Search
  • Follow NativePlanet
Share
» »ఖండాలా.. ట్రెక్ ట్రయల్స్‌కు ఆహ్వానం ప‌లుకుతోంది

ఖండాలా.. ట్రెక్ ట్రయల్స్‌కు ఆహ్వానం ప‌లుకుతోంది

ఖండాలా.. ట్రెక్ ట్రయల్స్‌కు ఆహ్వానం ప‌లుకుతోంది

కొండ ప్రాంత‌ పట్టణమైన ఖండాలా సహ్యాద్రి లేదా పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉన్న ఖండాలా ముంబై మరియు పూణేలకు సమీపంలో ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన హిల్‌స్టేష‌న్‌. ఈ పట్టణం ముంబై-పూణే మార్గంలో ఉండ‌టం వ‌ల్ల ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రజలకు ఇదోక ఇష్టమైన స్టాప్‌ఓవర్.

ఖండాలా సుందరమైన హైకింగ్ మరియు ట్రెక్ ట్రయల్స్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఖండాలా మరొక ప్రసిద్ధ హిల్ స్టేషన్ లోనావాలా నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్ కూడా లోనావాలానే.

వాతావరణ పరిస్థితులు

వాతావరణ పరిస్థితులు

పశ్చిమ కనుమల మధ్య ఉన్నందున ఖండాలాలో వాతావరణం ఏడాది పొడవునా సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మరియు జూన్ మధ్య వేసవి నెలలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు ఉంటాయి. శీతాకాలాలు సాధారణంగా తేలికపాటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ 12 డిగ్రీల కంటే తగ్గవు.

ముంబాయి వాసులతోపాటు సంద‌ర్శ‌కులు ఇక్క‌డి ఏడాది పొడవునా తేలికపాటి వాతావరణం కారణంగా ఖండాలాను సంవత్సరంలో ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు. మ‌రీ ముఖ్యంగా సుందరమైన ప్ర‌కృతి దృశ్యాలు, పొగమంచు చుట్టేసిన కొండకోన‌లు వర్షాకాలంలో కొత్త‌రూపు సంత‌రించుకుంటాయి. అయితే సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఇక్క‌డి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్ర‌సిద్ధ‌ ట్రెక్కింగ్ గమ్యస్థానం

ప్ర‌సిద్ధ‌ ట్రెక్కింగ్ గమ్యస్థానం

ఖండాలా ఒక చిన్న పర్యాటక పట్టణం కావడంతో ఇక్క‌డి ఆక‌ర్ష‌ణీయ ప్ర‌దేశాల‌ను ఒక‌టి రెండు రోజుల్లో కవర్ చేయవచ్చు. మ‌రీముఖ్యంగా ఖండాలా ప్రాంతాన్ని ప్ర‌సిద్ధ‌ ట్రెక్కింగ్ గమ్యస్థానంగా మార్చాయి ఇక్క‌డి ప‌ర్వ‌త శ్రేణులు. రాక్ క్లైంబింగ్, హైకింగ్ మరియు హ్యాంగ్-గ్లైడింగ్ వంటి అనేక సాహస క్రీడలతో దేశం నలుమూలల నుండి ఇక్క‌డికి వ‌చ్చే సాహసికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. డ్యూక్స్ నోస్, టైగర్స్ లీప్, కర్లా మరియు భాజా గుహలు, భూషి సరస్సు, అమృతంజన్ పాయింట్ ఇక్క‌డికి వ‌చ్చే పర్యాటకులు తప్పక చూడవ‌ల‌సిన అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలు.

ఖండాలా దాని చుట్టుపక్కల ట్రెక్ మరియు హైకింగ్ ట్రయల్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో అనేక బడ్జెట్ మరియు లగ్జరీ హోటళ్ళు, వసతి కోసం లాంజ్‌లు ఉన్నాయి. న‌డ‌క లేదా సైకిల్ ఎంపిక‌ ఖండాలా చుట్టూ తిరగడానికి ఉత్తమ మార్గం. ఈ చిన్న పట్టణం చుట్టూ తిరగడానికి అనేక స్థానిక బస్సులతో పాటు టాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

ముంబై, పూణే వంటి ప్రధాన నగరాలకు దగ్గరగా ఉండడం వల్ల ఖండాలా చేరుకోవడం పెద్ద‌ సమస్య కాదు. సమీప విమానాశ్రయం 69 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఇది సమీప మెట్రోపాలిటన్ నగరమైన ముంబైలో కేవలం 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబై-పూణే హైవేపై ఉండ‌డం వల్ల ఇది రోడ్లతో బాగా అనుసంధానించబడి ఉంది. ముంబయి మరియు పూణే నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ లోనావాలా సమీపంలో ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+