Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌ర స‌మీపంలోని ఈ ప్రాంతాలను చూశారా?

భాగ్య‌న‌గ‌ర స‌మీపంలోని ఈ ప్రాంతాలను చూశారా?

భాగ్య‌న‌గ‌ర స‌మీపంలోని ఈ ప్రాంతాలను చూశారా?

భారతదేశంలో చూడదగిన ప్రదేశాలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఎందుకంటే, ఇక్క‌డ‌ దేవాలయాల నుండి కోటల వరకు, ప్రతి రాష్ర్టం దాని స‌హ‌జ అందాల‌తో, స్మార‌క క‌ట్ట‌డాల‌కు ప్ర‌సిద్ధి చెందింది. సహజ అద్భుతాల విషయానికి వస్తే, ప్రతి ఒక్క రాష్ర్టం దాని అద్భుతమైన ప్రదర్శనల‌ను ప్రదర్శిస్తుంది. అటువంటి రాష్టాల‌లో తెలంగాణ రాష్ర్టం ఒక‌టి. హైదరాబాద్ అన‌గానే అంద‌రికీ రణ‌గోణ‌ధ్వ‌నుల‌తో, హాడావిడిగా క‌నిపించే మ‌హాన‌గ‌ర‌మే అంద‌రికీ గుర్తుకువ‌స్తోంది. కానీ, హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు స‌హ‌జ‌దృశ్యాలు నిల‌యంగా ఉన్నాయి. చాలామంది ప‌ర్యాట‌కులకు తెలియ‌ని ఎన్నో ప్ర‌దేశాలు ఇక్క‌డ ఉన్నాయి. రండి వాటి గురించి తెలుసుకుందాం.

దేవరకొండ కోట

దేవరకొండ కోట రాష్ట్రంలోని నిర్మాణ సౌందర్యానికి ప్ర‌సిద్ధి చెందింది. నల్గొండలోని దేవరకొండ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ అద్భుతమైన కోట ఉంది. ఈ కోటలోని ప్రతి మూలలో అక్క‌డి పాలకుల ధైర్యసాహసాలు, పోరాటాలు, విజయ గాథలు క‌నిపిస్తాయి. ఇవ‌న్నీసంద‌ర్శ‌కుల‌ను చారిత్ర‌క పుట‌ల్లోకి తీసుకెళ‌తాయి. ఈ కోట ఏడు కొండలు, భారీ బండరాళ్లు, దట్టమైన అడవితో చుట్టుముట్టబడిన అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. దేవరకొండ హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ రహదారిలో సుమారు 117 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో అయితే సుమారు మూడు గంటల స‌మ‌యం పడుతుంది. నల్గొండ పట్టణం నుండి దేవరకొండ సుమారు ఒక గంటలో చేరుకోవచ్చు.

1

యెల్లేశ్వరగట్టు ద్వీపం

యెల్లేశ్వరగట్టు ద్వీపం ఒక మిస్టరీ ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపం నాగార్జునసాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ మధ్యలో ఉంది. ఈ ద్వీపం హైదరాబాద్ నుండి సుమారు 169 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. దీన్ని చేరుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతుంది. ద్వీప శిఖరాన్నిచేరుకునేందుకు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డ రాత్రిపూట బస చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బ‌స ఒక మ‌ధర‌మైన అనుభూతిని ప‌ర్యాట‌కుల‌కు అందిస్తుంది. స్థానిక మత్స్యకారులు 1,500 రూపాయ‌ల‌తో ప‌డ‌వ‌లో తీసుకెళ‌తారు. రాత్రిపూట బ‌స కాకుండా, కేవ‌లం బోట్ రైడ్‌ను ఇష్ట‌ప‌డే వారు రెండువంద‌ల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది.

పాకాల చెరువు

ఈ చెరువు క్రీ.శ. 1213 నాటిది. ఇది అభయారణ్యంలో ఉన్న మానవ నిర్మిత జలాశయం. ఇక్క‌డికి చేరుకునే క్రమంలో గ్రామీణ ప్రాంతాల సుందరమైన వీక్షణలు, మలుపులు తిరిగే రోడ్లు, అంతులేని పచ్చదనం, రోడ్‌సైడ్ స్టాల్స్, స్నేహపూర్వక వాతావ‌ర‌ణం ప‌ర్యాట‌కుల‌కు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతాయి. ఈ చెరువులో బోట్ ప్ర‌యాణం చేసేందుకు 300 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెరువును చేరుకోవాలంటే వరంగల్ నుండి 30 నిమిషాలు ప‌డుతుంది. అదే హైదరాబాద్ నుండి అయితే సుమారు 4 గంటల ప్రయాణం.

