Search
  • Follow NativePlanet
Share
» »బెజ‌వాడ నుంచి 7 పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేందుకు.. ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ!

బెజ‌వాడ నుంచి 7 పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేందుకు.. ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ!

భార‌త‌దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్ర‌దేశాలున్నాయి. చాలామందికి పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శనం చేసుకోవాల‌ని ఉంటుంది. అటువంటి వారికోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని ఏడు ప్ర‌ముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త ప్యాకేజీనీ తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

ఇది ట్రైన్ జ‌ర్నీ.. మొత్తం ప‌న్నెండు రోజుల పాటు ఈ జ‌ర్నీ సాగుతుంది. భార‌త్ గౌర‌వ్ టూరిస్ట్ రైలు యాత్ర వ‌చ్చెనెల (ఆగ‌స్టు) 17 వ తేదీ నుంచి ప్రారంభ‌కానుంది. దేశంలోని ప్ర‌సిద్ధిచెందిన జ్యోతిర్లింగ క్షేత్రాల ద‌ర్శన భాగ్యం పొందాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ యాత్ర‌కు వెళ్లాల్సిందే. రండి వీటి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుందాం.

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర...

ఆగ‌స్టు 17వ తేదీన ప్రారంభ‌మ‌య్యే ఈ యాత్ర ద్వారా ఔరంగాబాద్, ద్వారకా, నాసిక్, పూణే, సోమనాథ్, ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాలను సంద‌ర్శించ‌వ‌చ్చు. వీటితోపాటు ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ ప్రాంతాల‌ను కూడా వీక్షించే అవ‌కాశం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర పేరుతో సాగుతుంది.

visit 7 holy places from Bejawada

ఇందులో భాగంగా 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో ప్ర‌యాణం ఉంటుంది. ఇక‌, ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్ర‌యాణంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్ర‌యాణిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్ర‌ముఖ ఆలయాలను సంద‌ర్శించే అవ‌కాశం కూడా ఉంటుంది. మొత్తం 12 రోజుల సంద‌ర్శ‌న ఉంటుంది. అందులో ఏడు ప్ర‌ముఖ‌మైన తీర్థయాత్రలను వీక్షించొచ్చు.

ప‌న్నెండు రోజుల షెడ్యూల్ ఇదే..

ఆగ‌స్టు 17వ తేదీ విజ‌య‌వాడ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ టూర్‌లో భాగంగా మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్ లలో ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది. మ‌రుస‌టి రోజు మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లలో ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది. మూడో రోజు రైలు ఉజ్జ‌యిని చేరుకుంటుంది. అక్క‌డి నుండి హోటల్ కు వెళ్తారు. ఆ త‌ర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ నైటంతా అక్క‌డే ఉండాలి.

నాలుగోరోజు టిఫిన్ చేశాక హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి ఒంకారేశ్వ‌ర జ్యోతిర్లింగ ఆల‌య సంద‌ర్శానికి వెళ్తారు. ఆ త‌ర్వాత ద్వార‌క ప్ర‌యాణం ఉంటుంది. రాత్రి ద్వారాక‌లోనే స్టేయింగ్ ఉంటుంది. మ‌రుస‌టి రోజు టిఫిన్ చేసి ద్వారక లోని ఫేమ‌స్ టెంపుల్స్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ త‌ర్వాత హోట‌ల్‌లో చెక్ అవుట్ అయ్యి సోమనాథ్ ప్ర‌యాణానికి బ‌యలుదేరుతారు. సోమనాథ్ చేరుకున్నాక, అక్క‌డ హోట‌ల్‌లోకి వెళ్లి ప్రెష్ అయ్యి సోమ‌నాథ్ జ్యోతిర్లింగ ద‌ర్శ‌నం చేసుకుంటారు. అక్కడినుండి నాసిక్ ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది.

ఇక మ‌రుస‌టి రోజు నాసిక్‌లోనే నైట్ స్టేయింగ్ ఉంటుంది. ఆ త‌ర్వాత తొమ్మిదో రోజు టిఫిన్ చేసి హోట‌ల్ నుంచి చెక్ అవుట్ అయ్యి నాసిక్ త్ర‌యంబ‌కేశ్వ‌ర్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డినుంచి పూణే ప్ర‌యాణం ఉంటుంది. పదో రోజు ఖర్ది రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక, హోట‌ల్‌కి వెళ్లి ప్రెష్ అయ్యి అక్క‌డినుండి భీమ‌శంక‌ర్ జ్యోతిర్లింగ ద‌ర్శ‌నం ఉంటుంది. ఆ త‌ర్వాత ఔరంగాబాద్‌కు ప్ర‌యాణ‌మ‌వుతారు. ప‌ద‌కొండోరోజు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్ లో చెక్ ఇన్ అయ్యాక‌ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ సందర్శనకు వెళ్తారు. అక్క‌డి నుండి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణ‌మ‌వుతారు. పన్నెండోరోజు ప్రయాణికుల డీబోర్డింగ్ ఉంటుంది. అక్క‌డితో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధ‌ర‌లివే..

క్లాస్ డబుల్/ ట్రిపుల్ షేర్ - పిల్లలు(5-11 సంవత్సరాలు)

ఎకానమీ రూ.20590 రూ.19255

స్టాండర్ట్ రూ.33015 రూ.31440

కంఫర్ట్ రూ.43355 రూ.41465

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+