విహారయాత్ర వినోదాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలనుకునేవారికి స్వర్గధామం గోవా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, గోవాలో పర్యాటకులకు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. గోవా కేవలం అద్భుతమైన బీచ్‌లకే ప్రసిద్ధిచెందడం కాదు. ఎన్నో జలపాతాలు,చారిత్రక కట్టడాలకు కూడాపేరుగాచింది. భారత్‌లో కేవలం రెండే రెండు జిల్లాలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం, అతిచిన్న రాష్ట్రం గోవానే. ఈ తీర ప్రాంత స్వర్గంలో కాసేపు సరదాగా విహరించాలనుకునేవారికి తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఎంచక్కా.. మీరు మీ స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి ఈ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. రండి ఈ గోవా టూర్ ప్యాకేజీ విశేషాలేంటో చూసేద్దాం...
గోవా నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. గోవా ప్రాంతానికి కేవలం మనదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. వీదేశీయులు మనదేశంలో ఎక్కువగా విజిట్ చేసే ప్రదేశాలలో గోవా ముందువరుసలో ఉంటుంది. తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ గోవా ట్రిప్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు రోజులు ఈ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ ఉంటుంది. ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని బషీర్‌బాగ్ బస్ట్ స్టేషన్ నుంచి ఏసీ బస్సు ద్వారా ఈ గోవా ట్రిప్ మొదలువుతుంది.

నాలుగురోజుల పర్యటన షెడ్యూల్ ఇదే..
మొత్తం నాలుగురోజల పాటు సాగే ఈ ప్రయాణంలో సోమవారం ప్రయాణం ఉంటుంది. ఆ నైటంతా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో రాత్రి భోజనానికి సమయం ఇస్తారు. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు గోవా చేరుకుంటారు. అక్కడ హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్) లో స్టేయింగ్ చేస్తారు. ఆ తర్వాత ఉదయం 10.00 గంటల నుండి నార్త్ గోవా సైట్ సీయింగ్ సందర్శన ఉంటుంది. అనంతరం అక్కడినుంచి మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్, వాగేటర్ బీచ్‌లను చూపిస్తారు. ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా సౌత్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది.
అక్కడ డోనా పౌలా బీచ్, మిరామార్ (గ్యాస్పర్ డయాస్ బీచ్), పాత గోవా చర్చిలు, మంగూషి దేవాలయాలు, కొల్వా బీచ్, మార్డోల్ బీచ్ వంటి మొదలైన ప్రదేశాలను చూపిస్తారు. ఇక, అదే రోజు సాయంత్రం ఒక గంట బోట్ క్రూయిజ్ కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. అయితే, అక్కడ ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి పర్యాటకులదే అయ్యి ఉంటుంది. బోట్ క్రూయిజ్‌కు మాత్రం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదే రోజురాత్రి హోటల్ బెవ్వన్ రిసార్ట్ లో స్టే చేయాల్సి ఉంటుంది.

టూర్ ప్యాకేజీ ధరలు..
ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఒకసారి పరిశీలిస్తే... పెద్దలకు రూ. 11999 చెల్లించాల్సి ఉంటుంది. అదే పిల్లలకయితే, రూ.9599 వసూలు చేస్తారు. తెలంగాణ టూరిజం వారు అందిస్తోన్నఈ టూర్ ప్యాకేజీలో భాగంగా గోవాలోని లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్ వంటి పలు ప్రముఖ బీచ్‌లను సందర్శించవచ్చు. టిక్కెట్లు బుకింగ్ కోసం లేదా ఇతర పూర్తిసమాచారం కోసం పర్యాటకులకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మరెందుకాలస్యం తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈగొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



Click it and Unblock the Notifications













