రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ సేవలు ఎప్పటికప్పుడు కొత్తరూపు దిద్దుకుంటూ వస్తున్నాయి. తాజాగా టికెట్ సర్వీసులలో ఓ కొత్త విధానాన్ని పరిచయం చేసింది. సాధారణంగా రైలు టికెట్ తీసుకునేందుకు కౌంటర్‌కు వెళ్లడం లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించడం జరుగుతోంది. ఈ విధానాలకు అదనంగా టికెట్ బుక్ చేసుకోవడం ఇప్పుడు మరింత సులభతరం చేసింది ఐఆర్‌సీటీసీ. దీని ద్వారా ఒక్క ఫోన్ కాల్‌తో మనకు కావాల్సిన రైలు టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటికే రైల్వే టికెట్ల బుకింగ్ కోసం IRCTC, NPCI, CoRover గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో UPI వాయిస్ ఓవర్ చెల్లింపుల సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పేమెంట్ గేట్‌వేతో అనుసంధానం చేసిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో IRCTCలో వాయిస్ ఓవర్ ఉపయోగించి లేదా కాల్‌లో మీ UPI ID లేదా మొబైల్ నెంబర్ టైప్ చేయడం ద్వారా రైలు టికెట్ల కోసం పేమెంట్ చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతోపాటు AI వర్చువల్ అసిస్టెంట్ AskDISHA ద్వారా భారతీయ రైల్వే సర్వీసులన్నీ పొందే అవకాశం కల్పించారు.
వాయిస్‌తో బుకింగ్ ప్రక్రియ..
కొత్త తరహాలో రైలు టికెట్ బుకింగ్ కోసం ముందుగా IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌లోని AskDISHA2.0 ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని కింది భాగంలో కుడి పక్కన వాయిస్ బటన్‌పై ప్రెస్ చేసి.. I Want To Book a Ticket అని వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, తర్వాత ప్రాసస్‌లో మనం ఏ స్టేషన్ నుంచి ప్రయాణం చేయాలో ఆ స్టేషన్ పేరును స్పష్టంగా చెపి, ఎక్కడి వరకూ టికెట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ స్టేషన్ పేరును వాయిస్ రూపంలో ఇవ్వాలి.

అనంతరం.. ప్రయాణ తేదీ, టైన్ నెంబర్, సీటు కావాల్సిన కేటగిరి ఇలా ఒక్కొక్కటీ చెప్పడం లేదా అక్కడ చూపించే ఆప్షన్‌పై ప్రెసె చేయడం చేసుకోవాలి. ఈ విధానం ద్వారా ఆ సమయంలో అందుబాటులో ఉన్న సీట్లు లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న సీట్లను బుక్ చేసుకోవచ్చు. చివరిగా పేమెంట్ ప్రాసస్ కూడా వాయిస్ ద్వారా చేసుకునే అవకావం ఉంటుంది.
అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు..
టికెట్ బుక్ చేసుకోవడం లేదా బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకునేందుకు కూడా ఐఆర్‌సీటీసీ ఫోన్ కాల్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు PNR స్టాటస్, కన్ఫర్మేషన్ పర్సంటేజ్ వంటి అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. ఈ వ్యవస్థ పూర్తిగా AI ఆధారంగా పని చేసేలా రూపొందించారు. ఒకవేళ టికెట్ బుకింగ్ సమయంలో అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి, టికెట్ బుక్ అవ్వకపోతే టెంక్షన్ పడాల్సిన పనిలేదు.
మూడు లేదా నాలుగు బిజినెస్ వర్కింగ్ డేస్‌లో ఆటోమేటిక్‌గా డబ్బులు రీఫండ్ అయిపోయి, మీ అకౌంట్లోకి జమ అయిపోతాయి. అలా జమకాని పక్షంలో ఐఆర్‌సీటీసీ కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. ఈ సరికొత్త విధానం పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పని లేకుండా ఫోన్ కాల్‌తో టికెట్ బుక్ చేసుకుని, సుఖవంతమైన రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications













