Search
  • Follow NativePlanet
Share
» »నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...

నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...

ఛార్మినార్ గురించి.

చార్మినార్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో అని చాలా మంది చెబుతారు. ఆ కట్టడానికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే కొద్దిగా ఆలోచించి చార్మినార్ లో నాలుగు మినార్ లు ఉన్నాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టారని మరికొంతమంది చెబుతారు. అయితే కేవలం నాలుగు మినార్లు ఉన్నాయి కాబట్టి చార్మినార్ కు ఆ పేరు పెట్టలేదు. నాలుగుకు, ఛార్మినార్ కు విడదీయరాని బంధం ఉంది కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం....

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

చార్మినార్ నిర్మాణంలో అడుగడుగునా నాలుగు దాగి ఉంది. ఈ కట్టడం ప్రతి కోణంలోనూ నాలుగు ఉంది. ఇలా నాలుగు ప్రతి బింబించేలా చార్మినార్ ను నిర్మించడం అప్పటి నిర్మాణ, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

పురావస్తుశాఖ అధికారుల పరిశోధనలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టడానికి గల కారణాలు వెలికివచ్చాయి. మొత్తంగా ఈ చార్మినార్ కు ఆ పేరుపెట్టడానికి మొత్తం 20 కారణాలు ఉన్నట్లు భారత పురావస్తుశాఖ అధికారులు తమ పరిశోధనలతో ఓ నిర్ణయానికి వచ్చారు.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

అందులో ముఖ్యమైనవి చార్మినార్ కు నలుగు వైపులా 40 ముఖాలు ఉంటాయి. వీటిని నాలుగుతో భాగిస్తే శేషం సున్నావస్తుంది. నాలుగు మినార్ల ఎత్తు 60 గజాలు. వీటిని నాలుగుతో భాగిస్తే శేషం సున్నా వస్తుంది.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

ఈ చార్మినార్ నాలుగు రోడ్ల కూడలిలో ఉంటుంది. భారత దేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్మాత్మక కట్టడాల్లో చార్మినార్ మొదటివరుసలో నిలబడుతుంది. ఛార్మినార్ నిర్మాణానికి పట్టిన స్థల విస్తీర్ణం. 840 చదరపు గజాలు.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

ఈ సంఖ్య కూడా నాలుగుతో భాగిస్తే శేషం సున్నా వస్తుంది. ఇక ఛార్మినార్ లోని ప్రతి మినార్లలో నాలుగు గదులు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీల్లో 20 ఆర్చరీలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో ఒక్కొక్క ఆర్చరీలో 12 చొప్పున మొత్తం 24 ఆర్చరీలు ఉన్నాయి.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

అంటే మొత్తం ఆర్చరీల సంఖ్య 44. దీనిని కూడా నాలుగుతో భాగిస్తే శేషం సున్నానే. ఇలా ఛార్మినార్ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్ కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

ప్రతి మినార్ లోని బాల్కనీలో శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ చార్మినార్ కట్టడానికి గల విశాలమైన ఆర్చ్ లకు ఇరువైపాలా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి మొత్తం స్థలాలు 32. ఈ సంఖ్యలన్నీ నాలుగుతో భాగింపబడుతాయి.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

మొదటి అంతస్తులోని ఆర్చ్కు, మినార్లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టు కొలతతో ఒక నీటి కొలను ఉంది. ఒక్కొక్క మినార్ కు మధ్య ఖాళీ స్థలం 28 గజాలు. చార్మినార్ కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్ ల కోసం వదిలివేశారు.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

కట్టడం పైకి వెళ్లడానికి ప్రతి మినార్ లో 140 మెట్లు ఉన్నాయి. ఈ సంఖ్యలన్నింటినీ నాలుగు భాగిస్తే శేసం సున్నా వస్తుంది. చార్మినార్ లోని మూడో అంతస్తులో చిన్న మసీదు ఉంది. ఇక్కడ నమాజు కూడా చేసుకోవచ్చు. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్లు ఉన్నాయి.

చార్మినార్, హైదరాబాద్

చార్మినార్, హైదరాబాద్

P.C: You Tube

ఛార్మినార్ హైదరాబాద్ లో ఉన్న ప్రాచీన కట్టడాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. క్రీస్తుశకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని మహ్మద్ ఖులీ ఖుతుబ్ షా నిర్మించాడు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+