Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌కృతిలో సేద‌తీరాలంటే ఉడిపిలోని ఈ ప్ర‌దేశాల‌ను చూడాల్సిందే..

ప్ర‌కృతిలో సేద‌తీరాలంటే ఉడిపిలోని ఈ ప్ర‌దేశాల‌ను చూడాల్సిందే..

బీచ్ డెస్టినేషన్ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు గోవా, కానీ భారతదేశంలో చాలా ప్రదేశాలు అందమైన, పరిశుభ్రమైన బీచ్‌లకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందాయి. అలాంటి ప్రదేశం కర్ణాటకలోని ఉడిపి ఒక‌టి. ఈ ప్ర‌దేశాన్ని సందర్శించడానికి మార్చి ఉత్తమ సమయం. ఉడిపి కర్ణాటకలో చాలా అందమైన ప్రదేశంగా ప్ర‌సిద్ధిచెందింది. ఇక్కడ సెలవుల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో క‌లిసి ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్ర‌యాణం ఒక అద్భుతంగా మరియు చిరస్మరణీయంగా మారుతుంది.

బీచ్ డెస్టినేషన్ పేరుతో, ప్రజలు గోవాను మొదటి ఎంపికగా భావిస్తారు. ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన బీచ్‌లే కాకుండా, ఇక్క‌డ రెండు మూడు రోజుల సెలవులను గుర్తుండిపోయేలా చేయడానికి అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. ఉడిపి దేవాలయాలకు కూడా ఎంతో పేరుగాంచింది. ప్ర‌కృతిలో సేద‌తీరాల‌నుకునేవారు, అలాగే సాహ‌స ప్రియులు, మతపరమైన ప్రయాణాలను ఇష్టపడే వారికి ఇది సరైన ప్రదేశమ‌నే చెప్పుకోవాలి.

మాల్పే బీచ్

ఉడిపిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో మాల్పే బీచ్ ఒకటి. ఇది బంగారు ఇసుక, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన స్థానిక ఆహారాలు మరియు బీచ్ వాక్‌లు మల్పే యొక్క విశిష్టతలెన్నో క‌లిగి ఉంది. ఈ బీచ్ మంగళూరు నుండి 66 కిలోమీటర్లు మరియు ఉడిపి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మల్పే బీచ్ ఒక సహజ నౌకాశ్రయం. ఇక్కడ స్థిరపడిన మొగవీర మత్స్యకారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కర్ణాటకలోని ఈ బీచ్‌లో నాలుగు రాతి ద్వీపాలు ఉన్నాయి. ఉత్తరాన ఉన్న ద్వీపం దరియా-బహదూర్‌ఘర్, మధ్య ద్వీపం దరియా-గద్రా-కల్లు, అయితే దక్షిణ ద్వీపం కరి-ఇల్లాడ-కల్లు. నాల్గవ రాతి ద్వీపం సెయింట్ మేరీస్ ద్వీపం.

stmarysisland1

సెయింట్ మేరీస్ ద్వీపం

మాల్పే బీచ్‌లోని నాలుగు రాతి ద్వీపాలలో సెయింట్ మేరీస్ అత్యంత ప్రసిద్ధమైనదిగా చెప్పొచ్చు. ఈ దీవిని కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేక డిజైన్, రాతి నిర్మాణాల కారణంగా, ఇది పర్యాటకులలో చాలా ప్రసిద్ధి చెందింది.

kaupbeach1

కౌప్ బీచ్

మంగళూరు, ఉడిపి నగరాల మధ్య ఉన్న కౌప్ బీచ్ చాలా పురాతనమైన మరియు ఆఫ్‌బీట్ బీచ్‌గా పేరుగాంచింది. ఈ కారణంగా దాని అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక్కడి ప్రశాంత‌మైన వాతావ‌ర‌ణ‌లో కాసేపు విశ్రాంతి తీసుకోవ‌డం ఒక భిన్నమైన శాంతి అనుభూతిని క‌లిగిస్తుంది. ఇక్క‌డ ఒక లైట్ హోస్ కూడా ఉంది. దీనిని 1901లో నిర్మించారు. ఇది ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి 6.30 వరకు పర్యాటకుల సంద‌ర్శ‌నార్థం తెరిచి ఉంటుంది. లైట్ హౌస్ పై నుండి సముద్రపు దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. బీచ్ చుట్టూ అనేక హోటళ్ళు మరియు గెస్ట్‌హౌస్‌లు కూడా ఉన్నాయి.

ఎప్పుడు వెళ్లాలి?

శీతాకాలం ఉడిపిని సందర్శించడానికి ఉత్తమ సీజ‌న్ అని చెప్పుకోవాలి. అక్టోబర్ నుండి మార్చి మధ్య ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స‌మ‌యంలో ఇక్క‌డి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉడిపి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం మంగళూరు. మంగళూరు చేరుకున్న తర్వాత క్యాబ్ లేదా టాక్సీలో ఉడిపికి సులభంగా చేరుకోవచ్చు. ఉడిపి లో రైల్వేస్టేష‌న్ కూడా ఉంది. కాబట్టి రైలుమార్గం ద్వారా ఇక్క‌డికి వెళ్లాల‌నుకునేవారు ఉడిపి రైల్వేస్టేష‌న్‌కు ముందుగా చేరుకోవాలి.

స‌రాదాగా రోడ్ ట్రిప్ చేయాల‌నుకునేవారికి ఈ ప్ర‌దేశం ఎంతో అనువైన‌ది. కుటుంబం లేదా స్నేహితులతో క‌లిసి ఉడిపికి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవ‌చ్చు. కారు లేదా బైక్ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. బెంగుళూరు, మంగళూరు, గోవా నుండి డైరెక్ట్ బస్ సర్వీస్ అందుబాటులో ఉంటాయి. మ‌రెందుకాల‌స్యం ఉడిపి ప్ర‌యాణానికి సిద్ధంకండి...

More News

    Read more about: karnataka tourism udupi tour
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+