భాగ్యనగరంలోని అదిరిపోయే ఈ రుచులను రుచి చూశారా ..!
హైదరాబాద్ అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది బిర్యానీ. ఇక, రంజాన్ మాసమైతే హాలీమ్ గుర్తుకొస్తుంది. కానీ, హైదరబాద్‌లో కేవలం ఇవే కాదండోయ్. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ పుట్టిన ఎన్నో వంటకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. భాగ్యనగర వాసులనే కాకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకుల, ఆహార ప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. రుచికరమైన దక్షిణాది వంటకాలే కాకుండా నోరూరించే ఉత్తరాది రుచులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరెందుకాలస్యం హైదరాబాద్‌లోని ఈ స్ట్రీట్ ఫుడ్స్ ను ఓ పట్టు పట్టేయండి.

గోకుల్ చాట్
హైదరాబాద్‌లోని చాట్ అనగానే చాలామందికి గుర్తొచ్చే ప్రాంతం గోకుల్ చాట్. ఈ చాట్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. కోటీలో ఉన్న గోకుల్ చాట్ టేస్టీ చాట్, పావ్‌బాజీలకు పెట్టింది పేరు. ఇక్కడ చాట్ తిన్న తర్వాత కుల్ఫీ తినడం అస్సలు మరిచిపోవద్దు. ఎందుకంటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది.
మహారాజా చాట్, మాదాపూర్
గోకుల్ చాట్ తర్వాత అంతటి టేస్ట్ అందించే మరో ప్రాంతం మహారాజా చాట్. ఇక్కడి పానీపూరి, అలూ రగడ, భేల్‌పూరీ కూడా మంచి ఫేమస్. ఇది మసాలా పావ్‌బాజీకి ఫేమస్. కావూరి హిల్స్ సమీపంలో ఈ చాట్ సెంటర్ ఉంది. రుచికరమైన పానీ పూరీ, ఆలూ రకడ,ఖేల్ పూరీ తినాలంటే మాదాపూర్ కావూరి హిల్స్ కు దగ్గరలోని మహారాజా చాట్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ దొరకే మసాలా పావ్ బాజీ రుచే వేరు. మిల్క్ షేక్ లు, జ్యైస్ లు, పానీపూరీ రగడ, పావ్ బాజీల రుచే వేరు. సంప్రదాయంగా తయారయ్యే పానీ పూరీ ఇక్కడ దొరుకుతుంది. చక్కటి వాతావరణంలో సాయంత్రం వేళ స్నేహితులతో కలిసి సరదాగా గడపొచ్చు.

కీమా సమోసా
చాలామంది ఆనియన్ సమోసా, ఆలూ సమోసా తిని ఉంటారు. కానీ, ఈ కీమా సమోసా ఏంటీ వైరేటీగా ఉంది అనుకుంటున్నారా? అవునండి ఈ స్ట్రీట్ ఫుడ్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే దొరుకుతుంది. ఈ కీమా సమోసా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్పైసీ మసాలాలు, చాలా చిన్న ముక్కలు చేసిన మేక పొట్టేలు మాంసంతో దీనిని తయారుచేస్తారు. హైదరాబాద్ వీధుల్లో ఇది చాలా రుచికరమైన స్నాక్. సాయంత్రం అవ్వగానే చాలామంది ఈ దుకాణాల దగ్గర బారులు తీరి ఉంటారు.
సర్దార్‌జీస్ చాట్, గచ్చిబౌలీ
నార్త్ ఇండియా ఫుడ్ తినాలనుకునేవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. ఎందుకంటే, ఇక్కడ అన్నీ నార్త్ ఇండియా వంటకాలే లభిస్తాయి. దహీభల్లా, సమోసా, పాపిడి చాట్, ముంగ్ దాల్ కచోడీ, ఆలూ టిక్కీ, చోలే చట్నీ, కడాయ్ పనీర్, బోలే బటూరే వంటి వంటకాలు ఇక్కడ ఫేమస్. ఇది గచ్చిబౌలీలోని ఇందిరానగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఉంది.

ఖుబానీ కా మీఠా
హైదరాబాద్ అంటే నాన్‌వేజ్ కాదండి.. ఇక్కడ నోరూరించే స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా ప్రత్యేకమైనది ఖుబానీ కా మీఠా. హైదరాబాద్‌లో ఇది చాలా స్పెషల్ స్వీట్ అని చెప్పాలి. ఇందులో డ్రై ఆప్రికాట్లను ఉపయోగిస్తారు. దీనితో పాటు, బాదం కూడా ఇందులో ఉపయోగిస్తారు. దీన్నీ ఐస్ క్రీమ్‌తో కలిపి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఖుబానీ అంటే ఉర్దూలో నేరేడు పండు అని అర్థం. హైదరాబాదీ వంటకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం ఇది. వివాహ విందులు, సామాజిక సమావేశాలు, ఈద్ వంటి పండుగ సందర్భాలలో ఈ వంటకం ప్రత్యేకంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications













