Search
  • Follow NativePlanet
Share
» »మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్ పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్‌ప్యాకేజీ..!

మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్ పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్‌ప్యాకేజీ..!

విదేశాల‌కు విహార‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌ని చాలామంది ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. అందులో చాలామంది సింగ‌పూర్ వంటి ట్రిప్‌ల‌కు వెళ్లాల‌ని అనుకుంటూ ఉంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా అతి తక్కువ ధరలోనే సింగ‌పూర్‌ను చుట్టేయొచ్చు. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఐఆర్‌సిటిసి సంస్థ ప‌ర్యాట‌కుల కోసం ప‌లు ప్యాకేజీల‌ను ప్ర‌క‌టిస్తుంది. ఇందులో భాగంగానే విదేశీ ప‌ర్య‌ట‌నల ప్యాకేజీల‌ను కూడా తీసుకొస్తుంది. ప్ర‌యాణికుల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మలేషియా టు సింగపూర్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ప్యాకేజీనీ నిర్ణీత ధరకు బుక్ చేసుకోవ‌చ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రయాణం, వసతి, ఆహారం అన్ని వారే చూసుకుంటారు. ఈ ప్యాకేజీలోనే సింగపూర్, మలేషియాలలో సందర్శించాల్సిన ప్రధాన టూరిస్ట్ స్పాట్లను అన్నీ కవర్ అవుతాయి. ఈ క్ర‌మంలో ఐఆర్‌సిటిసి అందిస్తోన్న సింగపూర్ టు మలేషియా టూర్ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలను ఇప్ప‌డు చూసేద్దాం..

skyscrapers

మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్..

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ పేరు మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్. ఎస్‌హెచ్O1 ప్యాకేజీ కోడ్‌తో ఈ టూర్ ప్యాకేజీ 7 పగళ్లు, 6 రాత్రులు ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా కౌలాలంపూర్, సింగపూర్ వంటి ప్రాంతాల‌ను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ ప్యాకేజీ అక్టోబర్ 28న హైదరాబాద్ నుంచి మొద‌ల‌వుతుంది.

ఏడురోజుల టూర్‌షెడ్యూల్ ఇదే..

టూర్‌లో భాగంగా అక్టోబర్ 27వ తేదీ రాత్రి 21:00 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ మరుసటి రోజు (అక్టోబర్ 28) ఉదయం 07:30 గంటలకు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్క‌డ హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాక‌, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేస్తారు. అనంత‌రం ఆ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత భోజనం చేశాక.. మధ్యాహ్నం పుత్రజయ టూర్ చేస్తారు. ఆ నైట్‌కు ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తారు. రాత్రికి ఆ హోటల్లోనే బస చేయాల్సి ఉంటుంది. రెండోరోజు హోటల్‌లో టిఫిన్ తిన్నాక బటు గుహలను సందర్శ‌న‌కు బయలుదేరుతారు.

singapore city

అనంత‌రం జెంటింగ్ హైలాండ్స్‌కు ప్ర‌యాణం ఉంటుంది. కౌలాలంపూర్‌కి తిరిగి వెళ్లి, ఆ త‌ర్వాత‌ ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తారు. రాత్రంతా హోట‌ల్‌లోనే స్టేయింగ్ ఉంటుంది. మూడోరోజు నగర సందర్శన ఉంటుంది. ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్ , పెట్రోనాస్ ట్విన్ టవర్లను ప‌ర్య‌టిస్తారు. నాలుగోరోజు హోటల్‌లో టిఫిన్ చేశాక చెక్ అవుట్ చేసి, బస్సులో సింగపూర్‌కు ప్ర‌యాణం ఉంటుంది. మధ్యాహ్నానికి సింగపూర్ చేరుకుంటారు. ఆ త‌ర్వాత‌ ఆర్చిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్‌ల ప‌ర్య‌ట‌న ఉంటుంది.

అనంత‌రం ఎస్ఈఏ, మేడమ్ టుస్సాడ్స్, ఐఓఎస్, వింగ్స్ ఆఫ్ టైమ్, మొదటి ప్రదర్శనను వీక్ష‌ణ‌కు బ‌య‌లుదేరుతారు. ఆరోరోజు హోట‌ల్‌లో టిఫిన్ చేసి ఫుడ్ కూపన్‌లతో యూనివర్సల్ స్టూడియోలను సందర్శిస్తారు.ఏడో రోజు ఉద‌యం టిఫిన్ పూర్త‌య్యాక జురాంగ్ బర్డ్ పార్క్‌ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం చేశాక కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు చాంగి విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకోవ‌డంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.

singapore universal studio

ప్యాకేజీని ధ‌ర‌లివే..

ఈ ప్యాకేజీలో భాగంగా వీటి ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. సింగిల్ షేరింగ్ కు 1 లక్షా 56 వేల 30 ఖర్చవుతుంది. డబుల్ షేరింగ్ అయితే, రూ.1, 29, 280 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.1 లక్షా 28 వేల 720 ఉంటుంది. 5 -11 సంవత్సరాల లోపు పిల్ల‌ల‌క‌యితే, రూ. 1,11, 860 అవుతుంది. 2 -11 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ. 98,820 ఉంటుంది.

More News

    Read more about: irctc malaysia singapore
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+