోసం సంజీవని మూలికను తీసుకువెళుతున్నప్పుడు, విశ్రాంతి తీసుకునేందుకు ఈ ప్రదేశంలో ఆగిపోయాడని చ‌రిత్ర చెబుతోంది. అందుకే ఈ ప్ర‌దేశం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ద‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తుంటారు.

sribalajibabosatemple

ప్రాచిన్ హనుమాన్ దేవాలయం, చాణక్యపురి

ఢిల్లీలోని చాణక్యపురిలో వినయ్ మార్గ్‌లో ఉన్న హనుమంతుని ఆల‌యం కూడా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ ఆలయం చాలా పురాతన దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్క‌డికి సమీపంలో శ్రీ బతుక్ భైరవుని ఆలయం కూడా ఉంది. కాబట్టి భ‌క్తులు ఒకేసారి రెండు ఆల‌యాల‌ను సంద‌ర్శించి హ‌నుమంతుని ఆశీర్వాదాలను పొందొచ్చు. ఇక్క‌డికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భ‌క్తులు వచ్చి హ‌నుమంతుని ప్రార్థిస్తుంటారు. హనుమాన్ జయంతి నాడు ఈ ఆల‌యాన్ని సందర్శించ‌డం ద్వారా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం.

శ్రీ బాలాజీ బబోసా ఆలయం, రోహిణి

ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శ్రీ బాలాజీ బబోసా ఆలయం కూడా ఎంతో ప్రత్యేకమైనది. చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్న హనుమంతుడిని విష్ణువు, శ్రీ కృష్ణుని రూపంలో పూజలు చేస్తారు. అలాగే, ఈ ఆలయం హనుమాన్ బాల రూపాన్ని పూజించడానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. హనుమాన్ జయంతి సంద‌ర్భంగా ఈ ఆల‌యాన్ని త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిందే.

More News

    Read more about: ancient temples in delhi
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+