ఈ వేసవిలో వైజాగ్‌లోని ఈ బీచ్‌లకు వెళ్దామా?
ఎండలు మండిపోతున్నాయి. చాలామంది ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్లడమో లేక, బీచ్‌లకు వెళ్లడమో చేస్తున్నారు. మరికొందరైతే హిల్‌స్టేషన్లకు బయలుదేరుతున్నారు. కొందరు జలపాతాలకు పరుగెతుంటారు.
దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌లకు ఎలాంటి కొదవే లేదు. ఎపిలోని విశాఖపట్నంలో వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్లని చల్లని బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నం అనేక అందమైన బీచ్‌లతో సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉంది. రండి ఈ ప్రాంతంలోని బీచ్‌లను ఈ వేసవిలో సందర్శించేయండి.

రిషికొండ బీచ్
రిషికొండ బీచ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న సహజమైన జలాలతో నిండి ఉన్నఅద్భుతమైన బీచ్. ఈ బీచ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంతో నిర్వహించబడుతోంది. వైజాగ్ నగరం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన బీచ్ ఉంది. వైజాగ్ నగరంలోని పర్యాటకులకు ఈ బీచ్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది.
ఈ బీచ్‌ను జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా అందమైన సముద్ర తీరప్రాంతం. ఇక్కడ చాలా రిసార్ట్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈత కొంచెం ప్రమాదకరం అనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ ఇక్కడ స్పీడ్ బోట్, జెట్ స్కీ బోట్‌లను నడుపుతుంది. పిల్లలకు, పెద్దలకు ఇదొక కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా రీలిఫ్‌ను కూడా అందిస్తుంది.

యారాడ బీచ్
యారాడ సముద్రతీరం విశాఖపట్నం సమీపంలోని యారాడ వద్ద ఉన్న ఒకపర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం వైజాగ్ నగరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీరం డాల్పిన్ నోస్ కొండలకు సమీపంలో ఉంది. ఈ తీరానికి మూడువైపులా కొండలు, నాలుగోవైపు బంగాళాఖాతం ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటుంది.
ఇక్కడ అరటితోటలు, కొబ్బరి చెట్లను అధికంగా చూడొచ్చు. ఈ ప్రాంతంలో టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు కూడా జరిగాయి. ఈ బీచ్ గంగవరం పోర్టుకు దగ్గరగా ఉండడంతో కొన్ని పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వలన నీరు కొంత కలుషితమవుతోంది. యారాడ బీచ్ మూడువైపులా కొండలతో నాల్గవ వైపు బంగాళాఖాతంతో చుట్టుముట్టబడిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది పచ్చదనం మరియు మృదువైన బంగారు ఇసుకతో కప్పబడి ఉంటుంది.

ఆర్‌కె బీచ్
విశాఖపట్నంలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఆర్‌కె బీచ్ ఒకటి. రామకృష్ణ బీచ్ వైజాగ్ రైల్వేస్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. బంగాళాఖాతంలో ఒక అద్భుతమైన పొడవైన బీచ్ ఇది. పార్క్ నుండి బీచ్ రోడ్డులో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం నుండి దీనికి పేరు వచ్చింది. వైజాగ్ నగరంలోని ప్రధాన ఆకర్షణలలో రామకృష్ణ బీచ్ ఒకటి.
సబ్‌మెరైన్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమం, ఆక్వేరియం, కాళీ టెంపుల్ ప్రముఖవ్యక్తుల విగ్రహాలు, రోడ్‌సైడ్ రెస్టారెంట్లు మరియు పార్కులు ఆర్‌కె బీచ్‌లో అదనపు ఆకర్షణలు. ఆర్‌కెబీచ్ కుటుంబ విహారాయాత్రలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. పెద్దసంఖ్యలో పర్యాటకులు ఆకర్షిస్తుంది. ఈ బీచ్‌లో సన్‌బాత్, బీచ్ వాలీబాల్ మరియు విండ్ అలాగే వాటర్ సర్పింగ్‌లకు ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications













