Search
  • Follow NativePlanet
Share
» »స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణం.. మీకోసం!

స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణం.. మీకోసం!

ఆగ‌స్టు15 వ‌చ్చేస్తోంది. స్వాతంత్య్ర‌ దినోత్సవాలు జ‌రుపుకొనేందుకు భారతదేశం ముస్తాబ‌వుతోన్న స‌మయం ఇది. ఈ నేప‌థ్యంలో దేశ‌ రైల్వే వ్యవస్థ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 19వ శతాబ్దపు మధ్యకాలంలో నిరాడంబరమైన రైల్వే వ్య‌వ‌స్థ‌ ప్రారంభం మొద‌లు నేడు ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా అవతరించడం వరకు.. భారతీయ రైల్వే మ‌న దేశ అభివృద్ధితోపాటు ఏకీకరణలో కీలకమైన భాగంగా మారిపోయింది. ఈ ప్ర‌యాణం కేవ‌లం సాంకేతిక పురోగాభివృద్ధి.. మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కేకాదు, దేశంలోని విభిన్న.. విశాలమైన ప్రాంతాలను అనుసంధానం చేయడంలో రైల్వే పాత్ర వ‌ర్ణ‌ణ‌కు అంద‌నిది.

ఇది ఓ గొప్ప చ‌రిత్ర‌. భారతీయ రైల్వే ఆశయం మొదులుకుని ఆవిష్కరణ.. అభివృద్ధి క్ర‌మాన్ని చాటి చెప్పే గొప్ప వాస్త‌వ‌ కథ. 1847లో లార్డ్ డల్హౌసీ సిఫార్సుతో ప్రారంభించి, 1853లో బొంబాయి-థానే మధ్య మొదటి రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా భార‌త‌దేశం ఓ న‌వ‌యుగానికి నాంది ప‌లికింది. దశాబ్దాలుగా రూపాంత‌రం చెందుతూ వ‌స్తోన్న మ‌న‌ భారతీయ రైల్వే 1925లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టడం నుంచి 2002లో ఢిల్లీ మెట్రో ప్రారంభం.. 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను లాంచ్ చేయ‌డం వంటి ముఖ్యమైన మైలురాళ్లను దాటుకుంటూ త‌న ప్ర‌యాణాన్ని నిర్విరామంగా కొన‌సాగిస్తోంది. ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో ప్రతి ఒక్క కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా ఆధునికీకరణల‌ను ఆవిష్క‌రిస్తూ.. దేశాభివృద్ధితో భార‌తీయ రైల్వే ఓ భాగ‌మైపోయింది. ఈ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశం యొక్క న‌లుమూల‌ల‌ను అనుసంధానం చేస్తూ.. భార‌తీయుల మ‌న‌సుల‌ను గెలుచుకున్న ఇండియ‌న్ రైల్వే ప్ర‌గ‌తిని, సేవ‌ల‌ను గుర్తుచేసుకోవాల్సిన స‌మ‌యం ఇది.

స్వాతంత్య్రానికి పూర్వం రైల్వే

1847: లార్డ్ డల్హౌసీ భారతదేశంలో రైలు రవాణా వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించాలని ప్రతిపాదించారు.

1849: ఆగష్టు 17, 1849న, కలకత్తా నుండి రాజమహల్ వరకు రైలు మార్గాన్ని నిర్మించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి ఒప్పందంపై సంతకం చేసింది.

1853: ఈ రైల్వే మార్గంలో భాందుప్, బోరి బందర్, బైకుల్లా, సియోన్ మరియు థానే స్టేషన్‌లు ఉన్నాయి.

1854: బోరిబందర్ (బాంబే) మరియు థానే మధ్య 34 కిలోమీటర్లు నడిచే మొదటి రైలు మార్గం ఏప్రిల్ 1853లో పూర్తయింది. అనంత‌రం గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే తన రెండవ ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో భాగంగా హౌరా నుండి పాండువా వరకు రెండవ లైను జూలై 1854లో పూర్తయింది.

independenceday1 travel

1853: ప్రైవేట్ బ్రిటీష్ కంపెనీలు 1860 వరకు పబ్లిక్ గ్యారెంటీ సిస్టమ్ కింద ట్రంక్ లైన్లను నిర్మించాయి.

1862: బీహార్‌లోని ముంగేర్ సమీపంలోని జమాల్‌పూర్‌లో మొదటి రైల్వే వర్క్‌షాప్ ఏర్పాటు చేయబడింది.

1853: మొదటి ఆవిరితో నడిచే రైలు మద్రాసులో ప్రారంభమైంది. అలాగే, బాంబే- థానే మధ్య ప్రయాణీకుల కోసం రైలు న‌డిచింది.

1869-1879: ఈ కాలంలో భారతదేశం అంతటా రైల్వే లైన్లలో గణనీయమైన విస్తరణ జరిగింది.

