Search
  • Follow NativePlanet
Share
» »ఈ ట్రైన్‌లో టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించ‌డం నేరం కాదు..

ఈ ట్రైన్‌లో టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించ‌డం నేరం కాదు..

ఈ ట్రైన్‌లో టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించ‌డం నేరం కాదు..

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరగడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సర్వీస్ అని మనకు తెలుసు. దేశమంతటా అల్లిన ఈ రైల్వేల ద్వారా మనం తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. అయితే, ప్రయాణీకులకు ఉచిత సేవలను అందించే రైలు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది విన‌డానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజ‌మేనండి. మరెందుకు ఆలస్యం ఆ విశేషాలు గురించి తెలుసుకుందాం....

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రైల్వే గత 73 సంవత్సరాలుగా 25 గ్రామాల ప్రజలకు ఉచిత సేవలను అందిస్తోంది. నిజానికి ఈ రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణించడం కూడా నేరం కాదు. అందువల్ల, ప్రయాణికులందరూ ఈ రైలులో ఉచిత ప్రయాణాన్ని ఆనందిస్తారు. ఈ రైలు హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ సరిహద్దులో నడుస్తుంది.

freetrain1

ఒక్క రూపాయి ఖర్చు లేదు

ఈ రైలులో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా హాయిగా జర్నీ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పంజాబ్ స‌రిహ‌ద్దులో ఉన్న భాక్రా-నంగల్ డ్యామ్ చూడటానికి వెళితే మాత్రం మీరు డ‌బ్బులు చెల్లించ‌క్క‌ర్లేదు. ఉచితంగానే ప్ర‌యాణించొచ్చు. ఈ రైలు నాగల్ నుండి భాక్రా డ్యామ్ మార్గంలో నడుస్తుంది. ఓ వైపు దేశ‌మంత‌టా రైల్వే శాఖ ప్రయాణికుల టికెట్ ధరలను పెంచుతుంటే, ఇక్క‌డ మాత్రం ప్రయాణీకులకు ఉచిత ప్రయాణాన్ని ఎలా ఇస్తున్నారని అందరూ అనుకుంటుంటారు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

ఉచిత సేవలు అందించడానికి గ‌ల కారణం

భాక్రా డ్యామ్ గురించి సమాచారం అందించేందుకు ఈ రైలు సర్వీస్‌ను ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద భక్రా డ్యామ్‌ని ఎలా నిర్మించారు. దాని చరిత్ర ఏమిటి. డ్యాం నిర్మాణ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వంటి విష‌యాల‌ను కొత్త తరానికి చాటిచెప్పేందుకు ఈ రైలు ప్రయాణికులను, పర్యాటకులను ఉచితంగా తీసుకెళ్తుంది. ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (BBMB) నిర్వహిస్తుంది. భాక్రా డామ్ 1963లో సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ ఆనకట్ట.

freetrain1

ఇది ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులలో నిర్మించబడింది. ఇది భాక్రా నంగల్ ప్రాజెక్టులో భాగము. దీని ముఖ్య ఉద్దేశం సట్లెజ్ నది-బియాస్ నది న‌దీ పరీవాహక ప్రాంతంలో వరదలను నిరోధించడం, పంట పొలాలకు సాగునీటి పంపిణీ, జల విద్యుత్తును ఉత్పత్తిచేయుట. భాక్రా డామ్ నిర్మాణం 1948 సంవత్సరంలో మొదలై 1963 లో పూర్తయ్యింది. ఇది 741 అడుగులు (226 మీటర్లు) ఎత్తు కలిగి ప్రపంచంలోని ఎత్తైన డామ్‌ల‌లో ఒకటిగా నిలిచింది.

రోజూ 300 మంది ప్రయాణికులు

ఈ రైల్వే లైన్ తయారు చేస్తున్నప్పుడు పెద్ద పర్వతాలు అతి కష్టం మీద తొలచబడ్డాయి. దీని కారణంగా ఆనకట్టకు అవసరమైన మెటీరియల్ డెలివరీ చేయబడింది. భాక్రా నుండి నాగ్లా రైలు మార్గాన్ని 1947లో తొలిసారిగా ప్రారంభించారు. ఈ రైలులో 25 గ్రామాల నుంచి రోజుకు 300 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ రైలు వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఈ రైలు నంగల్ నుండి డ్యామ్ వరకు నడుస్తుంది. రోజులో రెండు రౌండ్లు ఉన్నాయి. ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే.. ఈ రైలు కోచ్ మొత్తం చెక్కతో తయారు చేయబడింది. ఇలాంటి ప్రత్యేకమైన రైలులో ఉచిత ప్రయాణం భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ. మరెందుకు ఆలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

More News

    Read more about: himachal pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+