Search
  • Follow NativePlanet
Share
» »ఐఆర్‌సిటిసి టూరిజం అందిస్తోన్న హైదరాబాద్ టు కేరళ టూర్ ప్యాకేజీ..

ఐఆర్‌సిటిసి టూరిజం అందిస్తోన్న హైదరాబాద్ టు కేరళ టూర్ ప్యాకేజీ..

ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలను చూడాలంటే కేర‌ళకు వెళ్లాల్సిందే. అందమైన ప్రకృతి సోయగాలకు నెలవు కేరళ. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉంటాయి. వీటిని అతి తక్కువ ఖర్చులోనే వీక్షించే సదుపాయం ఇప్ప‌డు ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. నిత్యం ప‌ర్యాట‌కుల కోసం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకొచ్చే ఐఆర్‌సిటిసి ఇప్ప‌డు కేరళ టూర్ ప్యాకేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ వివ‌రాలు తెలుసుకుందాం పదండి.

ఈ టూర్ ప్యాకేజీ 'KERALA HILLS & WATERS ' పేరుతో ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ హైద‌రాబాద్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కేరళలోని ప్రకృతి అందాలను చూసేందుకు IRCTC టూరిజం అందిస్తోన్న టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ జ‌ర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఐఆర్‌సిటిసి ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ ఈనెల 4వ తేదీన ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉండ‌నుంది. ఈ తేదీ మిస్ అయ్యార‌ని కంగారుప‌డాల్సిన అవ‌సరం లేదు. మ‌రో తేదీలో ఇదే ప్యాకేజీని బుక్ చేసుకోవ‌చ్చు. ప్ర‌తి మంగ‌ళ‌వారం ఈ ప్యాకేజీ ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా కేర‌ళ‌లోని మున్నార్ , అలెప్పీతో పాటు పలు టూరిజం ప్ర‌దేశాలు కూడా ట్రావెల్ చేయొచ్చు. ఈ టూర్ ఐదురోజులు ఉంటుంది.

hyderabadtokeralatourpackage

ఐదురోజులు ట్రిప్ షెడ్యూల్‌..

ఈ ప్యాకేజీలో భాగంగా మొద‌టిరోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 17230 అనే నెంబ‌ర్‌గ‌ల శ‌బ‌రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నుంచి ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. మ‌ధ్యాహ్నం 12:20 గంటలకు ఈ ట్రైన్ మొదలవుతుంది. నైట్ అంతా జ‌ర్నీ ఉంటుంది. రెండో రోజు మధ్యాహ్నం స‌మ‌యంలో ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ ప్ర‌యాణం ఉంటుంది. అక్క‌డ హోట‌ల్‌లో చెక్ ఇన్ అయిన త‌ర్వాత సాయంత్రం మున్నార్ టౌన్ సంద‌ర్శ‌న ఉంటుంది. రాత్రి మున్నార్ లోనే బ‌స చేస్తారు. ఇక‌, మూడో రోజు ఉద‌యం ఎర్నాకులం నేష‌న‌ల్ పార్క్ సంద‌ర్శ‌న ఉంటుంది. అనంత‌రం అక్క‌డి నుంచి టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్‌ను కూడా వీక్షిస్తారు.

రాత్రంతా మున్నార్‌లో ఉంటారు. నాలుగోరోజు హోట‌ల్‌లో చెక్ అవుట్ అయ్యి అలెప్పీకి బ‌య‌లుదేరుతారు. హోటల్ లోకి చెకిన్ అయ్యాక బ్యాక్ వాట‌ర్ సంద‌ర్శ‌న ఉంటుంది. నైట్ అలెప్పీలోనే స్టే చేస్తారు. ఐదోరోజు హోట‌ల్‌లో చెక్ అవుట్ అయ్యి ఎర్నాకులం చేరుకుంటారు. అదే రోజు ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం ప్రారంభ‌మ‌వుతుంది. ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

hyderabadtokeralatourpackage

టిక్కెట్ ధ‌ర‌ల వివ‌రాలు..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా టిక్కెట్ ధ‌ర‌లు చూసుకుంటే సింగిల్ షేరింగ్ కు రూ. 32830గా ఉంటుది. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధర ఉంది. ఈ రేట్లు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.12880 చెల్లించాలి. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల చిన్నారుల‌కు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం ప‌ర్యాట‌కులు ఈ వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలున‌కునేవారు కూడా ఈ వెబ్‌సైట్‌లోనే బుకింగ్ సౌక‌ర్యం కూడా ఉంది. మ‌రెందుకాల‌స్యం మీరు కూడా కేర‌ళ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+