1914-1918: మొదటి ప్రపంచ యుద్ధం రైల్వే వ్య‌వ‌స్థ‌కు స‌వాళుగా మారింది. భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యం క్షీణించింది.

1925: ఫిబ్రవరి 3, 1925న, మొదటి ఎలక్ట్రిక్ రైలు బొంబాయి-కుర్లా మధ్య నడిచింది. దీని ద్వారా రైల్వేలో విద్యుదీకరణకు మార్గం మ‌రింత‌ సుగమం చేసింది.

1929: 1929 నాటికి, రైల్వే నెట్‌వర్క్ 66,000 కి.మీలకు విస్తరించింది. దాదాపు 620 మిలియన్‌ల‌ ప్రయాణీకులను, 90 మిలియన్ టన్నుల వస్తువులను ఏటా వెళ్లింది. ఆదాయం 6 కోట్లను అధిగమించింది.

స్వాతంత్య్రం త‌ర్వాత భార‌తీయ‌ రైల్వే..

1947: ఆగష్టు 15, సెప్టెంబర్ 8, 1947 మధ్య సుమారు 7,00,000 మంది శరణార్థులు రైళ్ల‌లో ప్రయాణించారు.

1947: విభజన సమయంలో దాదాపు 7,000 మైళ్ల రైల్వే ట్రాక్‌ను భారతదేశానికి కేటాయించారు.

1951: భారతీయ రైల్వేలు ఆరు ప్రధాన జోనల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లుగా విభజించబడ్డాయి.

1960: ఈ దశాబ్దంలో విద్యుదీకరణ, లోకోమోటివ్‌లు, స్పీడ్ అప్‌గ్రేడ్‌లలో వేగవంతమైన పురోగతి కనిపించింది. అయితే ఈ వేగం దీర్ఘకాలికంగా కొనసాగలేదు. దీంతో రైల్వే పనితీరు క్షీణిస్తూ వ‌చ్చింది.

1965: ఇండో-చైనా యుద్ధం తరువాత, రైల్వేల విస్తరణ, ఆధునీకరణ ప్రణాళికలు మంద‌గించాయి.

1969: మార్చి 1, 1969న తొమ్మిది కోచ్‌లతో మొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి హౌరాకు ప్రారంభించబడింది.

1976: సమీహౌతా ఎక్స్‌ప్రెస్, భారతదేశం-పాకిస్తాన్ మధ్య మొదటి రైలు. ఈ స‌ర్వీస్‌ అమృత్‌సర్- లాహోర్ మధ్య ప్రారంభించ‌బ‌డింది.

1985: భారతీయ రైల్వే తన ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానాన్ని ప్రారంభించింది. క్రమంగా దీనిని ఢిల్లీ, మద్రాస్, బొంబాయి, కలకత్తాలో ప్రవేశపెట్టింది.

2002: ఢిల్లీ మెట్రో ప్రారంభించబడింది.

2002: IRCTC వ్యవస్థ ద్వారా ఆన్‌లైన్ రైలు రిజర్వేషన్‌లు, టికెటింగ్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా ముఖ్య‌మైన మైలురాయిని సాధించారు.

2006: బీహార్‌లోని సహర్సా నుండి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు నడిచే మొదటి గరీబ్ రథ్ రైలు ప్రారంభించబడింది.

2009: దురంతో ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 18, 2009న సీల్దా నుండి న్యూఢిల్లీ వరకు నడిచింది.

2016: గటిమాన్ ఎక్స్‌ప్రెస్, 160 కిమీ/గం వేగంతో భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలుగా ఏప్రిల్ 5, 2016న ఢిల్లీ నుండి ఆగ్రాకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది.

2018: మొత్తం 120,000 కి.మీ ట్రాక్‌ల నిర్వ‌హ‌ణ‌తో భారతీయ రైల్వే ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా ఆవిర్భ‌వించింది.

2019: ఫిబ్రవరి 18, 2019న, ఢిల్లీని వారణాసితో కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించబడింది.
2020: బుల్లెట్ రైలు నిమిత్తం ఏప్రిల్ 2020లో నిర్మాణం ప్రారంభమైంది. గుజరాత్‌లో 352 కి.మీ మేర‌ 2027 నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇది ఆగస్టు 2026లో సూరత్ నుండి బిలిమోరా వరకు 50 కి.మీల విస్తీర్ణంతో ప్రారంభమవుతుంది. ముంబైకి మిగిలిన విభాగం 2028 చివరి నాటికి క‌నెక్ట్ చేస్తుంద‌ని అంచనా వేయబడింది.

2024: జమ్మూ కాశ్మీర్‌లోని కొత్త చీనాబ్ రైలు వంతెనపై మొదటి పూర్తి ట్రయల్ రన్ జూన్ 2024లో జరిగింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+