Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ధర్మశాల

ధర్మశాల - హిమాచల్ ప్రదేశ్ కు శీతాకాల రాజధాని!

51

ధర్మశాల, హిమాచల ప్రదేశ్ లోని కాంగ్రాకు ఈశాన్యాన 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పేరొందిన పర్వత కేంద్రం. ఈ నగరం చండీగఢ్ నుండి 251 కిలోమీటర్లు, మనాలి నుండి 252 కిలోమీటర్లు; షిమ్లా నుండి 243 కిలోమీటర్లు, న్యూ ఢిల్లీ నుండి 247 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం కాంగ్రా లోయకు ప్రవేశద్వారంగా పరిగణింపబడుతుంది. ఈ ప్రాంతపు ప్రాకృతిక సౌందర్యం మంచుతో కప్పబడిన ధవళాధర్ పర్వతశ్రేణుల నేపధ్యంలో ఇనుమడిస్తుంది.

కాంగ్రా లోయలోని ఈ ముఖ్య నగరం 1905 లో ఒక విధ్వంసకర భూకంపాన్ని చవిచూసింది, తర్వాత దీనిని పునర్నిర్మి౦చినప్పుడు ఇది ఒక అందమైన ఆరోగ్య విడిదిగా, ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ నగరం రెండు వేర్వేరు ప్రాంతాలుగా విడగొట్టారు, ఎగువ ధర్మశాల, దిగువ ధర్మశాల. దిగువ ధర్మశాల వాణిజ్య కేంద్రం కాగా, ఎగువ ధర్మశాల వలస జీవనశైలికి పేరొందింది. మెక్లియాడ్ గంజ్, ఫర్సిత్ గంజ్ బ్రిటిష్ శివార్లకు ప్రాతినిథ్యం వహిస్తాయి, ఇవి సందర్శి౦చదగ్గవి.

ధర్మశాల ఓక్, కోనిఫెరస్ చెట్ల అడవుల మధ్య మూడు వైపులా ధవళాధర్ శ్రేణులను సరిహద్దులు కల్గి ఉండి, కాంగ్రా లోయకు చెందిన మంత్రముగ్ధ దృశ్యాలను అందిస్తుంది. ధర్మశాలలో ఉన్న కాంగ్రా కళా మ్యూజియంలో ఈ ప్రాంతపు కళాత్మక, సాంస్కృతిక మూలాలు ఉన్నాయి. 5 వ శతాబ్దపు కళాఖండాలతో బాటు శిల్పాలు, చిత్రాలు, నాణేలు, కుండలు, ఆభరణాలు చేతివ్రాతలు, రాజరికపు దుస్తులు ఇక్కడ చూడవచ్చు.

ధర్మశాల అంతర్జాతీయ గుర్తింపును పొందటమే తో బాటుగా ‘ది లిటిల్ లాసా ఇన్ ఇండియా’ అనే ప్రతిష్టాత్మక బిరుదును కూడా పొందింది. ఈ అందమైన ప్రాంతాన్ని పరమ పూజ్య దలైలామా దేశ బహిష్కరణ సమయంలో తన తాత్కాలిక నివాస ప్రాంతంగా చేసుకొన్నారు. విస్తారమైన టిబెటన్ స్థావరాల కారణంగా, ఈ ప్రాంతాన్న ఇప్పుడు 'లామాస్ యొక్క భూమి' అని కూడా అంటారు. మెక్లియాడ్ గంజ్ వంటి ప్రాంతాలు ధార్మిక కేంద్రాలుగా పేరొందాయి, ఇక్కడ టిబెట్ బౌద్ధమతపు విద్య, ప్రచారం జరుగుతుంది. అనేక హిందూ, జైన దేవాలయాలతో బాటుగా వివిధ సన్యాసి మఠాలు, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు అందమైన టిబెటన్ హస్తకళాకృతులను, వస్త్రాలు, తంగ్కాస్, హస్తకళాకృతులతో కూడిన స్థానిక జ్ఞాపకార్ధాలను మెక్లియాడ్ గంజ్ మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు.

అనేక చర్చీలు, దేవాలయాలు, మ్యూజియములు, మఠాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. జ్వాలాముఖి దేవాలయం, బ్రిజేశ్వరి దేవాలయం, చాముండా దేవాలయం వంటి అనేక పురాతన దేవాలయాలు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. కాంగ్రా ఆర్ట్ మ్యూజియం, సెయింట్ జాన్ చర్చి, యుద్ధ స్మారక చిహ్నం ధర్మశాలలోని కొన్ని చూడదగిన ఇతర ప్రముఖ పర్యాటక స్థానాలు. వీటితోబాటుగా ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ షాపింగ్ కేంద్రం కొత్వాలి బజార్కు కూడా అనేక మంది సందర్శకులు వస్తారు. పైగా తేయాకు తోటలు, పైన్ అడవులు, దేవదారు అడవులు ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణను జోడిస్తున్నాయి.

