Search
  • Follow NativePlanet
Share
» »అతి త‌క్కువ ధ‌ర‌కే ఐఆర్‌సిటిసి అందిస్తోన్న హైద‌రాబాద్ టు వ‌య‌నాడ్ ట్రిప్..

అతి త‌క్కువ ధ‌ర‌కే ఐఆర్‌సిటిసి అందిస్తోన్న హైద‌రాబాద్ టు వ‌య‌నాడ్ ట్రిప్..

ప్రకృతి అందాలకు నెల‌వైన కేర‌ళ‌ను చూడాలనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో ప్రసిద్ధిచెందిన‌ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించేయొచ్చు. ఈ రాష్ట్రాన్ని 'గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌కు ఎంతో స‌హ‌జంగా ఉంటాయి. వీటితోపాటు ఇక్క‌డ అనేక హిల్ స్టేషన్లు, బ్యాక్ వాటర్స్, బీచ్ లు, వన్యప్రాణి అభయారణ్యాలు, అందమైన కుగ్రామాలు ఇలా ఒక్క‌టేమిటి ఎన్న అద్భుతాల‌ను చూడొచ్చు. ఇక్కడి పర్యాటక ఆకర్షణలు టూరిస్టులను మైమ‌రింప‌జేస్తాయి. అందుకే చాలామంది విహార‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునేవారు కేర‌ళ‌ను ఎంపిక చేసుకుంటారు.

కేరళలో క‌నుచూపుమేర క‌నిపించే పచ్చదనంతో ఆకట్టుకునే ప్రదేశాల్లో వ‌య‌నాడ్ ఒకటి. ఇక్కడ అధిక శాతం వరి పొలాల‌నే చూడొచ్చు. ఇక్క‌డి ప్రకృతి అందాలతో పాటు ఉత్కంఠభరితమైన సాహసాలు కూడా పర్యాటకులను ఆక‌ర్షిస్తాయి. ఇక్క‌డి గిరిజనుల జీవన విధానాన్ని ప్రత్యక్ష్యంగా చూడాల‌నుకునేవారి ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ఓ మంచి అవ‌కాశం క‌ల్పిస్తోంది..

ఓ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కేరళ వయనాడ్​లోని పలు ప్రదేశాలను విజిట్​ చేయొచ్చు. వండర్స్​ ఆఫ్​ వయనాడ్ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్ర‌యాణం హైదరాబాద్​ నుంచి మొద‌ల‌వుతుంది. ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా మొత్తంగా ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటుంది. ప్రతి మంగళవారం రోజుల్లో ఈ ప్రయాణం అందుబాటులో ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల కోసం..

wayand

టూర్ షెడ్యూల్‌..

ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు ఉదయం ఆరుగంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో మంగుళూరు సెంట్ర‌ల్ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 06.17 నిమిషాలకు కన్నూర్​కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ హోటల్​ చెకిన్​ అయ్యాక టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత సెయింట్ ఏంజెలో ఫోర్ట్​, అరక్కల్ మ్యూజియాల‌ను వీక్షిస్తారు.అక్కడి నుంచి వయనాడ్​కు ప్రయాణం ప్రారంభ‌మ‌వుతుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను సంద‌ర్శించేయొచ్చు.

ఆ త‌ర్వాత కాల్పెట్టలో స్టే చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం హోటల్ బ్రేక్​ఫాస్ట్ అనంత‌రం కుర్వాదీప్​లోని పలు ప్రాంతాలను వీక్షించొచ్చు. అక్క‌డి ప్ర‌సిద్ధిచెందిన తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్​ను విజిట్​ చేస్తారు. నాలుగో రోజు టిఫిన్ చేసి అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును చూసేందుకు బ‌య‌లుదేరుతారు.

రాత్రి కాల్పెట్టలోనే బ‌స చేస్తారు. ఇక‌, ఐదో రోజు కూడా అల్పాహారం ముగించుఉని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడినుంచి కొజికోడ్​కు ప్ర‌యాణం ఉంటుంది. ఆ త‌ర్వాత‌ కప్పడ్ బీచ్ లో కాసేపు సేద‌తీరుతారు. అనంత‌రం ఎస్ఎం స్ట్రీట్​లో షాపింగ్ కూడా చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తారు. ఆ త‌ర్వాత రాత్రికి కాలికట్ రైల్వ్​స్టేషన్​ చేరుకుంటారు. అనంత‌రం ఆ రాత్రి 11.35కి హైదరాబాద్​కు రిటర్న్​ ప్ర‌యాణముంటుంది. రాత్రంతా జర్నీచేయాల్సి ఉంటుంది.

wayand beauty

ఇక‌, ఆరో రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో ఈ టూర్ ముగుస్తోంది.

ప్యాకేజీ ధ‌ర‌లివే..

ఈ టూర్ ఫ్యాకేజీలో భాగంగా ధ‌ర‌లు వివ‌రాలు ఓసారి ప‌రిశీలిస్తే.. కంఫర్ట్​(3AC) సింగిల్​ షేరింగ్​ రూ.36,590 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్​ షేరింగ్​ అయితే రూ.20,700 చెల్లించాలి. ట్రిపుల్​ షేరింగ్​ రూ.16,280గా నిర్ణ‌యించారు. ఇక‌, ఐదు నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.10,510గా ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.9,060 చెల్లించాలి. స్టాండర్డ్ (నాన్ ఏసీ స్లీప‌ర్‌) సింగిల్​ షేరింగ్​ రూ.33,790 చెల్లించాలి. ట్విన్​ షేరింగ్​ అయితే రూ.17,900 ఉంటుంది.

అదే ట్రిపుల్​ షేరింగ్​ అయితే రూ.13,490గా ఉంటుంది. అదే ఐదు నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.7,720 చెల్లించాల్సి ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,260 చెల్లించాలి. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీ అక్టోబ‌ర్ 1వ తేదినుంచి డిసెంబ‌ర్ 17 వ‌ర‌కు ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇత‌ర స‌మాచారం కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+