2

మల్లారం ఫారెస్ట్

నగర జీవితం నుండి విసుగు చెంది కాస్త ఉప‌శ‌మ‌నం పొందాల‌నుకుంటున్నారా? అయితే హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ మ‌ల్లారం ఫారెస్టును సంద‌ర్శించండి. ఇక్క‌డ ప‌ర్యాట‌కులు పొందే ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. మల్లారం ఫారెస్ట్ నిజామాబాద్‌లో ఉంది. రోడ్డు మార్గంలో ఈ ప్రాంతాన్నిసులభంగా చేరుకోవచ్చు. ఇది హైదరాబాద్ నుండి సుమారు 200 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఈ అడవి అందాలు ప‌ర్యాట‌కుల‌ను మంత్రముగ్ధులను చేస్తాయి.

ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్‌లు, దేవాల‌యాలు, వ్యూపాయింట్ టవర్‌తో సహా అనేక రకాల ఆకర్షణలు క‌లిగించే ప్ర‌దేశాలు ఉన్నాయి. ఈ సహజ స్వర్గధామం వలస పక్షులు, జంతువులకు నిలయంగా ఉంది. ప్రకృతి ఒడిలో ప‌ర్యాట‌కుల‌ను ముంచెత్తేందుకు 1.45 బిలియన్ సంవత్సరాల పురాతన రాతి నిర్మాణం కూడా ఉంది. ఇక్క‌డి సహజమైన పరిసరాలు, స్వచ్ఛమైన గాలి, విన‌సొంపైన ప‌క్షుల కిల‌కిల‌రావాలు ప‌ర్యాట‌కులకు క‌నువిందుచేస్తాయి.

జన్నారం ఫారెస్ట్

ఈ అభయారణ్యపు అందాల‌ను, ఇక్క‌డి వివిధ ర‌కాల ప‌క్షుల‌ను వీక్షించేందుకు జీప్ సఫారీలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు ఇక్క‌డి సహజ అందాల‌ను, అరుదైన జంతువులను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు బ‌స వ‌స‌తి కూడా ఉంటుంది. హైదరాబాద్ నుండి సుమారు 290 కిలోమీట‌ర్ల దూరంలో జ‌న్నారం ఫారెస్టు ఉంది. నిర్మల్ నుండి 80 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది జ‌న్నారం. అక్క‌డి నుండి 50 కిలోమీట‌ర్ల‌ దూరంలో కడెం ప్రాజెక్టు ఉంది. క‌డెం నుండి జన్నారానికి చేరుకోవాలంటే సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాల్సిందే.

నగునూరు కోట

రాష్ట్రంలోని సుప్రసిద్ధ కాకతీయ రాజవంశపు ప్రముఖ కోటలలో ఒకటిగా నగునూరు కోట ముఖ్యమైన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది 12వ, 13వ శతాబ్దాల నాటి అనేక ముఖ్యమైన దేవాలయాలకు నిలయం. కోట లోపల కళ్యాణి, చాళుక్యులు మరియు కాకతీయుల కాలం నాటి శిథిలమైన దేవాలయాల సమూహాన్ని చూడొచ్చు. ఈ కోట జగిత్యాల పట్టణానికి సమీపంలో, సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్క‌డికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

ఖిలా ఘన్‌పూర్

ఖిలా ఘన్‌పూర్ తెలంగాణ‌లోని చారిత్ర‌కత క‌లిగిన ప్ర‌దేశాల‌లో ఒక‌టి. మహబూబ్‌నగర్ సమీపంలో ఉన్న ఈ కోట గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. అందుకే ఈ ప్రాంతం అంత‌గా ప్ర‌సిద్ధిలోకి రాలేదు. ప్రకృతి అందాల మ‌ధ్య ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే. పైకి వెళ్లేందుకు దాదాపు రెండు గంటలు పట్టొచ్చు. కోటపై నుండి ఘనపూర్ సరస్సు దృశ్యాలు ప‌ర్యాట‌కుల అల‌స‌టను దూరం చేస్తాయి.

3

గౌతమేశ్వరాలయం

మంథనిలోని గౌతమేశ్వర ఆలయం దాని గొప్ప చారిత్రక, పురావస్తు, మతపరంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆల‌మం వేద అభ్యాసానికి పురాతన ఉదాహరణగా పరిగణించబడుతుంది. అందంగా చెక్కబడిన ఆలయం ప్రస్తుతం శిథిలమైన గోడ‌లు, పాకే తీగలతో శిథిలావ‌స్థ‌లో ఉన్న‌ది.

More News

    Read more about: hyderbad telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+