Search
  • Follow NativePlanet
Share
» »న్యూ ఇయ‌ర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పే తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలు

న్యూ ఇయ‌ర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పే తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలు

న్యూ ఇయ‌ర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పే తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలు

దక్షిణ భారతదేశంలో ప్రయాణ‌మంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది కేరళ. అయితే, న్యూ ఇయ‌ర్ లాంటి వేడుక‌ల స‌మ‌యంలో మాత్రం కేర‌ళ‌తోపాటు ఆ స్థానాన్ని పంచుకునేందుకు చాలా రాష్ట్రాలే పోటీప‌డ‌తాయి. లక్షలాది దేశీయ మరియు విదేశీ పర్యాటకులు న్యూ ఇయర్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఈ ప్ర‌దేశాల‌కు వ‌స్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలలో తమిళనాడు నగరానికి త‌ప్ప‌కుండా స్థానం క‌ల్పించాల్సిందే.

ఏటా జనవరి నెలలో ఇక్క‌డి ఆహ్లాదకరమైన వాతావరణం ప‌ల‌క‌రిస్తూ పర్యాటకులను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. మీరు కూడా న్యూ ఇయర్‌లో తమిళనాడులో ఉన్న‌ట్ల‌యితే, న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేసేందుకు కొన్ని ప్ర‌దేశాల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. అవేంటో చూద్దాం.

మెరీనా బీచ్

మెరీనా బీచ్

తమిళనాడులో సందర్శించడానికి మరియు పార్టీ చేసుకోవడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో మెరీనా బీచ్ ఒకటి. ప్రపంచంలోనే రెండవ పొడ‌వైన ప‌ట్ట‌న బీచ్‌గా పేరు సంపాందించింది. ఈ మెరీనా బీచ్‌లో డిసెంబర్ 31 సాయంత్రం అయ్యేస‌రికి లక్షలాదిగా జ‌న‌ప్ర‌వాహం చేరుకుంటుంది.

రాత్రి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేట్ చేసుకునేందుకు మెరీనా బీచ్ స‌రైన ఎంపిక‌. జనవరి 1వ తేదీ ఉదయం నుంచి మెరీనా బీచ్‌లో పర్యాటకుల సంచారం క్ర‌మంగా పెరుగుతూ సాయంత్రం తర్వాత ఇక్కడి వాతావరణం చాలా రంగులమయంగా మారిపోతుంది. బీచ్‌లో మ్యూజిక్ పార్టీలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడులో మొదటగా కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడకు చేరుకోండి.

కొడైకెనాల్

కొడైకెనాల్

తమిళనాడులోని కొడైకెనాల్ దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రదేశాలలో ఒకటి. సముద్ర మట్టానికి ఏడు వేల‌ అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొడైకెనాల్‌ను అడవుల బహుమతి అని కూడా పిలుస్తారు. చాలా మందికి ఈ హిల్ స్టేషన్ ప్రిన్సెస్ అనే పేరుతో కూడా తెలుసు.

ప్ర‌కృతి ఒడిలో సేదదీరుతూ కొత్త సంవత్స‌రానికి ఆహ్వానం ప‌ల‌కాల‌నుకునేవారు ఇక్క‌డి వెళ్లొచ్చు. కొత్త సంవత్సరం రోజున వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. కొడైకెనాల్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడమే కాకుండా, మీరు సాహస క్రీడ‌లను కూడా ఆస్వాదించవచ్చు.

ఏర్కాడ్

ఏర్కాడ్

తమిళనాడులోని ఈ ప్రదేశం గురించి తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ ఈ ప్రాంతం స్వర్గానికి నిలయంగా పరిగణించబడుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కోయంబత్తూరు నుండి దాదాపు 190 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న ఈ అందమైన హిల్ స్టేషన్ ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని పుర‌ష్క‌రించుకుని సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం.

న్యూ ఇయర్ సందర్భంగా తమిళనాడులోని దాదాపు ప్రతి మూల నుండి ప్ర‌జ‌లు ఎర్కాడ్‌ సందర్శించడానికి ఇక్కడికి చేరుకుంటారు. ఈ ప్రదేశం సూర్యాస్తమయం మరియు సూర్యోదయానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఫోటోగ్రఫీ చేసే పర్యాటకులకు ఆక‌ర్షించే వేల వ్యూ పాయింట్లు ఇక్క‌డ ఉన్నాయి.

ఏలగిరి

ఏలగిరి

తమిళనాడులోని ఏలగిరి దాదాపు ప్రతి ఒక్కరూ సందర్శించాలని భావించే ప‌ర్యాట‌క‌ ప్రదేశాలలో ఒకటి. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఏలగిరి అందమైన లోయలకు ప్రసిద్ధి చెందింది. జలగంపరై జలపాతం, గులాబీ తోటలు వంటి అద్భుతమైన వీక్షణలతో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఏలగిరి స్వర్గధామమ‌నే చెప్పాలి.

ఏలగిరి పట్టణంలో నైట్ పార్టీ లేదా మ్యూజిక్ డ్యాన్స్ కూడా నిర్వహిస్తారు. ఈ నాలుగు ప్రదేశాలతో పాటు, మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి తిరునల్వేలి, ఊటీ, కన్యాకుమారి, కాంచీపురం మరియు తమిళనాడులోని ప్రసిద్ధ మధురై ప్రాంతాలకు కూడా వెళ్ళవచ్చు.

More News

    Read more about: tamil nadu kerala
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+