Search
  • Follow NativePlanet
Share
» »వెయ్యి యాగాలు జరిగిన చోటు, సందర్శనతో మీ జాతకాల్లో మార్పులు

వెయ్యి యాగాలు జరిగిన చోటు, సందర్శనతో మీ జాతకాల్లో మార్పులు

హైదరాబాద్ కు దగ్గర్లోని కీసరగుట్టు పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

భారత దేశంలోని దేవాలయాలు చాలా వరకూ పురాణ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. కొన్ని దేవాలయాలు మాత్రం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెంది ఇప్పటికీ అక్కడ పురావస్తుశాఖ పరిశోధనలు జరుపుతూ ఉంటుంది. అటువంటి కోవకు చెందినదే ఈ కథనంలోని దేవాలయం. ఇక్కడ శ్రీరాముడితో పాటు ఆయన నమ్మినబంటుగా పేరుగాంచిన హనుమంతుడు ప్రతిష్టించిన శివలింగాలు ఉన్నాయి. ఇక చారిత్రాత్మకంగా చూస్తే క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకూ ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశానికి ఈ కీసరగుట్టుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పురావస్తు శాఖ ఇక్కడ జరిపిన తవ్వకాలతో తేట తెల్లమయ్యింది. ముఖ్యంగా విష్నుకుండినులు తెలుగు భాషను అధికార భాషగా మొట్టమెదట గుర్తించినది ఇక్కడి శాసనాల ద్వార వెలుగు చూసింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ క్షేత్రం పూర్తి వివరాలు మీ కోసం ...

చారిత్రాత్మకంగా కూడా

చారిత్రాత్మకంగా కూడా

P.C: You Tube

కీసర లేదా కీసరగట్టు అని పిలిచే ఈ శైవ క్షేత్రం పురాణ ప్రాధాన్యత కలిగినదే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎందో ప్రసిద్ధి చెందినది. తెలంగాణ లోని మేడ్చల్ జిల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఆ రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

వారిద్దరూ ప్రతిష్టించిన

వారిద్దరూ ప్రతిష్టించిన

P.C: You Tube

స్థల పురాణాన్ని అనుసరించి త్రేతాయుగంలో అయోధ్యానగరాన్ని పరిపాలించిన శ్రీరాముడు, ఆయన నమ్మిన బంటు అయిన హనుమంతుడు ప్రతిష్టించిన 101 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏడాది వచ్చే మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుంది.

స్థల పురాణాన్ని అనుసరించి

స్థల పురాణాన్ని అనుసరించి

P.C: You Tube

ఈ క్షేత్రం ఏర్పాటునకు సంబంధించిన స్థల పురాణం ప్రకారం రామ, రావణ యుద్ధం తర్వాత అయోధ్యకు వెలుతూ మార్గమధ్యలో ఈ కీసరగట్టు ప్రాంతాన్ని రాముడు చూస్తాడు. ఇక్కడి ప్రక`తి సౌదర్యానికి రాముడు ముగ్దుడవుతాడు.

అందరూ అంగీకరిస్తారు.

అందరూ అంగీకరిస్తారు.

P.C: You Tube

అంతేకాకుండా ఈ కీసరగట్టు ప్రాంతం మరింత అభివ`ద్ధి చెందడం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని భావిస్తాడు. ఇందుకు అక్కడ ఉన్న మునులతో పాటు రాముడి పరివారంలో ఉన్న పెద్దలు కూడా అంగీకరిస్తాడు.

కాశీకి పంపి

కాశీకి పంపి

P.C: You Tube

అయితే శివలింగం కాశీ నుంచి తీసుకువచ్చి ప్రతిష్టిస్తే ఈ క్షేత్రానికి మరింత శోభ చేకూరుతుందని భావించిన శ్రీరాముడు ఇందు కోసం హనుమంతుడిని కాశీకి పంపిస్తాడు. ఆకాశమార్గాన కాశీ క్షేత్రాన్ని చేరుకున్న హనుమంతుడు పరమశివుడిని ప్రార్థిస్తాడు.

101 శివలింగాల రూపంలో

101 శివలింగాల రూపంలో

P.C: You Tube

ఆ పుణ్యక్షేత్రంలో పరమశివుడు అంజనీ పుత్రుడైన హనుమంతుడికి 101 శివలింగాల రూపంలో దర్శనమిస్తాడు. దీంతో పరమానందభరితుడైన హనుమంతుడు ఆ నూటొక్క శివలింగాలను తీసుకొని కీసరగట్టుకు బయలుదేరుతాడు.

