ప్రస్తుతం మనిషి జీవన విధానంలో సోషల్ మీడియా అనేది ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వేదకలన్నేమానవ జీవితంతో ప్రభావం చూపిస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గరిన్నుంచి ఫోన్ తీసి సోషల్‌మీడియా చూడకపోతే పనవ్వదు అన్న చందంగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో సెల్పీలు దిగడం వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పటివారికి ఓ దినచర్యగా మారిపోయింది. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అనేది ఓ పరిపాటిగా మారింది. అయితే, చాలా ప్రాంతాల్లో సెల్పీ పాయింట్‌లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే, వీధికొక సెల్ఫీ స్పాట్స్ మనకు కనిపిస్తాయి. రండి ఇక్కడ ప్రసిద్ధిచెందిన సెల్ఫీస్పాట్స్ గురించి తెలుసుకుందాం పదండి.
భాగ్యనగరంలో సెల్ఫీ స్పాట్స్‌కు ప్రసిద్ధిచెందింది ఓల్డ్ సిటీ. ఈ ప్రదేశం కేవలం ఫోటోలు తీసేందుకే కాకుండా తన చారిత్రక కట్టడానికి కూడా పేరుగాచింది. ఇక్కడ కేవలం సెల్ఫీలు దిగడమే కాకుండా దీని వారసత్వ వైభవాన్ని క్లిక్ మనిపించేయొచ్చు. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. అవేంటో చూద్దాం..
చార్మినార్..
హైదరాబాద్ అనగానే ప్రస్తుతం చాలామందికి ఐటీ, మోడ్రన్ లైఫ్ వంటి విషయాలే గుర్తుకు వస్తాయి. కానీ, ఒకప్పుడు హైదరబాద్ అనగానే చాలామందికి చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్‌కు మొదటిసారిగా వెళ్లినవాళ్లు చార్మినార్‌ను తప్పకుండా వీక్షించాలనుకుంటున్నారు. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్పీ తీసుకోవడం అస్సలు వెయిట్ చేయరంటే నమ్మండి. నగరంలో బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా చార్మినార్ ముందు వరుసలో ఉంటుందనే చెప్పుకోవాలి. ఉదయం వాకింగ్ నుంచి మొదలు అర్ధరాత్రివరకూ ఇక్కడ పర్యాటకులు కిటకిటలాడుతుంటారు. ఇక, ఇక్కడి ఇరానీ ఛాయ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓల్డ్‌సిటీ ఇప్పటికీ తన పూర్వవైభవాన్ని సగర్వంగా నిలుపుకోవడానికి గల కారణం చార్మినార్. ఈ సెల్పీ స్పాట్ దగ్గర పర్యాటకులు అర్థరాత్రి వరకూ సందడి చేస్తుంటారు.

షాపింగ్‌కు ఫేమస్..
ఓల్డ్ సిటీ అంటే ఒక్క చార్మినార్ కాదండోయ్.. ఇక్కడ మరెన్నో ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఓల్డ్ సిటి షాపింగ్‌కు కూడా అనువైన ప్రదేశం. ఇక్కడ దొరికే మట్టి గాజులు ఎంతో పేరుగాంచాయి. నేటి యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, దుస్తులు, గాజులు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ లభిస్తాయి. ఇక, ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఇక్కడ షాపింగ్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడ ఎన్నో సెల్ఫీలు క్లిక్కుమనిపిస్తాయి.
పాతబస్తీలోని వీధులు..
పాతబస్తీలోని చాలా వీధులు సెల్ఫీ స్పాట్స్‌కు పేరుగాంచాయి. అందులో సాలార్‌జంగ్ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు వంటి ప్రదేశాలతోపాటు పురానాపూల్, చార్మినార్ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్‌లు కూడా సెల్ఫీ స్పాట్‌లుగా రూపుదిద్దుకున్నాయి.

నిమ్హ్రా కేఫ్
వీటితోపాటు మరోప్రదేశం చార్మినార్ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్ కూడా హైదరాబాద్ నగరంలో బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా పేరుగాంచింది. ఇక్కడ టీ తాగుతూ ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకోవచ్చు. అది కూడా అర్ధరాత్రి ఛాయ్‌కి రావడం ఇక్కడి మరో ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరూ నిమ్హ్ర కేఫ్ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ హైదరాబాద్‌లోని కేఫ్‌లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్ మర్చిపోయి ఎయిర్‌పోర్ట్ వెళ్లిన సంగతులున్నాయి.



Click it and Unblock the Notifications













