Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్ టు అరుణాచ‌లం.. నాలుగు రోజుల ప్ర‌యాణం..మీరు రెడీనా..!

హైద‌రాబాద్ టు అరుణాచ‌లం.. నాలుగు రోజుల ప్ర‌యాణం..మీరు రెడీనా..!

దక్షిణ భారతంలోని తమిళనాడులోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో ఒక‌టిగా పరిగణిస్తుంటారు. ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో ఒక‌టి అరుణాచలం. అరుణాచ‌లంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం.

అందుకే, ప్ర‌తిసారి ఇక్క‌డికి భ‌క్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య రెట్టింప‌వుతుంద‌నే చెప్పుకోవాలి. ఇక, ఈ వేస‌విలో మీరు కూడా అరుణాచ‌లం సంద‌ర్శించాల‌నుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ఓ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ టూర్‌లో భాగంగా నాలుగురోజుల ప‌ర్య‌ట‌న ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్ర‌యాణం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ఈనెల 21వ తేదీన అందుబాటులోకి రానుంది. HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism అనే పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు.

arunachalam1

టూర్ ప్యాకేజీ ధ‌ర‌ల వివ‌రాలు..

ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మే 20వ తేదీ, జూన్ 19వ తేదీన ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు రోజుల ప్ర‌యాణం ఉంటుంది. అతిత‌క్కువ ధ‌ర‌తోనే అరుణాచ‌లం సంద‌ర్శించే అవ‌కాశం ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. పెద్ద‌ల‌కయితే రూ. 7500 చెల్లించాలి. అదే పిల్ల‌ల‌క‌యితే ఆరువేల రూపాయ‌లు టక్కెట్ ధ‌ర నిర్ణ‌యించారు.

vellore1

పౌర్ణ‌మి రోజున గిరి ప్ర‌ద‌క్షిణ‌..

ఈ అరుణాచ‌లం టూర్ ప్యాకేజీలో భాగంగా మొద‌టి రోజు సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం కాణిపాకం చేరుకుంటారు. తొమ్మిది గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. అనంత‌రం తిరువన్నామలై కి బయల్దేరుతాం. త‌మిళంలో అరుణాచ‌లంని తిరువ‌న్నామ‌లై అంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు.

అక్క‌డ దర్శనం పూర్తి చేసుకుంటాం. అరుణాచల గిరి పద్రక్షిణం చేయాల‌నుకునేవారు చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ గిరి ప్ర‌ద‌క్షిణ చేయ‌డం వ‌ల్ల మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరువేరుతాయని చాలా మంది భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ గిరి ప్ర‌ద‌క్షిణ అనేది మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది విశ్వ‌సిస్తుంటారు.

kanipakam1 temple

ప‌దిలోపు గిరిప్ర‌ద‌క్షిణ చేయ‌డం మంచిది..

గిరి ప్రదక్షిణలు చేసే వారు చెప్పులు ధ‌రించ‌కూడ‌దు. ఇలా ప్రదక్షిణకు వెళ్లే వారు ఏవైనా పండ్లను, నిమ్మకాయలను తీసుకెళ్లాలని అక్క‌డి వారు చెబుతుంటారు. ఈ గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీట్ల వరకు చేయాల్సి ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుందనే చెప్పాలి. అందుకే చాలామంది ఉదయం ప‌దిలోపు గిరి పద్రక్షిణాన్ని ముగిస్తుంటారు. వీలుప‌డ‌ని వారు ఎప్ప‌డైనా చేసుకోవ‌చ్చు. అరుణాచ‌లం ద‌ర్శ‌నం అనంత‌రం రాత్రి అక్క‌డే బ‌స చేయాల్సి ఉంటుంది.

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత వేలూరుకు బ‌య‌లుదేరుతారు. అక్క‌డ శ్రీ‌పుర గోల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం చేసుకుంటాం. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ తిరుగు ప్ర‌యాణం ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు అంటే నాలుగో రోజు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది. ఇక‌, ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి స‌మాచారం కోసం ఈ 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. లేదా ఈ మెయిల్‌ను [email protected] సంప్రదించవచ్చు.

More News

    Read more about: arunachalam tamil nadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+