Search
  • Follow NativePlanet
Share
» »ఐఆర్‌సిటీసి వారి హైద‌రాబాద్ టు అహ్మ‌దాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...

ఐఆర్‌సిటీసి వారి హైద‌రాబాద్ టు అహ్మ‌దాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...

ఈ సెల‌వుల్లో ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌నుకునేవారి కోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో భాగంగా హైద‌రాబాద్ టు అహ్మ‌దాబాద్‌, వడోదర, ద్వారక, సోమనాథ్ వంటి ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను చూసేయొచ్చు. మొత్తం ఎనిమిది రోజుల ట్రైన్ ప్యాకేజీ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంది. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ రూ.24,760తో ప్రారంభ‌మ‌వుతుంది. ఈ టూర్‌లో వ‌డోద‌ర‌, అహ్మ‌దాబాద్‌లోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు, ద్వారక‌, సోమ‌నాథ్ వంటి ప్ర‌దేశాల‌ను వీక్షించొచ్చు. ఈ ట్రైన్ టూర్ ప్ర‌తి బుధ‌వారం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ బ‌య‌లుదేరుతోంది. మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది ప‌గ‌ళ్లతో ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రి.

మొత్తం 8రోజుల టూర్ వివరాలు ఇలా ఉన్నాయి..

మొద‌టి రోజు బుధవారం 20967 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి పోర్ బందర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంత జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక‌, రెండో రోజు అంటే గురువారం నాడు వడోదర స్టేషన్ నుంచి ఉదయం 11:00 గంటలకు పికప్ చేస్తారు. అక్కడ నుంచి హోటల్‌కు బ‌య‌లుదేరుతారు. అదేరోజు మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసేందుకు బ‌య‌లుదేరాల్సి ఉంటుంది. (దీనికోసం టిక్కెట్లు సొంతంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

irctcshyderabadtoahmedabad

అందుకోసం ప్ర‌యాణికులు ఈ వెబ్‌సైట్‌ను "https://www.soutickets.in/#/dashboard" సంప్ర‌దించ‌గ‌ల‌రు.) అనంత‌రం వడోదరకి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. వడోదరలోనే రాత్రి బస చేయాలి. మూడోరోజు శుక్రవారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ ను సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అక్క‌డి నుండి 110 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. అహ్మ‌దాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ ఆలయ విజిట్ ఉంటుంది. అహ్మదాబాద్ లో హోటల్‌లో చెక్ ఇన్ చేసి రాత్రి బ‌స చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు శనివారం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. ఇక అక్క‌డినుంచి 440 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ ద్వారకకు బయలుదేరాలి.

ఆ మార్గంలో జామ్‌నగర్ లఖోటా ప్యాలెస్, మ్యూజియం వంటి ప్ర‌దేశాల‌ను సందర్శించవచ్చు. ఆ రోజు సాయంత్రానికి ద్వారకకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ చేసి ద్వారకలో రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఐదోరోజు ఆదివారం ఉదయం ద్వారకాదీష్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంత‌రం బెట్ ద్వారక, నాగేశ్వర్ ఆలయం, శివరాజ్‌పూర్ బీచ్ సంద‌ర్శ‌న ఉంటుంది. అనంత‌రం ద్వారకకి తిరిగి వెళ్తారు. రాత్రి బస ద్వారకలో ఉంటుంది. ఆరోరోజు సోమవార హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, అక్క‌డి నుండి 240 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సోమనాథ్‌కి బయలుదేరతారు.

ఆ మార్గంలో పోర్ బందర్ కీర్తి మందిర్, సుధామ దేవాలయం వంటి ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌ను వీక్షించొచ్చు. సోమనాథ్ చేరుకున్నాక సోమనాథ్ జ్యోతిర్లింగం, చుట్టుపక్కల దేవాలయాలను సందర్శించవచ్చు. అనంత‌రం అదే రోజు సాయంత్రం పోర్‌బందర్‌కి బయలుదేరతారు. రాత్రి పోర్‌బందర్ రైల్వే స్టేషన్‌లో దిగుతారు. ఏడో రోజు మంగళవారం 20968 అనే నెంబ‌ర్‌గ‌ల పోర్ బందర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అర్ధరాత్రి 12:50 గంటలకు తిరిగి రైలు ప్రయాణం మొదలవుతుంది. ఎనిమిదో రోజు బుధవారం ఉదయం 08:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి ట్రైన్ టూర్ అందుబాటులో ఉంటుంది.

ట్రైన్ టూర్ ప్యాకేజీ వివ‌రాలివే..

మొత్తం సీట్ల కోటా : స్లీపర్ నాన్ ఏసీ -06, 3 టైర్ ఏసీ - 04

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్

కంఫర్ట్(3AC) డబుల్ షేరింగ్‌కు రూ.28280 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్‌కురూ.27610 ఉంటుంది చైల్డ్ విత్ బెడ్(5-11 years ) రూ.22060 ఉంటుంది. చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) రూ.20020గా నిర్ణ‌యించారు.

స్టాండర్డ్(SL) డబుల్ షేరింగ్‌కు రూ.25430 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్‌కయితే, రూ.24760, చైల్డ్ విత్ బెడ్(5-11 years ) రూ.19210, చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) రూ.17170 ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం ఈ ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను చుట్టేయ్యండి.

More News

    Read more about: hyderabad to ahmedabad irctc
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+