Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని రెండవ ఎత్తైన విగ్రహం.. మ‌న హైద‌రాబాద్‌లోనే..

దేశంలోని రెండవ ఎత్తైన విగ్రహం.. మ‌న హైద‌రాబాద్‌లోనే..

దేశంలోని రెండవ ఎత్తైన విగ్రహం.. మ‌న హైద‌రాబాద్‌లోనే..

దేశంలోని అతి ఎత్త‌యిన రెండవ విగ్ర‌హం ఎక్క‌డ ఉందో తెలుసా.. ఎక్క‌డో లేదండి మ‌న హైద‌రాబాద్‌లోనే... హైదరాబాద్ ముంచింత‌ల‌లో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజాచార్య‌లు వారి విగ్రహం గురించి అంద‌రికి తెలిసిందే క‌దా. ఇదే భార‌త‌దేశంలోని రెండ‌వ అతిపెద్ద విగ్ర‌హంగా కూడా పేరుగాంచింది. ఈ సమతా మూర్తి విగ్రహం హైద‌రాబాద్ నగరానికే ఓ స‌రికొత్త కళను తీసుకొచ్చింది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట ఒక ఫౌంటెన్ షో జ‌రుగుతుంది. దీనిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తారు. రండి ఈ స‌మతామూర్తి విశేష‌త‌ల‌ను తెలుసుకుందాం.

120 కేజీల బంగారంతో..

ఈ విగ్ర‌హం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప‌రిధిలోని ముచ్చింత‌ల్‌లో ఉంది. చిన్నజీయ‌ర్ స్వామీజీ ఆశ్ర‌మం ప‌క్క‌నే ఈ విగ్ర‌హం ఉంటుంది. ఈ విగ్రహం దాదాపుగా 216 అడుగుల ఎత్తు ఉంటుంది. భారతదేశంలోని రెండవ అతిపెద్ద విగ్రహంగా ఇది ప్ర‌సిద్ధి గాంచింది. కేవ‌లం ఈ విగ్ర‌హమే కాకుండా ఈ విగ్ర‌హం కింది భాగంలో రామానుజాచార్యుల వారి మ‌రో విగ్ర‌హం ఉంటుంది. ఇది భద్ర‌వేది అనే వేదిక భాగంలో ఉంటుంది. ఈ విగ్ర‌హాన్ని కేవ‌లం బంగారంతోనే త‌యారుచేయ‌డం విశేషం. ఈ విగ్ర‌హ త‌యారీకి సుమారు 120 కేజీల బంగారం అవ‌స‌ర‌మ‌య్యింది. 120 కేజీల బంగారాన్ని ఉప‌యోగించ‌డం వెనుక ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేంటంటే, శ్రీ రామానుజాచార్యుల వారు 120 సంవ‌త్స‌రాలు జీవించారు. ఆయ‌నకు గుర్తుగానే ఈ విగ్ర‌హాన్ని 120 కేజీల బంగారంతో నిర్మించారు.

muchinthal , Samatha Murthy statue is special, when was Ramanujacharyas statue

108 గుళ్లు...

2013లోనే ఈ విగ్ర‌హాన్ని నిర్మించాల‌ని ప్ర‌ణాళిక‌లు వేశారు. శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం ఏర్పాటు చేయాలని స్వామి శ్రీ చిన్న జీయర్ గారు నిశ్చయించుకున్నారు. 2014 మే నెల‌లో ఈ స‌మ‌తా మూర్తి విగ్రహా నిర్మాణానికి ప‌నులను ప్రారంభించారు. ఈ విగ్రహం చుట్టుపక్కల సుమారుగా 108 గుళ్ళు నిర్మించబడి ఉన్నాయి. వీటిని విశిష్ట అద్వైత అని పిలుస్తారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో మొదటగా 14 రకాల నమూనాలను తయారుచేశారు. అనంత‌రం నమూనాల సంకలనాన్ని త్రిడి స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేయ‌డం జ‌రిగింది.

1800 ట‌న్నుల పంచ‌లోహాలు...

ఈ స‌మతా విగ్ర‌హం 216 అడుగుల పంచ‌లోహ విగ్ర‌హం..అయితే, ఇందులో 1800 ట‌న్నుల పంచ‌లోహాల‌ను వినియోగించిన‌ట్లు తెలుస్తోంది. శ్రీ రామానుజాచార్యుల వారు కూర్చుని ధ్యాన‌ము చేస్తున్న‌ట్లుగా ఈ విగ్ర‌హం ఉంటుంది. ఈ విగ్రహానికి సంబంధించిన దండ‌ము, శ‌ఠ‌గోప‌ము వంటివ‌న్నీ చాలా క్లియ‌ర్‌గా ఉంటాయి. ఆయ‌న మెడ‌లోని హారాలు ప్రతిదీ ఎంతో డీటేయల్‌గా త‌యారుచేశారు. ఈ విగ్ర‌హానికి సంబంధించిన డిజైనింగ్ అంతా మ‌న భార‌తీయులే చేశారు. అయితే విగ్ర‌హ త‌యారీ మాత్రం చైనా కంపెనీ చేసింది.

ramanujacharya, దేశంలోని అతి ఎత్త‌యిన రెండ‌వ విగ్ర‌హం ఎక్క‌డుంది, స‌మ‌తా మూర్తి విగ్ర‌హ ప్ర‌త్యేక‌త‌లేంటీ

ప్ర‌ధాని చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ‌..

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు 216 అడుగులు ఉంటుంది. అయితే అందులో రామానుజ విగ్రహం ఎత్తు సుమారు 108 అడుగుల ఉంటుంది. ఇక కింద ఉన్న‌భద్ర వేది ఎత్తు 54 అడుగులు ఉంటుంది. పద్మ పీఠం ఎత్తు 27 అడుగులు త్రిదండం ఎత్తు 35 అడుగులు. ఇక్క‌డ భ్ర‌ద వీదిలో కొన్ని ప‌ద్మాల‌ను ఏర్పాటు చేశారు. వీటి సంఖ్‌య సుమారు 54 వ‌ర‌కూ ఉంటుంది. ఇంకా ఇక్కడ 36 ఏనుగులను కూడా ఏర్పాటు చేశారు. 36 శంకు చక్రాలు ఉన్నాయి. ఇక్క‌డ ఉన్న108 గుళ్ళలో భారతదేశంలో విష్ణువుమూర్తి అవ‌తారాలే ఉంటాయి. విష్ణువుకు సంబంధించిన అవతారాలలో ఉన్న దేశంలో ఉన్న వివిధ గుడిలను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ గుడిలన్నీ కూడా రాతితోనే నిర్మించ‌డం విశేషం. ఈ భారీ సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022లో ఆవిష్కరించారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+