తెలుగు ప్రజలకు ఐఆర్‌సీటీసీ ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. బీహార్ రాష్ట్రంలోని ప్రఖ్యాత సందర్శనీయ ప్రదేశాలను చూసేందుకు ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా బోధ్ గయా, నలందా, రాజ్ గిరి లాంటి ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లను వీక్షించవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ సరికొత్త టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దామా?!
హైదరాబాద్ కేంద్రంగా BLISSFUL BIHAR WITH BAIDYANATH DHAM' పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఈ ప్యాకేజీ ద్వారా బీహార్‌లోని పలు సందర్శనీయ ప్రాంతాలను తక్కవ ధరలో చూసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 27వ తేదీన అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించారు. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.
25850గా, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 24750గా ధరలు నిర్ణయించారు. అంతేకాదు, 5 -11 ఏళ్ల మధ్య వయసు ఉండే పిల్లలకు వేర్వురు ధరలను వెల్లడించారు. ఇతర ట్రావెల్ ఏజెన్సీల ధరలతో పోల్చితే ఐఆర్‌సీటీసీ ప్రకటించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని పలువురు ఔత్సాహికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ టూర్‌కు సంబంధించిన రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..

ఇదే రూట్ మ్యాప్..
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొదటి రోజు ప్రయాణం ప్రారంభమవుతుంది. అలా ముందుగా గయాకు చేరుకుంటారు. ఆ తర్వాత బోధ్ గయా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి ఆలయ నిర్మాణ శైలితోపాటు ఆలయ చరిత్రను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పురాతన నిర్మాణంతోపాటు అక్కడికి దగ్గరలో ఉన్న బుద్ధుడి ఆలయాలను చేసేందుకు బయలుదేరుతారు. అలా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పురాతన ఆలయాలను సందర్శించిన తర్వాత ఆ రోజు రాత్రికి బోధ్ గయాలోనే విడిది చేయాల్సి ఉంటుంది.
మరుసటి రోజు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత నలందాకు ప్రయాణం మొదలవుతుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలను సందర్శించిన తర్వాత అక్కడి నుంచి రాజ్ గిర్‌కు బయటుదేరుతారు. అలా రాత్రికి గయాలోనే విడిది చేసేలా ముందుగానే ఏర్పాట్లు ఉంటాయి.

ఒక్క క్లిక్‌తో టికెట్ బుకింగ్..
ఇక మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత గయాలోని విష్ణు పాదం ఆలయ సందర్శన ఉంటుంది. ఇది చాలా పురాతన ఆలయం. ఇక్కడి ఆధ్యాత్మిక నేపథ్య విశిష్టతను తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మంగల్ గౌరీ ఆలయానికి తీసుకు వెళ్తారు. మంగల్ గౌరీ ఆలయ సందర్శన పూర్తయిన తర్వాత రాత్రికి గయాలో విడిది ఉంటుంది. మరుసటి రోజు ఉదయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకుని విశాంత్రి తీసుకుంటారు.
అదే రోజు రాత్రికి డియోగర్‌లో ఉండి. మరుసటి రోజు ఉదయం డియోగర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు సాయంత్రానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. బుకింగ్‌తోపాటు మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA50 లింక్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మరెందుకు ఆలస్యం.. తక్కువ ధరతో ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీతో కుటుంబసమేతంగా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి!



Click it and Unblock the Notifications














