Search
  • Follow NativePlanet
Share
» »"దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఐఆర్‌సిటిసి కార్తీక‌మాసం స‌రికొత్త ప్యాకేజీ...

"దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఐఆర్‌సిటిసి కార్తీక‌మాసం స‌రికొత్త ప్యాకేజీ...

మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ మాసంలో చాలామంది ఎంతో భ‌క్తితో భోలేనాథున్ని కొలుస్తారు. అంతేకాదు. చాలామంది ఈ మాసంలో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే కార్తీక‌మాసం సంద‌ర్భంగా ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సిటిసి భ‌క్తుల‌కు ఈ అవ‌కాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్యాకేజీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లతో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్​ నుంచి ఈ ప్రయాణం ప్రారంభ‌మ‌వుతుంది. మరి ఈ ప్రయాణ వివరాలు ఇలా ఉన్నాయి.

టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్​ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ట్రైన్ భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్ర‌యాణిస్తుంది. మ‌రుస‌టి రోజు ఉదయం ఎనిమిది గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​కు చేరుకుంటుంది. అక్కడి నుంచి హోటల్​కు వెళ్తారు. అక్కడ ప్రెష్ అయ్యాక అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు.

divyadakshinayatrawithjyotirlinga

అక్క‌డి నుండి కుదాల్​నగర్​కు జ‌ర్నీ ప్రారంభ‌మ‌వుతుంది. మూడో రోజు ఉదయం కుదాల్​నగర్​ చేరుకుంటారు. ఆ త‌ర్వాత రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక ఫ్రెష్​ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాల ద‌ర్శ‌నం చేసుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్​కు వెళ్లారు. ఆ నైటందిఅక్క‌డే బ‌స చేస్తారు. నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం చేసి రామేశ్వరం నుంచి బస్సు జ‌ర్నీ స్టార్ట్ చేస్తారు. ఈ బ‌స్సు జ‌ర్నీలో మ‌ధురై వెళ్తారు.

అక్క‌డ మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అనంత‌రం సమయం ఉంటే షాపింగ్​ చేస్తారు. ఆ త‌ర్వాత కుదాల్​నగర్​ రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి రైలు ప్ర‌యాణం మొద‌లవుతుంది. ఇక‌, ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుని, హోటల్​లో ఫ్రెషప్​ అవుతారు. ఆ త‌ర్వాత రాక్​ మెమోరియల్​, గాంధీ మండపం, సన్​సెట్​ వంటి ప్ర‌దేశాలు సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుంటారు. డిన్న‌ర్ చేసి, ఆ నైటంగా అక్క‌డే ఉంటారు.

ఈ స్టేష‌న్ల మీదుగా..

మ‌రుస‌టి రోజు ఉదయం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి కొచ్చువేలికి బయలుదేరుతారు. కొచ్చువేలి చేరాక‌, త్రివేండ్రం ప్ర‌యాణం ఉంటుంది. అక్కడ‌ పద్మనాభ స్వామి ఆలయం ద‌ర్శ‌నం ఉంటుంది. అనంత‌రం కోవలం బీచ్​ సంద‌ర్శ‌న ఉంటుంది. కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు. ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుంటుంది. హోటల్​లో ఫ్రెషప్​ అయ్యాక శ్రీరంగం టెంపుల్​ దర్శ‌నం ఉంటుంది.

మధ్యాహ్నం భోజనం చేసి తంజావూర్​ ప్ర‌యాణం ఉంటుంది. అక్కడ బృహదీశ్వర ఆలయ ద‌ర్శ‌నం ఉంటుంది. అక్కడి నుంచి తంజావూర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి సికింద్రాబాద్​ స్టేష‌న్‌కు ప్ర‌యాణం ఉంటుంది. ఎనిమిద‌వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్​, మహబూబాబాద్​, వరంగల్​, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా ప్ర‌యాణం ఉంటుంది. ఆ తర్వాత తొమ్మిదోరోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.

ప్యాకేజీ ధరలివే..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వీటి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఎకానమీ(SL): పెద్దలకు రూ.14,250గా నిర్ణ‌యించారు. అదే 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకయితే రూ.13,250 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్​(3AC): పెద్దలకు రూ.21,900 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700 చెల్లించాలి. కంఫర్ట్​(2AC): పెద్దలకు రూ.28,450 ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ న‌వంబ‌ర్ 6వ తేదిన ప్రారంభం కానుంది.

More News

Read more about: kartikamasam irctc news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+