Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీలోని జహాజ్ మహల్ సంద‌ర్శ‌న‌కు వెళ్లారా..?

ఢిల్లీలోని జహాజ్ మహల్ సంద‌ర్శ‌న‌కు వెళ్లారా..?

దేశ రాజ‌ధాని ఢిల్లీలో సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ న‌గ‌రంలో ఎన్నో పురాత‌న క‌ట్ట‌డాల‌తో పాటు ఇక్క‌డి వైరేటీ రుచుల‌ను కూడా టేస్ట్ చేయాల్సిందే.. ఇంకా ఇక్క‌డ ప్రేమను నింపే ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఢిల్లీ లేదా కన్నాట్ ప్లేస్‌లో ఉండే గర్వించదగిన ఎర్రకోట అయినా, తెల్లని భవనాలకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలో అడుగుపెట్టగానే చరిత్ర పుటల్లో నమోదైన భవ్య భవనాలు, వాస్తుశిల్పం, ఆధ్యాత్మికత గురించి నిశితంగా తెలుసుకునే అవకాశం ప‌ర్యాట‌కులకు చేకూరుతుంది. ఈ ఢిల్లీలో చాలామందికి తెలియని చోటు ఒక‌టి ఉంది. అదే జ‌హాజ్ మ‌హాల్‌. మధ్యప్రదేశ్‌లోని మాండులో ఉన్న జహాజ్ మహల్ గురించి ప్రతి ఒక్కరూ తప్పక వినే ఉంటారు. కానీ, ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న జహాజ్ మహల్ గురించి చాలా మందికి తెలియదు.

jahajmahal

జహాజ్ మహల్ పేరు ఎలా వచ్చింది?

జహాజ్ మహల్ 1452-1526 లోడి రాజవంశం కాలంలో నిర్మించబడిందని చ‌రిత్ర చెబుతోంది. ఈ ప్యాలెస్ హౌజ్-ఎ-షమ్సీ సమీపంలో నిర్మించబడింది. అంటే మెహ్రౌలీలోని ఒక సరస్సు. ఈ కారణంగా షమ్సీ సరస్సుకు జహాజ్ మహల్ అనే పేరును పెట్టిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి, సూర్యుని మొదటి కిరణం ఈ ప్యాలెస్‌పై పడినప్పుడు, దాని ఓడ లాంటి నీడ ఇక్క‌డి సరస్సులో ఉద్భవించింది. ఆ కారణంగా దీనికి జహాజ్ మహల్ అనే పేరు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఈ ప్రాంతాన్ని జ‌హ‌జ్ మ‌హాల్ అని పిలుస్తారు.

విదేశీ అతిథులకు బస ఇక్క‌డే..

ఈ ప్యాలెస్ ఆఫ్ఘనిస్తాన్-అరేబియా, ఇరాన్, ఇరాక్, మొరాకో మరియు టర్కీ నుండి వ‌చ్చే ప్రముఖులు మ‌రియు యాత్రికుల కోసం నిర్మించబడింది. ఎందుకంటే లోడి రాజవంశం కాలంలో చాలా మంది ముస్లిం యాత్రికులు ఢిల్లీకి వచ్చి వెళ్లేవారట‌, అందుకనీ, వారి కోసం ఈ ప్రాంతాన్ని కేటాయించ‌డం జ‌రిగింది.

jahajmahal , delhi

ప్యాలెస్ ఆర్కిటెక్చర్

ఈ ప్యాలెస్‌లో ఇసుకరాయి స్తంభాలు మరియు పైకప్పుపై రంగురంగుల పలకలు, గొడుగులు ఎప్ప‌టినుంచో ఉన్నాయి. అయితే ఢిల్లీలోని జహాజ్ మహల్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఆ తరువాత కూడా, ఇక్కడ పాత వాస్తుశిల్పాల‌ను, ఈ మ‌హాల్ ప‌నిత‌నాన్ని ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో ఇక్కడ పూల జాతరను కూడా నిర్వ‌హిస్తారు. జహాజ్ మహల్ ఒక అద్భుత నిర్మాణం. దీనిని రెండు సరస్సుల మధ్య నిర్మించ‌డం జ‌రిగింది. దీని నిర్మాణం 'షిప్' ఆకారాన్ని కలిగి ఉండ‌డం విశేషం. అందుకే ఈ మహ‌ల్‌ను షిప్ మహల్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్క‌డ ఇంకా కాలువలు, వాటర్ ఫౌంటెన్ లు, ఆర్చీలు మొదలైనవి తప్పక చూడాల్సిన ప్రదేశాలు.

జహాజ్ మహల్‌ను ఎలా చేరుకోవాలి..?

జహాజ్ మహల్ చూడాల‌నుకునేవారు రాజీవ్ చౌక్ నుండి ఛతర్‌పూర్ మెట్రో స్టేషన్ వరకు ముందుగా మెట్రోలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత ఇక్కడ నుండి ఆటో లేదా కారులో పర్యటనకు వెళ్ళవచ్చు. అంతే కాకుండా, మునిర్కా, ఢిల్లీ నుండి బస్సు నంబర్ 534 ద్వారా కూడా జహాజ్ మహల్‌కు వెళ్లవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+