Search
  • Follow NativePlanet
Share
» »Jaisalmer Desert Festival 2024: రాజ‌స్థాన్‌లోని జైస్మ‌లేర్‌ ఎడారి ఫెస్టివ‌ల్‌...

Jaisalmer Desert Festival 2024: రాజ‌స్థాన్‌లోని జైస్మ‌లేర్‌ ఎడారి ఫెస్టివ‌ల్‌...

రాజస్థాన్ దాని ప్రత్యేక సంస్కృతి, రుచికరమైన ఆహారం, ప్రత్యేకమైన వారసత్వం, విభిన్న‌రకాల ఫెస్టివ‌ల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జనవరి, ఫిబ్రవరి నెల‌ల్లో ఇక్కడ అనేక రకాల పండుగలు నిర్వహిస్తారు. ఎందుకంటే శీతాకాలం రాజస్థాన్ సందర్శించడానికి ఉత్తమమైన సీజన్. ఈ పండుగలలో ఒకటి జైసల్మేర్ ఎడారి పండుగ. దీనిని మారు మహోత్సవ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివ‌ల్‌ను రాజస్థాన్ పర్యాటక శాఖ నిర్వ‌హిస్తుంది. దీనిని మూడు రోజుల పాటు జ‌రుపుకుంటారు. ఈ పండుగలో పాల్గొనడం వ‌ల్ల కల్బెలియా నృత్యం, జానపద పాటలు, ఒంటెల పందెం వంటి అనేక వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగే ఎడారి ఉత్సవం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సంవ‌త్స‌రం ఈ డిజెర్ట్ ఫెస్టివ‌ల్ ఫిబ్రవరి 22న ప్రారంభమై ఫిబ్రవరి 24 వరకు కొనసాగనుంది. ఈ పండుగకు రావడం ద్వారా, రాజస్థాన్ యొక్క రంగుల సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం ప‌ర్యాట‌కుల‌కు లభిస్తుంది. ఈ సంవత్సరం జైసల్మేర్ డెసర్ట్ ఫెస్టివల్ బ్యాక్ టు ది డెసర్ట్ థీమ్‌పై ఆధారపడి ఉంది.

jaisalmerdesertfestival

ఈ ఫెస్టివ‌ల్ ఎన్నిరోజులు ఉంటుంది..

ఈసారి జ‌ర‌గ‌బోయే ఈ అంతర్జాతీయ ఎడారి ఉత్సవంలో చాలా కార్యక్రమాలను నిర్వ‌హిస్తారు. సామ్ గ్రామ సమీపంలో ఉన్న లక్ష్మణ దిబ్బలలో ఈ కార్య‌క్రమాల‌ను నిర్వ‌హించడం జ‌రుగుతుంది.

జైసల్మేర్ ఎడారి ఉత్సవం థీమ్...

జైసల్మేర్ ఎడారి పండుగ ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మారు మహోత్సవ్ థీమ్ 'బ్యాక్ టు ది ఎడారి థీమ్‌తో ఈ ఫెస్టివ‌ల్‌ను జ‌రుపుకోనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు జరిగే ఈ ఉత్సవం లక్ష్మీనాథ్ ఆలయంలో ఊరేగింపుతో ప్రారంభమవుతుంది. ఇక్క‌డ అనేక పోటీలు కూడా నిర్వ‌హిస్తారు. ఒంటె పోలో మరియు ఒంటె రేసులు ఈ పండుగలో అత్యంత ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తారు. వీటితోపాటు జిమ్నాస్ట్‌లు వంటివి కూడా చేస్తుంటారు.

jaisalmerdesertfestival

ఒంటె వెనుక కూర్చొని అనేక రకాల విన్యాసాలు కూడా చేస్తారు. దీంతోపాటు పాంగ్రీ, పొడవాటి మీసాలు, మిస్టర్ డెజర్ట్ వంటి పోటీలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ ఫెస్టివ‌ల్‌లో విభిన్న‌ర‌కాల రుచుల‌ను కూడా ఆస్వాదించొచ్చు. ఇక్కడ చేతితో తయారు చేసిన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. సాహస ప్రియుల కోసం ఈ ఉత్స‌వం ఉత్త‌మ‌మైన‌ది. ఇక్క‌డ హాట్ ఎయిర్ బెలూన్, పారాచూటింగ్, జోర్బింగ్ బాల్, క్వాడ్ బైకింగ్ మరియు మరెన్నో కార్యకలాపాలు ఉన్నాయి.

కళాకారుల ప్రదర్శన అత్యంత ఆక‌ర్ష‌ణ‌.

ఈ జైస్మ‌ల్మేర్ ఎడారి ఫెస్టివ‌ల్‌లో వివిధ ర‌కాల పోటీలు, కార్య‌క్ర‌మాల‌తో పాటు క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఉంటాయి. జైసల్మేర్ ఎడారి ఉత్సవంలో పద్మశ్రీ అన్వర్ ఖాన్ బయ్యా, ఘాజీ ఖాన్ బర్నా, కూట్లే ఖాన్, పెపే ఖాన్, కల్బెలియా నర్తకి గులాబో దేవి, పంజాబీ సూఫీ గాయకుడు కన్వర్ గ్రేవాల్, నిజామీ బంధు, తగరం భీల్ ల వంటి వారు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు త‌ప్ప‌కుండా వీక్షించాల్సిందే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+