Search
  • Follow NativePlanet
Share
» »క్రిస్మస్ సెలవుల్లో హైదరాబాద్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

క్రిస్మస్ సెలవుల్లో హైదరాబాద్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

డిసెంబర్ నెల‌ వచ్చేసింది. ఇక ఈ నెల‌లో క్రిస్మ‌స్‌, న్యూయ‌ర్ సెల‌వులు ఉంటాయి. ఈ సెల‌వుల్లో కుటుంబంతో క‌లిసి స‌రదాగా గ‌డ‌పాల‌నుకునేవారు ఎక్క‌డికో వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. హైద‌రాబాద్ స‌మీపంలో వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఎన్నో ప్ర‌దేశాలు దాగి ఉన్నాయి. ఈ సంతోషకరమైన సెలవుల‌ను వృథా చేసుకోకుండా ఫ్యామిలితో క‌లిసి ఈ ప్ర‌దేశాల‌ను విహ‌రించొచ్చు. గ‌డిచిన కాలానికి వీడ్కోలు చెబుతూ, కొత్త సంవ‌త్సరంలోకి అడుగుపెట్టే ముందు చిన్నచిన్న పార్టీల‌ను చేసుకోవ‌డంతోపాటు, కొన్ని ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటారు చాలామంది. అలాంటివారికోసం హైద‌రాబాద్‌లో సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

హైద‌ర‌బాద్ సిటీతో పాటు నగరానికి దగ్గర్లో ఒక్క రోజులో సందర్శించదగ్గ ప్రముఖ ప్రదేశాలు ఇక్క‌డ చాలా ఉన్నాయి. ఇవి నిరంతరం పర్యాటకుల తాకిడితో సంద‌డి చేస్తుంటాయి. హైదరాబాద్ కు దగ్గర్లో ఉత్సాహభరితమైన, వినోదభరితమైన అనుభవాలను అందించే ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

christmas Hyderabad

లుంబినీ పార్క్‌..

హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్ ఒక ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క స్థ‌లంగా పేరుగాంచింది. హైదరాబాద్‌లో ఒక్క రోజు ఆనందంగా గడపడానికి ఇది ఒక గొప్ప ప్ర‌దేశ‌మ‌నే చెప్పుకోవాలి. ఈ ప్ర‌దేశం అందమైన ఉద్యానవనం, ఆకర్షించే జలపాతం, మ్యూజికల్ ఫౌంటెన్‌కు నిల‌యంగా ఉంది. కుటుంబంతో పాటు స‌ర‌దాగా స్నేహితుల‌తో వీక్షించేందుకు ఇది ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. పిల్ల‌లు ఈ ప్ర‌దేశాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్క‌డ బొమ్మ కార్లు, వీడియో గేమ్స్ తో పిల్లలు సమయమే తెలియకుండా ఆటలాడుతుంటారు.

పెద్దల కోసం రైఫిల్ షూటింగ్ వంటి అనేక వినోదకరమైన కార్యక్రమాలు కూడా ఇక్క‌డ అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం పూట నిర్వహించే లేజర్ షో ఇక్క‌డ మ‌రింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్క‌డ బోటు ప్ర‌యాణం కూడా చేయ‌వ‌చ్చు. ఈ బోటు ప్ర‌యాణంలో విహరిస్తు హుస్సేన్‌సాగ‌ర్‌లోని బుద్ధుని విగ్ర‌హాన్ని తిల‌కించొచ్చు. ఈ పార్క్ ఉదయం 11 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ తెరిచే ఉంటుంది. ఇది హైద‌ర‌బాద్ న‌గ‌రానికి సుమారు 5.8 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

దుర్గం చెరువు..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ రహస్య సరస్సు దుర్గం చెరువు. ఇది 2500 మిలియన్ సంవత్సరాల పురాతన గ్రానైట్ రాతి నిర్మాణాలతో చేయ‌బ‌డింది. సాహ‌స ప్రియుల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. ఇక్క‌డ బోట్ రైడ్స్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి వాటిని ఆస్వాదించొచ్చు. వినోదం కోసం అంఫి థియేటర్, ఆర్ట్ గ్యాలరీ, శిల్పాల పార్క్ వంటివి కూడా ఉన్నాయి. కృత్రిమ జలపాతం, తేలియాడే ఫౌంటెన్ లు ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణలు. ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు రుచిక‌ర‌మైన వంట‌కాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్ర‌దేశాన్ని ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6.30 వ‌ర‌కూ ఎప్పుడైనా సంద‌ర్శించొచ్చు. హైద‌రాబాద్ సిటి నుంచి ఈ ప్ర‌దేశం 16.7 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

షామీర్ పేట స‌ర‌స్సు...

హైదరాబాద్ నగరంలోని ప్ర‌సిద్ధిచెందిన మ‌రో ప్ర‌దేశం షామిర్ పేట్ సరస్సు. ఇది ఒక కృత్రిమ స‌ర‌స్సు. ఈ సరస్సును నిజాం రాజ్యంలో నిర్మించారు. ఇక్కడికి అనేక వ‌ల‌స పక్షులు దాహం తీర్చుకునేందుకు వస్తుంటాయి. బ‌ర్డ్స్ ల‌వ‌ర్స్ సంద‌ర్శించేందుకు ఈ ప్ర‌దేశం ఎంతో అనువైన‌ది. పక్షి ప్రేమికులతోపాటు సాధారణ సందర్శకులకు కూడా ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడి రాతి భూభాగం రాక్ క్లైంబింగ్‌కు అనువుగా ఉంటుంది. ఇక్క‌డి సూర్యాస్త‌మయ దృశ్యాలు కూడా ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటాయి. ఈ ప్ర‌దేశాన్ని అన్నివేళ‌ల్లోనూ సంద‌ర్శించొచ్చు. ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+