కర్ణాటకలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరి వంటి ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న వీటి పూర్తి వివరాలు మీకోసం..
ప్రతి మంగళవారం...
హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ ఆపరేట్ అవుతోంది. ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజులు ఉంటుంది. ఇందులో కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం అక్టోబర్ 15, 2024వ తేదీన పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

టూర్ ప్యాకేజీ ధరలు..
ఈ ప్యాకేజీ ధరల వివరాలిలా ఉన్నాయి. సింగిల్ షేరింగ్ కు రూ.38,810 పలుకగా, డబుల్ షేరింగ్ కు రూ. 22520 ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు పలుకుతాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. అదే సింగిల్ షేరింగ్ కు రూ. 35810గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19520 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుల కు కూడా టికెట్ ధరలు వేర్వేరుగా నిర్ణయించారు.
టూర్ షెడ్యూల్ వివరాలివే..
మొదటి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. నైట్ అంతా జర్నీ చేయాల్సి ఉంటుంది. రెండోరోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపి పర్యటన ఉంటుంది. ఆ తర్వాత సమీపంలోని శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు మాల్పేబీచ్ కు వెళ్తారు. నైట్ ఉడిపిలోనే స్టేయింగ్ ఉంటుంది. మూడో రోజు ఉదయం కొల్లూరుకు సందర్శనకు వెళ్తారు.

తర్వాత ముఖాంభికా ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మురుడేశ్వర్ కు సందర్శన ఉంటుంది. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్‌లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు. నాలుగో రోజు హోర్నాడ సందర్శన ఉంటుంది. అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరి పర్యటనకు వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శనం అనంతరం తిరిగి మంగళూరుకు ప్రయాణం ఉంటుంది.
నైట్ అంతా ఇక్కడే ఉంటారు. ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. తర్వాత మంగళాదేవీ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం తన్నేరుబీవీ బీచ్, గోకర్నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రి ఏడు గంటలకు మంగళూరు చేరుకుంటారు. రాత్రి 08గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఇక, ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కవర్ అవుతాయి.



Click it and Unblock the Notifications













