Search
  • Follow NativePlanet
Share
» »వేస‌వి సెల‌వుల్లో అడ్వంచ‌ర్స్ చేసేద్దామా...

వేస‌వి సెల‌వుల్లో అడ్వంచ‌ర్స్ చేసేద్దామా...

వేస‌వి సెల‌వుల్లో అడ్వంచ‌ర్స్ చేసేద్దామా...

వేసవి కాలం ప్రారంభమైంది. దీంతో ప్రజలు తమ ఇష్టమైన హాలిడే స్పాట్‌లను ఎంచుకోవడం ప్రారంభించారు. కొంతమంది పర్వతాలలో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడితే, మరికొందరు బీచ్‌లో సూర్యాస్తమయాన్ని చూడాలనుకుంటారు. కొంతమంది సాహస క్రీడ‌లను ఇష్టపడతారు. అలా సాహ‌స క్రీడ‌ల‌కు వెళ్లాలి అని అనుకునే వారు త‌ప్ప‌కుండా వీటిని ట్రై చేయండి. సముద్రం ఒడిలో డైవింగ్ చేయడం, ఎత్తైన కొండపై నుండి దూకడం వరకు ఇక్కడ అనేక సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ నుండి గంగానదిలో రివర్ రాఫ్టింగ్ వరకు మరెన్నోఅడ్వంచ‌ర్స్‌ను ఈ ప్రాంతాల్లో చూడొచ్చు.

riverraft1

రివర్ రాఫ్టింగ్

వేసవిలో రివర్ రాఫ్టింగ్‌కు ఉత్త‌మ‌మైన ప్రాంతం రిషికేష్‌. ఈ సమయంలో, గంగానది అలల గుండా రివ‌ర్ రాఫ్టింగ్‌కు వెళ్ళాలి. అయితే, ఇది ఎంత ప్రమాదకరమైనదో అంతే సాహసోపేతమైనది. మీకు ఈత కొట్టడం ఇప్పటికే తెలిసి ఉంటే, ఈ అడ్వంచ‌ర్ మీకొక కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది. రివ‌ర్ రాఫ్టింగ్ అంటే న‌దీ ప్ర‌వాహంలో ర‌బ్బ‌ర్‌బోట్‌లో ప్ర‌యాణించ‌డం. నీటి ప్ర‌వాహ‌న్ని బ‌ట్టి ఆ బోట్ ప్ర‌వ‌హిస్తూ ఉంటుంది. ఆ న‌దిలో రాళ్లు ర‌ప్ప‌లు, లోయ‌లు, గుంత‌లు వంటివి ఉంటాయి. దీంతో రాఫ్టింగ్ చేసే ఓత్సాహికులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొని చేస్తారు. ఒక‌వేళ నీటిలో ప‌డితే చ‌నిపోయే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. కాబ‌ట్టి ఎంతో జాగ్ర‌త్త‌గా చేయాలి.

bungyjump1

బంగీ జంపింగ్

ఇటీవలి బంగీ జంపింగ్ అడ్వంచ‌ర్ కూడా భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ వేసవిలో మీరు రిషికేశ్‌లో బంగీజంప్ అడ్వంచ‌ర్‌ను చేయొచ్చు. ఎత్త‌యిన ప్ర‌దేశం నుండి ఎలాస్టిక్ తాడుతో కింద‌కు దూక‌డం. ఇది మ‌నం సినిమాల్లోనూ చూసి ఉంటాం. ఒక బ్రిడ్జిపై నుంచి లేదా కొండ‌పై నుంచి లోయ‌లోకి దూక‌డం ద్వారా మ‌న‌లోని భ‌యం మొత్తం పోతుంది. కానీ, చాలామంది సాహ‌స ప్రియులు బంగీజంప్ చేయ‌డానికి ఆస‌క్తి చూపుతారు. ఇది ఎంతో సాహ‌సంతో కూడుకున్న‌దే.

giantswing1

జెయింట్ స్వింగ్

భారతదేశంలోని అత్యంత ఉత్తేజకరమైన సాహసాలలో జెయింట్ స్వింగ్ ఒకటి. అవి భూమి నుండి 83 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అయితే, వీటిని సరిగ్గా బెల్టు సహాయంతో స్వింగ్‌కి కట్టివేస్తారు. జెయింట్ స్వింగ్ అంటే గాలిలో ఊగీస‌లాడటం ఎత్త‌యిన ప్ర‌దేశం నుండి లోయ‌లోకి లేదా న‌దీ ప్ర‌వాహం పైకి దూకేయ‌డం. కొన్ని చోట్ల ఇది భారీ ఊయ‌ల‌లా ఉంటుంది. దీంతో అక్క‌డ కూర్చిని ఎత్త‌యిన ప్ర‌దేశంలో ఊగిస‌లాడ‌టం చెయొచ్చు. మ‌రికొన్ని చోట్ల పెద్ద తాడును శ‌రీరానికి క‌ట్టుకొని కింద‌కు దూకేయ‌డం. అలా కాసేపు గాలిలో తేలియాడ‌టం. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి క్రీడ‌ను అస్వాదించాలంటే మీరు రిషికేష్ వెళ్లాల్సిందే.

suba1

స్కూబా డైవింగ్

ఇది నీటి లోప‌ల జ‌ర్నీ. న‌డుచుకుంటూ వెళ్ల‌డం మాదిరే ఉంటుంది. కాక‌పోతే నీటిలో న‌డ‌వాలి. నీటిలోప‌లి జీవుల‌ను ద‌గ్గ‌ర‌గా చూస్తు అలా సాగిపోవ‌డం మ‌ర‌పురాని అనుభూతినిస్తుంది. గోవా, అండ‌మాన్ దీవులు స్కూబా డైవింగ్‌కు ప్ర‌ముఖ కేంద్రాలుగా ఉన్నాయి.

foxflying1

ఫ్ల‌యింగ్ ఫాక్స్

ఫ్లయింగ్ ఫాక్స్ ప్రకృతి దృశ్యాన్ని వీక్షించేందుకు ఓ స‌రికొత్త మార్గం. ఇందులో సాధారణంగా ఒకేసారి ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటారు. కానీ చాలా సార్లు ఇద్దరు వ్యక్తులతో కూడా చేయవచ్చు. ఈ సమయంలో, తాడులతో కట్టబడిన వ్యక్తులు తమ చేతులను నేల వైపుకు చాచి ఎగురుతూ కనిపిస్తారు. భూమి ద్వారా, వారు సుమారు 150 మీటర్ల ఎత్తు వరకు తీసుకువెళతారు. సూపర్మ్యాన్ శైలిలో 140 mph వేగంతో ఎగురుతూ కనిపిస్తారు.

More News

    Read more about: river rafting bungee jumping
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+