సుమూహుర్త ఘడియలు సమీపిస్తున్నా కూడా

సుమూహుర్త ఘడియలు సమీపిస్తున్నా కూడా

P.C: You Tube

ఇదిలా ఉండగా కీసరగట్టులో శివలింగం ప్రతిష్టాపనకు నిర్ణయించిన సుమూహుర్త ఘడియలు సమీపిస్తున్నా కూడా హనుమంతుడు కీసరగట్టకు చేరుకోలేక పోతాడు. దీంతో శ్రీరాముడు పెద్దల అనుమతితో అక్కడే ఉన్న ఓ రాతిని శివలింగంగా మార్చి ప్రతిష్టాపన చేస్తాడు. దీనినే శ్రీరామ లింగేశ్వరస్వామి అని పిలుస్తారు.

చల్లాచదురుగా విసిరేస్తాడు

చల్లాచదురుగా విసిరేస్తాడు

P.C: You Tube

అటు పై హనుమంతుడు 101 శివలింగాలతో కీసరగట్టకు చేరుతాడు. అయితే అప్పటికే శివలింగం ప్రతిష్టాపన జరిగిపోవడంతో కోపంతో తాను తెచ్చిన 101 శివలింగాలను గుట్ట పై చల్లాచదురుగా విసిరేస్తాడు. ఆ లింగాలనే మనం గుట్ట పై ఇప్పటికీ అక్కడక్కడ చూడవచ్చు.

మారుతీ కాశీ విశ్వేశ్వర శివలింగంగా

మారుతీ కాశీ విశ్వేశ్వర శివలింగంగా

P.C: You Tube

అటు పై శ్రీరాముడు హనుమంతుడిని అనునయించి ఈ భూమండలం ఉన్నంత వరకూ ఈ క్షేత్రం నీ పేరుతో కేసరి గిరిగా వర్థిల్లుతుందని చెబుతాడు. దీంతో శాంతించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాల్లో ఒకదానిని శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం ఎడమ వైపున ప్రతిష్టించి పూజలు చేస్తాడు. దీనినే ప్రస్తుతం మనం మారుతీ కాశీ విశ్వేశ్వర శివలింగంగా అర్చన చేస్తున్నాం.

కీసరగుట్టుగా మార్పు చెందింది

కీసరగుట్టుగా మార్పు చెందింది

P.C: You Tube

కాలక్రమంలో కేసరగిరి క్షేత్రం కీసరగుట్టుగా మార్పు చెందింది. ఇక్కడ స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉండటం విశేషం. ఇలా దేవాలయాల్లో మూలవిరాట్టు పశ్చిమాభిముఖంగా ఉండటం చాలా అరుదు. ఇళా పశ్చిమాభిముఖంగా ఉన్న క్షేత్రాల్లో కోరిన కోర్కెటు త్వరగా తీరుతాయని చెబుతుంటారు.

విష్ణుకుండిన రాజవంశానికి

విష్ణుకుండిన రాజవంశానికి

P.C: You Tube

పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఈ క్షేత్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకూ ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశానికి ఈ కీసరగుట్టుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పురావస్తు శాఖ ఇక్కడ జరిపిన తవ్వకాలతో తేట తెల్లమయ్యింది.

1000 యాగాలు

1000 యాగాలు

P.C: You Tube

విష్ణుకుండిన రాజవంశానికి చెందిన రెండవ మాధవ వర్మ ఈ కీసరగుట్టులో 11 అశ్వమేధ యాగాలతో సహా మొత్తం 1000 యాగాలు చేశాడు. దీంతో ఆ యాగ ఫలాల వల్ల ఈ క్షేత్రం శక్తి రెట్టింపయినట్లు చెబుతారు. అందువల్లే కష్టాల్లో ఉన్నవారుఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మంచి జరుగుతుందని చెబుతారు.

3 చదరపు కిలోమీటర్ల పరిధిలో

3 చదరపు కిలోమీటర్ల పరిధిలో

P.C: You Tube

కీసరగుట్టలో పురావస్తు శాఖ దాదాపు 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిపిన తవ్వకాల్లో ఒక శిథిలమైన కోట, భవనాలు, బంగారు, వెండితో సహా వివిధ లోహాలతో తయారు చేసిన ఆభరణాలు, అలంకార వస్తువులతో పాటు యాగ కుండాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా విష్నుకుండినులు తెలుగు భాషను అధికార భాషగా మొట్టమెదట గుర్తించినది ఇక్కడి శాసనాల ద్వార వెలుగు చూసింది.

అక్కన్న, మాదన్నలు

అక్కన్న, మాదన్నలు

P.C: You Tube

క్రీస్తుశకం 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా పనిచేసే అక్కన్న, మాదన్నలు కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా అభివ`ద్ధి చేశారు.

ఏకశిలా విజయ స్థూపం

ఏకశిలా విజయ స్థూపం

P.C: You Tube

ఇందుకోసం హిందూ, మహ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి అందులో శ్రీ లక్ష్మి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయ స్థూపం ఉంది. ఈ స్తంభం పై దశావతారాల రూపాలతో పాటు గణపతి, ఆంజనేయ విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+