Search
  • Follow NativePlanet
Share
» »ఆసియాలోనే అత్యంత ఎత్త‌యిన నైనిటాల్ జూ ని ఎప్పుడైనా చూశారా..?

ఆసియాలోనే అత్యంత ఎత్త‌యిన నైనిటాల్ జూ ని ఎప్పుడైనా చూశారా..?

ఆసియాలోనే అత్యంత ఎత్త‌యిన నైనిటాల్ జూ ని ఎప్పుడైనా చూశారా..?

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ దేశం మొత్తంలో ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డ‌ ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇక్క‌డ ఆసియాలోనే అతిపెద్ద జూగా పేరుగాంచిన జూ నైనిటాల్‌లోనే ఉంది. ఇది ఆసియాలో అత్యంత ప్రత్యేకమైనదిగా కూడా ప్ర‌సిద్ధి చెందింది. ప్రతి రాష్ట్రం నుండి జంతువులు, పక్షులను నైనిటాల్ జూ కి తీసుకువస్తారు. కానీ ఇక్కడ ఉన్న జూకు కూడా ఆసియా మొత్తంలో ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. అదేంటో తెలుసా.. ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న శాల ఆసియాలోనే అత్యంత ఎత్త‌యిన జంతుప్రదర్శనశాలగా ఇది ప్ర‌సిద్ధి చెందింది. అంతేకాదు, రండి ఈ జూని ఒక‌సారి సంద‌ర్శిద్దాం...

11 ఎకరాల‌లో విస్త‌రించిన జంతుప్ర‌దర్శ‌న‌శాల‌..

ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల 1984లో స్థాపించ‌బ‌డింది. దీనిని 11 ఎకరాలలో విస్తరించారు. సాధార‌ణ పౌరులు, ప‌ర్యాట‌కులు ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ను సంద‌ర్శించేందుకు వీలుగా దీనిని 1995లో ప్రారంభించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో 200 ర‌కాల జంతువులు, ప‌క్షులు ఉన్నాయి. ఇందులో భార‌త‌దేశం నుండి వ‌చ్చిన‌వే కాకుండా విదేశాల నుంచి వ‌చ్చినవి కూడా ఉన్నాయి. ఇది భారతదేశంలోని మూడు ఎత్తైన జంతుప్రదర్శనశాలలలో ఒకటి. మిగిలిన రెండు సిక్కిం, డార్జిలింగ్‌లో ఉన్నాయి.

Nainitalzoo

233 వన్యప్రాణులకు నిల‌యం..

ఈ జూలో రాయల్ బెంగాల్ టైగర్, సాంబార్, టిబెటన్ తోడేళ్ళు, చిరుతపులి పిల్లి, మొరిగే జింకలు, జపనీస్ మకాక్, హిమాలయన్ ఎలుగుబంటి నైనిటాల్ జంతుప్రదర్శనశాల‌లో ఉన్నాయి. ఇంకా గోల్డెన్ ఫెసెంట్, రోజ్-రింగ్డ్ పారాకీట్, కలిజ్ నెమలి, లేడీ అమ్హెర్స్ట్ ఫీసెంట్, స్టెప్పీ ఈగిల్, హిల్ పార్ట్రిడ్జ్, వైట్ పీఫౌల్, బ్లూసమ్ హెడ్డ్ పారాకీట్ మరియు రెడ్ జంగిల్ ఫౌల్ జూలోని అనేక పక్షులలో ఉన్నాయి. మెజారిటీ జంతువులను వ్యక్తులు లేదా జంతు సంక్షేమ సంస్థలు దత్తత తీసుకుంటాయి. 16 క్షీరదాలు, తొమ్మిది పక్షి జాతులతో సహా 233 వన్యప్రాణులకు ఈ జూ నిలయంగా ఉంది. రాయల్ బెంగాల్ టైగర్, హిమాలయన్ బ్లాక్ బేర్, మఖోర్, రెడ్ పాండా, జపనీస్ మకాక్ జూలోని ప్రధాన ఆకర్షణలు.

వివిధ రకాల జంతువులు, ప‌క్షులు

ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న శాల‌లో చిరుతపులి, బెంగాల్ టైగర్, టిబెటన్ తోడేలు, హిమాలయన్ బ్లాక్ ఎలుగుబంటి, మోనాల్, సిల్వర్ నెమలి, మార్కోర్ వంటి జాతుల జంతువులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, భారతదేశ నాల్గవ హోం మంత్రి అయిన పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ పేరును ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌కి పెట్ట‌డం జ‌రిగింది. దాదాపు ప‌ద‌కొండు ఎకరాల విస్తీర్ణంలో విస్త‌రించి ఉన్న ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న శాల ప‌ర్యాట‌కులు వీక్షించేందుకు ఎంతో అందంగా ఉంటుంది. కుమావోని స్టైల్ డిజైన్ చేసిన పెయింటింగ్‌లను కూడా ఇక్క‌డ చూడొచ్చు. ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల అంతా చుట్టేసి ఇక్క‌డే ప్ర‌కృతి అందాల‌లో దాగి వున్న పార్క్‌లో కాసేపు సేద‌తీరండి.

ప్ర‌వేశ‌రుసుము, స‌మయాలు..

ఈ జంతు ప్ర‌ద‌ర్శన శాల నైనిటాల్‌లోని తల్లిటాల్‌లో ఉంది. ఇక్క‌డి మాల్ రోడ్‌లో షటిల్‌ను కూడా ఆడొచ్చు. అంతే కాకుండా ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న శాల‌ను కాలినడక ద్వారా కూడా చేరుకోవ‌చ్చు. కార్‌లో కానీ, ద్విచక్రవాహనం ద్వారా కానీ ఇక్కడికి చేరుకోవచ్చు. జంతుప్రదర్శనశాల ఒక్క గురువారం మినహా ప్రతిరోజు ఉదయం ప‌దిగంట‌ల‌ నుండి సాయంత్రం 4:30 వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో ప్ర‌వేశించేందుకు వంద‌రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ప‌న్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఉచితంగానే ఈ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ను సందర్శించవచ్చు.

More News

    Read more about: nainital uttarakhand
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+