Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌పంచంలోని టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో హైద‌రాబాద్‌...

ప్ర‌పంచంలోని టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో హైద‌రాబాద్‌...

హైద‌రాబాద్‌లో ప్ర‌సిద్ధి చెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌దేశాల‌తో పాటు వైరెటీ వైరెటీ వంట‌కాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో నోరూరిస్తుంటాయి. చాలామంది టూరిస్టులు, ప్ర‌ముఖులు, రాజ‌కీయ‌నాయ‌కులు, సెల‌బ్రిటీలు సైతం హైద‌రాబాదీ బిర్యాని రుచి చూసేందుకు ఇక్క‌డికి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఇక్క‌డ అనేక చారిత్ర‌క క‌ట్టడాలు, పురాత‌న ఆల‌యాలు ఇంకా ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఇతర విషయాలతోపాటు, దాని అద్భుతమైన హైదరాబాదీ వంటకాలకు కూడా ఈ ప్రాంతం ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది.

ఇక్క‌డి ప్రాంతీయ ఆహారంలో బియ్యం, గోధుమలు మాంసం వంటకాలు అధికంగా ఉంటాయి. ఇందులో వివిధ సుగంధ ద్రవ్యాల ఉపయోగం ఉంటుంది. మొఘలాయ్ మరియు అరబ్ వంటకాల బలమైన ప్రభావాలతో ఇక్క‌డి రుచులు ఉంటాయి. హైదరాబాద్‌లోని రుచుల‌ను ప్రయత్నించే వారంద‌రూ ఒక చిర‌స్మ‌ర‌ణీయ‌మైన అనుభూతిని పొందుతారు. స్థానిక డిలైట్స్‌తో పాటు, ఇక్కడ భోజన వేదికలకు ప్ర‌పంచంలోని ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటారు. ఇక్క‌డ అనేక రెస్టారెంట్లు వాటి రుచుల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధిగాంచాయి.

falaknumapalace , Hyderabad

ప్ర‌పంచంలోని టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో...

హైద‌ర‌బాద్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పుడు ఏకంగా ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచ అద్భుత రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్‌కు చోటు ల‌భించింది. ప్ర‌పంచంలోని టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాను ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ లా తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ చోటు దక్కించుకుంది. కంపెనీ కేటాయించిన స్కోర్‌ల ద్వారా నిర్ణయించబడిన జాబితాలో భార‌తీయ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి.

కానీ, ఈ రెస్టారెంట్ మాత్రం జాబితాలో ఏకంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో నిలిచిన హైదరాబాద్ రెస్టారెంట్ ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఇక్క‌డి రెస్టారెంట్ల‌న్నీ వాటి ప్ర‌త్యేక‌త‌లు ప్ర‌సిద్ధిపొందాయి. కానీ, ఈ జాబితాలో నిలిచిన రెస్టారెంట్ మాత్రం ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని అదా. ఈ రెస్టారెంట్ టాప్ 1000 రెస్టారెంట్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

falaknumapalace , Telangana

న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ మొద‌టి వ‌రుస‌లో...

హైద‌రాబాద్‌లోని ఫలక్‌నుమాలోని ఇంజిన్ బౌలిలో ఉన్న ఈ రెస్టారెంట్ హైదరాబాదీ వంటకాల్లో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. లా విడుద‌ల చేసిన జాబితా ప్రకారం, భారతదేశంలోని ఉత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ ముందు వ‌రుస‌లో ఉండ‌గా, బెంగళూరులోని కరవల్లి తర్వాతి స్థానంలో నిలిచింది. కంపెనీ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోని టాప్ 10 రెస్టారెంట్లు ఏవేవో ఒక‌సారి చూసేద్దాం...

ఇండియన్ యాక్సెంట్, న్యూఢిల్లీ

కరవల్లి, బెంగళూరు

హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లోని అదా

యౌచా ముంబై, ముంబై

దమ్ పుఖ్త్, న్యూఢిల్లీ

జమావర్ - లీలా ప్యాలెస్, బెంగళూరు

లే సర్క్యూ సిగ్నేచర్ - ది లీలా ప్యాలెస్, బెంగళూరు

మేగు, న్యూఢిల్లీ

బుఖారా, న్యూఢిల్లీ

జియా, ముంబై

ఇక‌, మూడవ స్థానంలో ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని అదా ఈ జాబితాలోని ఏకైక హైదరాబాద్ రెస్టారెంట్ గా నిలిచి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న లే బెర్నార్డిన్, లా లిస్టే జాబితా ప్రకారం, ప్రపంచంలోని అత్యుత్తమ రెస్టారెంట్ ఈ టైటిల్‌ను కలిగి ఉండ‌డం విశేషంగా ఉంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+