Search
  • Follow NativePlanet
Share
» »జలంధర్ సమీపంలోని ఈ హిల్ స్టేషన్లను చూద్దామా..!

జలంధర్ సమీపంలోని ఈ హిల్ స్టేషన్లను చూద్దామా..!

జలంధర్ సమీపంలోని ఈ హిల్ స్టేషన్లను చూద్దామా..!

జలంధర్ అనేక పురాతన, ఉత్తమ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా ఇక్కడ సమీపంలోని హిల్ స్టేషన్లు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. స్నేహితుల‌తో, కుటుంబ‌స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం జలంధర్ సమీపంలోని ఈ హిల్ స్టేషన్లను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

1

నలగర్

జలంధర్ లేదా చండీగఢ్ సమీపంలోని హిల్ స్టేషన్ల విషయానికి వస్తే, ముందుగా గుర్తుకు వచ్చే పేరు నలగర్. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన మైదానాలలో ఉన్న నలాఘర్ ఎత్తైన పర్వతాలు, ఆహ్లాదకరమైన వాతావరణానికి చాలా ప్రసిద్ధి చెందింది. నలాఘర్ సందర్శించడానికి జలంధర్ నగరం నుండి మాత్రమే కాకుండా, పంజాబ్‌లోని ఏ నగరం నుండి అయినా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ముఖ్యంగా, వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో ఇక్కడ గరిష్టంగా జనం రద్దీగా ఉంటారు. అందమైన లోయలతో పాటు, నలాగర్ కోట, రామ్‌ఘర్ కోట, గోవింద్ సాగర్ సరస్సు వంటి అద్భుతమైన ప్రదేశాలను కూడా ఇక్క‌డ చూడొచ్చు.
జలంధర్ నుండి నలగర్ సుమారు 125 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

2

పర్వానూ

పర్వానూ అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. సిమ్లాకు వెళ్లే జాతీయ రహదారి 5 లో ఉన్న పర్వానూ, ఏ సమయంలోనైనా సంద‌ర్శించేందుకు వారాంతపు సెలవులకు ఉత్తమమైనది. చిన్న పెద్ద పర్వతాలు, ఎక్కడ చూసినా పచ్చదనం, పెద్ద దేవదారు చెట్లు పర్వానూ అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఈ ప్రదేశపు అందం జూలై-ఆగస్టు నెలలో మ‌రింత రెట్టింప‌వుతుంది. ఇక్కడ చినుకులతో కూడిన వర్షాలు ప్రతిచోటా కనిపిస్తాయి. పర్వానూలో టింబర్ ట్రైల్, ఫ్రూట్ గార్డెన్, గురుద్వారా నాడా సాహిబ్, పింజోర్ గార్డెన్ వంటి అనేక గొప్ప ప్రదేశాలను చూడవచ్చు. జలంధర్ నుండి పర్వానూ సుమారు 167 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

3

ధర్మశాల

హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత అందమైన, మనోహరమైన హిల్ స్టేషన్‌ల‌లో మ‌రొక‌టి ధర్మశాల. ధర్మశాల దాని అందమైన ప్రదేశాలతో పాటు సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. చలికాలమైనా, వేసవికాలమైనా ఇక్కడ నిత్యం పర్యాటకుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. ధర్మశాలలో వార్ మెమోరియల్, ట్రియుండ్, భాగ్సు జలపాతం, నామ్‌గ్యాల్ మొనాస్టరీ మరియు దాల్ లేక్ వంటి అనేక గొప్ప ప్రదేశాలను తిల‌కించ‌వ‌చ్చు. జలంధర్ నుండి ధర్మశాలకు సుమారు 196 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

పాలంపూర్

పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. అందమైన లోయలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం దేశ, విదేశాల నుండి చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన పర్వతాలు, అందమైన సరస్సులు-జలపాతాలు మరియు పెద్ద దేవదారు చెట్లు ఈ ప్రదేశానికి అందాన్ని ఇస్తాయి. ఆగస్టు నెలలో ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. పాలంపూర్‌లో కరేరి సరస్సు, బ్రజేశ్వరి ఆలయం, ధౌలాధర్ రేంజ్, జ్వాలాజీ దేవాలయం వంటి ఉత్తమ ప్రదేశాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ కోసం అనేక ఎంపికలు కూడా ఉన్నాయి. జలంధర్ నుండి పాలంపూ్ర్‌కి సుమారు 174 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

కసౌలి

హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన మైదానాలలోని మ‌రో ప్రాంతం కసౌలీ. ఈ ప్రదేశాన్ని ఢిల్లీ, పంజాబ్ చుట్టుపక్కల ప్రజలు ఎక్కువగా సందర్శిస్తారు. కసౌలి ప్రకృతి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువ కాదు. పచ్చదనం, అద్భుతమైన దృశ్యాలు ప్రతిచోటా చూడవచ్చు. కసౌలిలో టింబర్ ట్రైల్, గిల్బర్ట్ నేచర్ ట్రైల్, సన్‌సెట్ పాయింట్, మంకీ పాయింట్ వంటి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్క‌డ ఎన్నోసాహస కార్యకలాపాలను చేయొచ్చు. జలంధర్ నుండి కసౌలికి సుమారు 189 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

More News

Read more about: nalagarh parwanoo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+