Search
  • Follow NativePlanet
Share
» »ఈ వినాయ‌క చ‌వితికి దేశంలో ప్ర‌సిద్ధిచెందిన బొజ్జ‌గ‌ణ‌ప‌య్య ఆల‌యాల‌ను చూసేద్దామా..?

ఈ వినాయ‌క చ‌వితికి దేశంలో ప్ర‌సిద్ధిచెందిన బొజ్జ‌గ‌ణ‌ప‌య్య ఆల‌యాల‌ను చూసేద్దామా..?

ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ మాసంలో వినాయ‌క‌చ‌వితి వ‌స్తుంది. ప్ర‌తి ఏటా ఈ పండుగ‌ను దేశంలోని వారంతా ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించుకుంటారు. ఇక‌, ఈ ఏడాది కూడా ఈ గ‌ణేషుని ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. వినాయ‌క‌చ‌వితి భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి వ‌చ్చింది. సెప్టెంబర్ 17వ తేదిన అనంత చతుర్థి నాడు వినాయకుడి విగ్రహాల‌ను నిమ‌జ్జ‌నం చేసే కార్య‌క్ర‌మం ఉంటుంది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా మ‌హారాష్ట్ర‌లో కూడా వినాయ‌క చవితి ఉత్స‌వాల‌ను ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వినాయ‌క చ‌వితిరోజున వినాయ‌కుని విగ్రహాలు ఇంటికి తీసుకొచ్చి మూడు, ఐదు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు వినాయకుడికి పూజలు చేస్తారు. ఆ త‌ర్వాత నిమజ్జనం చేస్తారు.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా వీదీ వీధి గ‌ణేషుని విగ్ర‌హాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ప్ర‌తి వీధిలో గణేషుని మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాలకు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. ఈ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా బొజ్జ‌గ‌ణ‌ప‌య్య‌కు నైవేద్యాలు కూడా స‌మ‌ర్పిస్తారు. తొమ్మిదిరోజులు ఆట‌పాట‌ల‌తో ఊర్ల‌న్నీ కోలాహాలంగా ఉంటాయి. ఇక‌, 10వ రోజున గ‌ణేషునికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేస్తారు. ఈ వినాయక చవితికి వినాయకుడి ఆశీస్సులు పొందాల‌నుకుంటే మాత్రం దేశంలో ప్ర‌సిద్ధిచెందిన వినాయక ఆల‌యాల‌ను వీక్షించాల్సిందే. రండి వినాయ‌కుని ఆల‌యాల‌ను చూసొద్దాం..

వరసిద్ధి వినాయక దేవాలయం, కాణిపాకం..

దేశంలోని ప్ర‌సిద్దిచెందిన వినాయ‌కుని ఆల‌యాల‌లో చిత్తూరు జిల్లా కాణిపాకం ఒక‌టి. ఇక్క‌డ కొలువై ఉన్న వినాయకుడి ఆలయం ఎంతో మహిమలు కలిగినది. ఈ దేవాలయాన్ని చోళ రాజు కులోత్తుంగ చోళుడు నిర్మించాడ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ ఆల‌యం వెయ్యికి పైగా సంవత్సరాలకు చెందిన పురాతనమైన ఆల‌యంగా పేరుగాంచింది. ఈ ఆల‌యంలో ఉన్న వినాయక విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం రోజు రోజుకి పరిమాణం పెరుగుతుందని ఇక్క‌డికి వ‌చ్చిన‌వారు చెబుతుంటారు. కాణిపాకంలోని వినాయకుడు బావిలో ఉంటాడు. అందుకే ఈ బావిలోని నీరు అస్స‌లు ఎండిపోద‌ని స్థానికులు అంటుంటారు. ఈ వినాయ‌క‌చ‌వితికి త‌ప్ప‌కుండా కాణిపాకం వెళ్లాల్సిందే..!

srivarasiddinayak

సిద్ధి వినాయక ఆలయం, ముంబై...

దేశంలోనే ప్రసిద్ధి చెందిన గణేష్ దేవాలయాల్లో ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయం ఒకటి. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ముంబైలో వెలసిన సిద్ధి వినాయక ఆలయాన్ని త‌ప్ప‌కుండా వీక్షించాల్సిందే. వినాయక చవితికి ప్ర‌త్యేకంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్క‌డికి తరలి వస్తుంటారు. ఈ ఆలయాన్ని 1801లో నిర్మించడం జ‌రిగింది. ఈ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది న‌మ్మ‌కం.

ఈ దేవాలయంలోని వినాయకుడిని నవసాచ గణపతి అని కూడా పిలుస్తుంటారు. దాని అర్థం కోరిన కోరికలు తీర్చే వాడని. వినాయ‌కుని ఈ దేవాలయం చూసేందుకు కూడా ఎంతో ఆక‌ర్షిణీయంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే విదేశాల నుంచి కూడా భక్తులు గ‌ణేషుని ద‌ర్శ‌నం కోసం వ‌స్తుంటారు. నిత్యం ఆల‌యంలో పూలు, దీపాలతో బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ని అందంగా అలంకరిస్తుంటారు.

shrimantdagdushethalwaiganapatitemple1

శ్రీమంత్ దగ్దుషెత్ హల్వాయి గణపతి ఆలయం, మ‌హారాష్ట్ర‌..

దేశంలో ప్ర‌సిద్ధిచెందిన గ‌ణేశుని ఆల‌యాల‌లో మ‌రొక‌టి మ‌హారాష్ట్ర‌లోని శ్రీ మంత్ దగ్దుషెత్ గణపతి ట్రస్ట్. ఇది దేశంలోనే అతిపెద్ద ట్రస్ట్ లలో ఒకటి. పూణేలో ఈ శ్రీమంత్ దగ్దుషెత్ హల్వాయి గణపతి ఆలయం వెల‌సింది. ప్ర‌తిఏటా ఇక్క‌డికి లక్ష మందికి పైగా యాత్రికులు వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ ఆలయంలో 7.5 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుగా గణపతి విగ్రహం కొలువై ఉంటుంది.

More News

    Read more about: vinayaka chavithi kanipakam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+