ఈ వీకెండ్‌లో హైదరాబాద్‌లోని సమీప ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు తప్పకుండా నాగార్జున సాగర్‌ను సందర్శించాల్సిందే. నాగార్జున సాగర్ వీక్షించాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్‌కు ఒక రోజు టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను కూడా తెలంగాణ టూరిజం ప్రకటించింది. ఆ వివరాలేంటో తెలుసుకునేందుకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందే.
హైదరాబాద్-నాగార్జునసాగర్ - హైదరాబాద్ పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో నాగార్జున సాగర్ డ్యామ్ బోటింగ్ మ్యూజియం , నాగార్జునకొండ, బుద్దవనం ప్రాజెక్ట్ వంటి పర్యాటక ప్రాంతాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ప్రాజెక్టులను ప్రత్యక్షంగా చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాబట్టి నాగార్జున సాగర్ అందాలను తప్పక వీక్షించాల్సిందే. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న నాగార్జున్ సాగర్ కూడా పర్యాటకులకు ఇలాంటి అనుభూతినే చేరువ చేస్తుంది. అందిస్తుంది. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు...

ఇది కేవలం ఒక్కరోజు టూర్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకునేలా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనీ, ఆదివారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో సందర్శించే ప్రదేశాలు, ధరల విషయాల గురించి తెలుసుకుందాం పదండి.
వన్ డే ట్రిప్ షెడ్యూల్ ఇదే...
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా బస్సు ప్రయాణం ఉంటుంది. ఉదయం 7.30 గంటలకు పర్యాటక భవన్ నుంచి బస్సు బయలు దేరుతుంది. ఆ తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ వద్ద బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 11.30 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు. 11.40 గంటల నుంచి 12.30 గంటల వరకు బుద్ధవనం ప్రాజెక్ట్ టూర్ ఉంటుంది. అనంతరం 1 నుంచి 2వరకు మధ్యాహ్న భోజనానికి సమయం ఇస్తారు. ఆ తర్వాత రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు బోటింగ్, మ్యూజియం, నాగార్జున కొండ సందర్శన ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు డ్యామ్ సందర్శన ఉంటుంది. ఇక సాయంత్రం ఐదు గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. తొమ్మిది గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలివే..
ఈ టూర్ ప్యాకేజీ ధరలు వివరాలున్నాయి. పెద్దలకు రూ. 800 చెల్లించాలి. అదే చిన్నారులకయితే రూ. 640 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా నాన్ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ టూర్‌ప్యాకేజీలోకి బోటింగ్, ఎంట్రీ, భోజనం వంటివి కవర్ అవ్వవు. వాటికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీ బుకింగ్, ఇతర పూర్తి వివరాల కోసం ప్రయాణికులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













