Search
  • Follow NativePlanet
Share
» »టిబెటన్ కమ్యూనిటీల అతిపెద్ద సాంస్కృతిక వేడుకను చూసేద్దామా..?

టిబెటన్ కమ్యూనిటీల అతిపెద్ద సాంస్కృతిక వేడుకను చూసేద్దామా..?

లడఖ్ తన అందం, సాహస కార్య‌క్ర‌మాల‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. ప్రసిద్ధ బౌద్ధ సంస్కృతి లడఖ్ చుట్టూనే ఉంటుంది. టూరిస్టులు ఇక్క‌డి సాంప్రదాయిక వైపు ఎక్కువ‌గా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. లడఖ్ బౌద్ధ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అందులో ఒక‌టి హెమిస్ ఫెస్టివల్. హెమిస్ ఫెస్టివల్ లేదా హెమిస్ త్సేచు లడఖ్‌లో జరిగే ఒక వార్షిక పండుగ. ఇది టిబెటన్ కమ్యూనిటీల అతిపెద్ద సాంస్కృతిక వేడుక. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్ర‌సిద్దిచెందిన వేడుక‌.

సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ పండుగను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. టిబెటన్ బౌద్ధమత స్థాపకుడు గురు పద్మసంభవ జయంతి సందర్భంగా లడఖ్‌లోని హేమిస్ మొనాస్టరీలో ఈ పండుగను నిర్వహిస్తారు. వచ్చే 1 వారంలో లడఖ్‌లోని హెమిస్ మొనాస్టరీలో హెమిస్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. సాంప్రదాయ సంగీతం, నృత్యం, లడఖ్ యొక్క గొప్ప సాంస్కృతికతో ముడిప‌డిన‌దే ఈ హేమిస్ ఫెస్టివల్.

హేమిస్ ఫెస్టివల్ గురించి...

హేమిస్ ఫెస్టివల్ అనేది రెండురోజుల పాటు జరుపుకునే పండుగ. ఈ సంవత్సరం లడఖ్ ప్రసిద్ధ హెమిస్ ఫెస్టివల్ జూన్ 16 మరియు 17 తేదీలలో నిర్వ‌హిస్తున్నారు. ఈ పండుగ లడఖ్‌లోని ప్రసిద్ధ పండుగలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఫెస్టివల్ హెమిస్ గోంప్‌లో నిర్వహించబడుతుంది. ఈ పండుగ టిబెటన్ క్యాలెండర్‌ను అనుసరిస్తుంది. అంతేకాదు, చాంద్రమాన నెల పదవ రోజు ఈ పండుగ ప్రారంభమ‌వుతుంది. మఠం యొక్క ప్రధాన సన్యాసి ఈ పండుగను ప్రారంభిస్తాడు. బౌద్ధ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఈ పండుగ మంచిపై చెడు ఆధిపత్యాన్ని సూచిస్తుంది. బౌద్ధ సంస్కృతి ప్రకారం వారి గురువు చెడుతో పోరాడి తన అనుచరులను రక్షించాడు. అందుకే ఈ మఠంలోని ప్రజలు ఆయనకు నివాళులు అర్పించేందుకు వారి గురువు పుట్టినరోజును ఈ విధంగా జరుపుకుంటారు.

culturalcelebrationoftibetan

ఈ పండుగ ప్రధాన ఆకర్షణ చామ్ డ్యాన్స్..

ఈ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా ఇక్క‌డి సాంప్రదాయ నృత్యం, సంగీతం ఆశ్రమంలో ప్రదర్శించబడతాయి. వీటిని చూసేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు త‌ర‌లి వ‌స్తారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ ఈ మఠంలోని లామాలు చేసే ముసుగు నృత్యం. ఈ నృత్య రూపాన్ని లడఖ్ చమ్ డ్యాన్స్ అని కూడా అంటారు. ఇతర నృత్య రూపాలతో పోలిస్తే ఈ నృత్య భంగిమలు నిదానంగా ఉండటం ఈ నృత్య రూపానికి ప్రత్యేకత. ఈ నృత్యరూపంలో ఉండే వ్యక్తీకరణలు వంకరగా ఉంటాయి. లామాలు ధరించే ముసుగులు వారు చిత్రీకరిస్తున్న పురాణంలోని కొన్ని ప్రత్యేక పాత్రలను వర్ణిస్తాయి. నృత్యం వారి గురువుకు నివాళి.ఈ నాటకాలన్నింటిలోనూ చెడుపై మంచి విజయం సాధించిన కథలు కనిపిస్తాయి. వీటితో పాటు డ్రమ్స్, పొడవాటి పైపులు వంటి వివిధ రకాల టిబెటన్ సంగీత వాయిద్యాలను కూడా నృత్యంతో పాటు ఉపయోగిస్తారు.

చేరుకోవడం ఎలా..?

ఈ పండుగలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. అదే ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్‌లో స్థానిక ప్రజలు తయారు చేసిన రంగురంగుల హస్తకళల వస్తువులను అమ్ముతారు. దేశంలోని ఏ మార్గం నుంచైనా ల‌డ‌ఖ్ చేరుకోవ‌చ్చు. విమాన మార్గం ద్వారా ప్ర‌యాణం చేయాల‌నుకునేవారికి హెమిస్ మొనాస్టరీకి సమీప విమానాశ్రయం లేహ్. లేహ్ విమానాశ్రయంలో దిగిన తర్వాత, టాక్సీ లేదా బస్సులో హేమిస్ మొనాస్టరీకి సులభంగా చేరుకోవచ్చు. కానీ ఈ సమయంలో లేహ్‌లోని అన్ని హోటళ్లు, హోమ్ స్టేలు, గెస్ట్ హౌస్‌లు బుక్ అయ్యి ఉంటాయి. హెమిస్ ఫెస్టివల్‌కు హాజరు కావడానికి చివరి నిమిషంలో ప్లాన్ చేస్తుంటే మాత్రం అక్క‌డ స్టే చేసేందుకు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. మ‌రెందుకాల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+