Search
  • Follow NativePlanet
Share
» »పెద్దాపురం మ‌రిడ‌మ్మ‌ వారి ఉత్స‌వాల‌కు వెళ్లొద్దాం రండి!

పెద్దాపురం మ‌రిడ‌మ్మ‌ వారి ఉత్స‌వాల‌కు వెళ్లొద్దాం రండి!

తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురంలో శ్రీ మ‌రిడ‌మ్మ ఆషాఢ‌మాసం జాత‌ర ఉత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈరోజు (జూలై 4) రాత్రి జాగ‌ర‌ణ ఉత్స‌వంతో జాత‌రను ప్రారంభిస్తారు. ఈ జాత‌ర మ‌హోత్స‌వాలు జూలై 5 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కూ అంటే, 37 రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రిడ‌మ్మ అమ్మ‌వారి మ‌హోత్స‌వం ప్ర‌తి ఏటా జేష్ఠ మాసంలోని అమావాస్య నుండి ప్రారంభ‌మై ఆషాడ‌మాసంలోని అమావాస్య వ‌ర‌కు వైభ‌వంగా జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇప్ప‌టికే రాష్ట్ర దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ఉత్స‌వాల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లూ అధికారులు పూర్తి చేశారు. ఈ మ‌హోత్స‌వాల్లో పాల్గొని, మ‌రిడ‌మ్మ అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకునేందుకు ల‌క్ష‌లాదిమంది భ‌క్తులు రాష్ట్ర న‌లుమూల నుండి ఇక్క‌డికి వ‌స్తుంటారు.

చారిత్ర‌క నేప‌థ్యం..

ఉభ‌య‌ గోదావ‌రి జిల్లాల్లో ఎంతో విశిష్టత క‌లిగిన మ‌రిడ‌మ్మ‌ వారి ఉత్స‌వాల‌కు పెద్దాపురం ముస్తాబ‌యింది. ఈ ఆల‌యానికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. పెద్దాపురంలో మానోజి చెరువుకి అతి స‌మీపంలో శ్రీ మ‌రిడ‌మ్మ అమ్మ‌వారు 17వ శ‌తాబ్దంలో వెలిశార‌ని పెద్ద‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం మ‌రిడ‌మ్మ త‌ల్లి దేవాల‌యం ఉన్న ప్రాంత‌మంతా చిట్టడవిగా ఉండేంది. ఆ అడ‌విలో ఓ 16 ఏళ్ల యువ‌త ప‌శువుల కాప‌రుల‌కి క‌నిపించి చింత‌ప‌ల్లి వారి ఆడ‌ప‌డుచుని తాను ఈ ప్ర‌దేశంలో ఉన్నాన‌ని త‌మ‌వాళ్ల‌కు చెప్ప‌మ‌ని చెప్పి మాయ‌మైంద‌ట‌.

peddapurammaridamma

వెంట‌నే పశువుల కాప‌రులు చింత‌ప‌ల్లి వారికి విష‌యం తెలియ‌జేశారు. అయితే, అంత‌కు ముందే మ‌రిడ‌మ్మ అమ్మ‌వారు చింత‌ప‌ల్లి వారి క‌ల‌లో క‌నిపించి, త‌న‌కి మానోజీ చెరువు స‌మీపంలో ఆల‌యం నిర్మించాల‌ని ఆజ్ఞాపించింది. ఆ చింత‌ప‌ల్లి కుటుంబ స‌భ్యులు అంతా ఆ మానోజి చెరువు చుట్టుప‌క్క‌ల ప్రాంతంలో వారికి ప‌సుపు పూసిన ఒక క‌ర్ర గ‌ద్దె అమ్మ‌వారి ప్ర‌తిరూపం ద‌ర్శన‌మిచ్చింద‌ని ప్ర‌చారంలో ఉంది. ఆ గ‌ద్దెను అక్క‌డే ప్ర‌తిష్టించి తాటాకు పాక వేసి ఆ నాటి నుండి నిత్య దూప, దీప, నైవేద్యములు చెల్లించి ఆరాధిస్తున్నారని స్థానికులు చెబుతుంటారు. త‌ర్వాత 1952లో ఈ దేవాల‌యం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది.

peddapurammaridamma festival

ఆల‌య ద్వారాలు తెర‌వ‌బ‌డ‌వు..

జ్యేష్ట అమావాస్య‌కు ప‌క్షం (ప‌దిహేను రోజులు) ముందు అమ్మ‌వారికి ఉయ్యాల తాడి (తాటి చెట్టు)ని వేస్తారు. ఈ ఉత్స‌వం రోజు నుండి ముగిసే వ‌ర‌కు అమ్మ‌వారు, ఆమె ఆడ‌ప‌డుచులు అక్క చెల్లెళ్లు ఈ ఉయ్యాల తాడి వ‌ద్దే ఆడిపాడి భ‌క్తుల ఆల‌నా పాల‌నలు చూస్తార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి పొలాల గ‌ట్ల‌మీదవి స‌మ‌ర్పిస్తారు. ఉయ్యాల తాడిని కేవ‌లం భూజాల మీద మాత్ర‌మే దాదాపు వంద‌ మంది ద‌ళిత సోద‌రులు ఊరేగింపుగా డ‌ప్పుల ద‌రువుల‌తో, గ‌ర‌గ‌ల నృత్యాల‌తో దారిపొడువునా గ్రామ ప్ర‌జ‌లు, ఆడ‌ప‌డుచులు తాడిల‌కు నీళ్ల‌తో క‌డిగి ప‌సుపు, కుంకుమ‌లు రాసి పాత పెద్దాపురం కోట‌ముందు మీదుగా గుడి వ‌ద్ద‌కు తీసుకువ‌స్తారు.

peddapurammaridamma devi

వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివ‌ద్ద రావాల‌నేది ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ రోజు (జూలై 4) గురువారం రాత్రి జాగ‌ర‌ణ మ‌హోత్స‌వంలో క‌నులు మిరుమెట్లు గొలిపే విధ్యుత్ దీపాలంక‌ర‌ణ మ‌ధ్య నృత్యాలు, మ్యూజిక‌ల్ బ్యాండ్ పార్టీలు, త‌ప్పిట‌గుళ్లు, కోలాటాలు మ‌రెన్నో జాన‌ప‌థ సాంస్కృతిక కార్య‌క్రామాలు నిర్వ‌హించ‌నున్నారు. జూలై 12 శుక్ర‌వారం అమ్మ‌వారికి కుంభంవేయు సంద‌ర్భంగా ఆల‌య ద్వారాలు తెర‌వ‌బ‌డ‌వ‌ని, భ‌క్తులు గ‌మ‌నించాల‌ని ఆల‌య ఆధికార‌లు కోరుతున్నారు. జూలై 13వ తేదీ ఉద‌యం సంప్రోక్ష‌ణ అనంతం అమ్మ‌వారి పునఃద‌ర్శ‌నం ఉంటుంది.

More News

    Read more about: peddapuram east godavari
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+