Search
  • Follow NativePlanet
Share
» »సాయి శివమ్ పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

సాయి శివమ్ పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

ఇండియ‌న్ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలు లేదా వివిధ పుణ్యక్షేత్రాల్ని సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం ప‌ర్యాట‌కుల‌కు కోసం ప్ర‌త్యేక ప్యాకేజ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు షిరిడీ భక్తుల కోసం సాయి శివమ్ పేరుతో ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ ప్ర‌క‌టించింది.

షిరిడీ భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన‌ ఈ కొత్త టూర్ ప్యాకేజీ పేరు సాయి శివమ్. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమై, తిరిగి హైదరాబాద్‌లోనే ముగుస్తుంది. ఇది మొత్తం నాలుగు రోజుల ట్రిప్‌. రైలు మార్గంలో ప్ర‌యాణం ఉంటుంది. ఈ స‌రికొత్త టూర్ ప్యాకేజీ నవంబర్ 8, 2024వ తేదీన ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ప‌ర్యాట‌కులు, భ‌క్తులు ఐఆర్‌సిటిసి టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టిక్కెట్ల‌ను బుక్ చేసుకోగ‌ల‌రు. ఐఆర్‌సిటిసి అతి తక్కువ ధరలోనే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌రికొత్త ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్నారు.

irctcnewtourpackagenamedsaishivam1

న‌వంబ‌ర్ 8న టూర్ ప్యాకేజీ..

తాజాగా ఐఆర్‌సిటిసి షిర్డీకి 'సాయి శివమ్' (SAI SHIVAM) పేరుతో ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో నాసిక్ యాత్ర కూడా కవర్ అవుతుంది. మూడు రాత్రులు, నాలుగు ప‌గ‌ళ్ల‌తో ఈ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 8, 2024 తేదీన భ‌క్తుల‌కు అందుబాటులో ఉండ‌నుంది. భ‌క్తులు, ప‌ర్యాట‌కులు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ను సంప్ర‌దింగ‌చ‌ల‌రు.

ప్యాకేజీ షెడ్యూల్ ఇదే..

ఈ ప్యాకేజీలో భాగంగా 17064 అనే నెంబ‌ర్‌గ‌ల అజంతా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు బ‌య‌లుదేరుతుంది. నైటంతా ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్క‌డి నుండి షిర్డీకి ప్ర‌యాణం ఉంటుంది. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. అక్క‌డ షిర్డీ సాయిబాబా దర్శనం అనంత‌రం సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను సంద‌ర్శించొచ్చు. ఆ నైటంతా అక్క‌డే స్టే చేయాల్సి ఉంటుంది.

irctcnewtourpackagenamedsaishivam2

మూడోరోజు షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ త‌ర్వాత త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. ఆ త‌ర్వాత నాగర్‌సోల్ స్టేషన్ చేరుకుంటారు. అక్క‌డ రాత్రి 08:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. రాత్రి 09:20 గంటల స‌మ‌యంలో ట్రైన్ అక్క‌డి నుండి బయల్దేరుతుంది. రాత్రంతా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హైదార‌బాద్ చేరుకోవ‌డంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలివే..

షిర్డీ టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. సింగిల్ షేరింగ్ కు రూ. 9,840 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ షేరింగ్ అయితే రూ. 7970 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7780 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉన్నాయి. ఇక‌, స్టాండర్డ్ క్లాస్ విష‌యానికి వ‌స్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 8170గా నిర్ణ‌యించ‌గా, డబుల్ షేరింగ్ కు రూ. 6290 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6110 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్ల‌ల‌కు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివన్నీ ఈ ప్యాకేజీలోనే క‌వ‌ర్ అవుతాయి. మ‌రెందుకాల‌స్యం షిర్డీ ప్ర‌యాణానికి సిద్ధం కండి మ‌రీ..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+