గగ్గల్ విమానాశ్రయం, కాంగ్రా లోయలో ధర్మశాలకు అతి దగ్గరగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం దేశవాళీ విమానాల ద్వారా న్యూ ఢిల్లీకు అనుసంధానాన్ని కల్గి ఉంది. విదేశీ పర్యాటకులు ఢిల్లీ నుండి గగ్గల్ విమానాశ్రయానికి విమానసౌకర్యం పొందవచ్చు. ధర్మశాల నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా మందిర్ అతి దగ్గరి రైలు కేంద్రం.

అయితే అన్ని రైళ్ళు ఈ చిన్న రైలు జంక్షన్లో ఆగవు. ధర్మశాల నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ అతి దగ్గరి ప్రధాన రైలు స్టేషన్. పఠాన్ కోట్ రైలు స్టేషన్ భారత దేశంలోని అన్ని ప్రధాన రైలు స్టేషన్లకు అనుసంధానాన్ని కల్గి ఉంది. రోడ్డు ద్వారా ప్రయాణించాలనుకునే పర్యాటకులు ధర్మశాల దగ్గరలోని నగరాల నుండి ప్రైవేటు, రాష్ట్ర రవాణా బస్సులు రెండింటి సౌకర్యాన్ని పొందవచ్చు.

ధర్మశాలలో వేసవికాలం మార్చ్ నుండి జూన్ నెలల మధ్య ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత 22° సెంటిగ్రేడ్ల నుండి 38° సెంటిగ్రేడ్ల మధ్య ఉంటుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం వలన సాహస ప్రియుల పర్వతారోహణకు ఈ కాలం ఉత్తమంగా ఉంటుంది. భారీ వర్షాలు ఉండటం వలన పర్యాటకులు సాధారణంగా వర్షాకాలంలో ధర్మశాల సందర్శనకు రారు.

శీతాకాలంలో, ఈ ప్రాంతంలో వాతావరణం చాల చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత - 4° సెంటిగ్రేడ్ కు పడిపోతుంది, ఫలితంగా సరిగా కనబడదు, రోడ్లు బ్లాక్ అయిపోతాయి. పర్యాటకులు ధర్మశాల ప్రయాణానికి సెప్టెంబర్, జూన్ నెలల మధ్య ప్రణాళిక వేయవచ్చు.

ధర్మశాల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ధర్మశాల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ధర్మశాల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ధర్మశాల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా: ధర్మశాలకు వెళ్లాలనుకునే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి సౌకర్యవంతమైన అనేక బస్సు సర్వీసులు ఉన్నాయి. చుట్టుపక్కల నగరాల నుండి ఈ ప్రాంతానికి రోజువారీ బస్సులు ఉన్నాయి. ఒక్కొక్కరికీ షుమారు 1600 రూపాయల ధరతో డిల్లీ నుండి ధర్మశాలకు లగ్జరీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: ధర్మశాల కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా మందిర్ సమీప ప్రధాన రైల్వే స్టేషన్. అయితే ఇక్కడ కొన్ని రైళ్ళు మాత్రమే ఆగుతాయి, పఠాన్ కోట్ రైల్వే జంక్షన్ సందర్శకులకు ప్రత్యామ్నాయ మార్గంగా సేవలను అందిస్తుంది. ఈ రైల్వే జంక్షన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ధర్మశాలకు ప్రధాన రవాణా సదుపాయాలు వాయు, రైలు, రోడ్డు మార్గాలు బాగా అనుసంధాని౦చబడి ఉన్నాయి. వాయుమార్గం: ధర్మశాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగ్గల్ సమీప విమానాశ్రయం. దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని ధర్మశాల విమానాశ్రయం అనికూడా అంటారు. న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (ఐజిఐ) అంతర్జాతీయ పర్యాటకులను ధర్మసాలకు కలుపుతుంది. ఈ విమానాశ్రయం నుండి ధర్మశాల వెళ్ళడానికి ఒక్క ట్రిప్పుకు ధర షుమారు 350 రూపాయల ఖర్చుతో టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue