ఐఆర్‌సీటీసి.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఇది నిత్యం పని చేస్తూనే ఉంటుంది. తాజాగా హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్ పేరుతో సరికొత్త టూర్ ప్యాకేజీని పరిచయం చేస్తోంది. ఈ ప్యాకేజీలో మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ మొదలవుతుంది. ప్యాకేజీలో భాగంగా అమృత్ సర్, చండీగఢ్, దాల్హౌజ్, ధర్మశాల, సిమ్లా లాంటి సందర్శనీయ ప్రాంతాలను చుట్టేయవచ్చు.
జర్నీ రూట్ మ్యాప్ ఇలా..
హైదరాబాద్ నుంచి మొదటి రోజు ఉదయం విమానంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా మధ్యాహ్నానికి అమృత్‌సర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే ఏర్పాటు చేసుకున్న హోటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత అట్టారీ-వాఘా సరిహద్దు పర్యటనకు తీసుకువెళతారు. సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్‌ను చూపిస్తారు. తర్వాత రాత్రికి అమృత్‌సర్‌లో విడిది చేయాలి. రెండవ రోజు టిఫిన్ తర్వాత దాల్ హౌసికి వెళ్లి.. అక్కడ హోటల్‌కి చేరుకుంటారు. స్థానికంగా మాల్ రోడ్ సందర్శన ఉంటుంది. రాత్రికి దాల్హౌసిలోనే బస ఉంటుంది.

జ్వాలాముఖి సందర్శన..
మూడో రోజు దాల్‌హౌసి నుంచి ఖజ్జియర్కు బయలుదేరుతారు. అక్కడ పలు సందర్శనీయ ప్రదేశాలు చూసిన తర్వాత ధర్మశాలకు వెళతారు. ఆ రాత్రికి ధర్మశాలలోని హోటల్‌లోనే విడిది ఉంటుంది. నాలుగవ రోజు ఉదయం టిఫిన్ చేసి, మెక్‌లియోడ్ గంజ్ సందర్శనకు వెళతారు. ఆ తర్వాత ధర్మశాలలోని పర్యాటక ప్రదేశాలు విజిట్ చేస్తారు. రాత్రికి అక్కడే విడిది ఉంటుంది. మరుసటి రోజు సిమ్లాకు ప్రయాణం అవ్వాలి. ఈ మార్గ మధ్యలో జ్వాలాముఖి సందర్శన చేసిన తర్వాత రాత్రికి సిమ్లాకు చేరుకుని, అక్కడే బస చేయాలి.

లీజర్ వ్యాలీ అందాలు..
ఆరవ రోజు ఉదయం కుఫ్రీకి జర్నీ ఉంటుంది. అక్కడి స్థానిక పర్యాటక ప్రదేశాలను చూపిస్తారు. తర్వాత తిరిగి సిమ్లా చేరుకుని, సాయంత్రం మాల్ రోడ్ విడిట్ అనంతరం రాత్రికి అక్కడే విడిది చేయాలి. ఏడవ రోజు అక్కడి నుంచి చండీగఢ్ ప్రయాణమవుతారు. అక్కడి హోటల్‌కు చేరుకున్నాక, సాయంత్రం లీజర్ వ్యాలీ పర్యటన ఉంటుంది. రాత్రికి అక్కడ విడిది చేసి, మరుసటి రోజు ఉదయం రాక్ గార్డెన్, సుకానా లేక్ వంటి ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు ఇలా..
కంఫర్ట్ విభాగంలో రూ.60,200 సింగిల్ ఆక్యూపెన్సీకి, డబుల్ ఆక్యూపెన్సీ రూ 45,000, రూ.42,300 ట్రిపుల్ ఆక్యూపెన్సీకి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.35,500, విత్ అవుట్ బెడ్ రూ.33,150లుగా ధరను నిర్ణయించారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలకు రూ.23,850 చెల్లించాల్సి ఉంటుంది. ఈ హ్యాపీ హిమాచల్ అండ్ పాపులర్ పంజాబ్ ప్యాకేసీ అక్టోబర్ 16వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం.. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి!



Click it and Unblock the Notifications













