Search
  • Follow NativePlanet
Share
» »కేర‌ళ హిల్స్ అండ్ వాట‌ర్స్ పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

కేర‌ళ హిల్స్ అండ్ వాట‌ర్స్ పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

మంచు కురిసే వేళ‌లో కేర‌ళ‌లో ఎంజాయ్ చేయాల‌నుకునేవారి కోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్‌ప్యాకేజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం టూర్ ప్యాకేజీని ప్ర‌యాణికుల కోసం ప్రకటించింది. రైలు ప్ర‌యాణం ద్వారా దీనిని ఆపరేట్ చేస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా కేర‌ళ‌లలోని ప్ర‌కృతి అందాలతో పాటు అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లను కూడా చూసే అవ‌కాశం ల‌భిస్తుంది.

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ 'KERALA HILLS & WATERS ' పేరుతో ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 12, 2024వ తేదీన ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయ‌నున్నారు. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ఈ టూర్ ప్లాన్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

keralahills package

ప్యాకేజీ షెడ్యూల్ ఇదే..

ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి కేర‌ళ ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ కేరళ ట్రిప్ లో భాగంగా మున్నార్ , అలెప్పీతో పాటు పలు మరికొన్ని అద్భుతమైన టూరిజం స్పాట్ల‌ను వీక్షించే అవ‌కాశ ఉంంటుంది. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 17230 అనే నెంబ‌ర్‌గ‌ల శ‌బ‌రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీప్రారంభ‌మ‌వుతుంది. నైటంతా స్టే చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టిరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ ప్ర‌యాణం ఉంటుంది. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత సాయంత్రం మున్నార్ సంద‌ర్శించేందుకు బ‌య‌లుదేరుతారు. రాత్రి మున్నార్ లోనే బ‌స చేయాల్సి ఉంటుంది.

ఇక‌, మూడో రోజు ఉదయం ఎర్నాకులం నేష‌న‌ల్ పార్క్‌ను సందర్శిస్తారు. అనంత‌రం టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను వీక్షించొచ్చు. రాత్రి కూడా మున్నార్ లోనే బ‌స చేయాల్సి ఉంటుంది. నాల్గో రోజు హోటల్ నుంచి అలెప్పీకి బ‌య‌లుదేరుతారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత బ్యాక్‌వాట‌ర్ ప్రాంతానికి వెళ్తారు. ఆ నైటంతా అలెప్పీలో బస చేస్తారు. ఇక‌, ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యాక ఎర్నాకులం సంద‌ర్శిస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆర‌వ‌ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

keralahills irctc

ప్యాకేజీ వివ‌రాలివే..

హైదరాబాద్ టు కేరళ టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. సింగిల్ షేరింగ్ కు రూ. 34480గా నిర్ణ‌యించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19910 చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో ఇదే ప్యాకేజీ ధర రూ. 16260గా ఉండేది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.13530 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ షేరింగ్ కు రూ. 17180 చెల్లించాలి. సింగిల్ షేరింగ్ కు రూ. 31750గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుల‌కు కూడా టికెట్ ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన‌ పూర్తి వివరాల కోసం ప్ర‌యాణికులు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+